వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నంద‌మూరి కుటుంబానికి టీఆర్‌య‌స్ భారీ ఆఫర్ ,అంగీక‌రిస్తారా : బాబుకు చెక్ పెట్టేందుకేనా..!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజ‌కీయాల్లో కొత్త ట్విస్ట్. ప్ర‌భుత్వ ఏర్ప‌డినా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌లేదు. ఇత‌ర పార్టీల ఎమ్మెల్యేలు కారు ఎక్క‌టానికి సిద్దంగా ఉన్నారు. ఇదే స‌మ‌యంలో..టిఆర్‌య‌స్ అధినాయ‌క‌త్వం చంద్ర‌బాబుకు షాక్ ఇవ్వాల‌నే కృత ని శ్చ‌యంతో ఉంది. ఇందులో భాగంగా నంద‌మూరి వార‌సుల‌కు భారీ ఆఫ్ ఇచ్చింది. తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలో సుహాసిని ని చంద్ర‌బాబు పావుగా వాడుకుంటున్నార‌ని.. ప్రేమ ఉంటే లోకేష్ త‌ర‌హాలో మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌వ‌చ్చు కదా అని ప్ర‌శ్నించారు. ఇప్పుడు, దీనికి కొన‌సాగింపుగా టిఆర్‌య‌స్ ప్ర‌ముఖులు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఆస‌క్తి క‌రంగా మారా యి. మ‌రి..వారి ఆఫ‌ర్ ను నంద‌మూరి కుటుంబం అంగీక‌రిస్తుందా...

తెలంగాణ ఎన్నిక‌ల నుండే గురి..

తెలంగాణ ఎన్నిక‌ల నుండే గురి..

తాజాగా జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో టిడిపి అధినేత చంద్ర‌బాబు తొలుత టిఆర్‌య‌స్ తో పొత్తు కోసం ప్ర‌తిపాద‌న చేసారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా కేటీఆర్ బ‌హిర్గ‌తం చేసారు. దీనిని చంద్ర‌బాబు సైతం ధృవీకరించారు. అయితే, టిఆర్‌య‌స్ అధినేత ఈ ప్ర‌తిపాద‌న‌కు అంగీక‌రించ లేదు. ఆ త‌రువాత చంద్ర‌బాబు స్వ‌యంగా రాహుల్ వద్ద‌కు వెళ్లి చేతులు క‌లిపారు. తెలంగాణ ఎన్నిక‌ల్లోనూ క‌లిసి పోటీ చేసారు. అయితే, ఫ‌లితాలు మాత్రం టిఆర్‌య‌స్ కు అనుకూ లంగా వ‌చ్చాయి. ఇక‌, తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ హ‌రికృష్ణ మ‌ర‌ణం స‌మ‌యంలో ప్ర‌భుత్వ ప‌రంగా తాము ఏ ర‌కంగా గౌర‌వించిందీ కేటీఆర్ ఆంధ్ర ఓట‌ర్లు ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో వివ‌రించారు. ఇక‌, సుహ‌సిని ని కుకుట్ ప‌ల్లి నియె జ‌క‌వ‌ర్గం నుండి చంద్ర‌బాబు బ‌రిలోకి దింప‌టాన్ని టిఆర్‌య‌స్ నేత‌లు త‌ప్పు బ‌ట్టారు. చంద్ర‌బాబు స్వార్ధం కోస‌మే సుహాసినిని పావుగా వాడుకుంటున్నార‌ని ఆరోపించారు. ఇక‌, ఎన్నిక‌ల్లో సుహసిని ఓడిపోయారు. దీంతో..టిఆర్‌య‌స్ ఇప్పుడు కొత్త వ్యూహానికి తెర తీసింది.

చంద్ర‌బాబు కు చెక్ పెట్టేలా ... త‌మ‌కు క‌లిసొచ్చేలా..

చంద్ర‌బాబు కు చెక్ పెట్టేలా ... త‌మ‌కు క‌లిసొచ్చేలా..

తెలంగాణ ఎన్నిక‌ల్లో గెలిచినా..ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ త‌న మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించ‌లేదు. ఇత‌ర పార్టీల నుండి వ‌చ్చే వారిని ఆక‌ర్షించ‌టం కోసం విస్త‌ర‌ణ పెండింగ్ లో పెట్టార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యం లో కాంగ్రెస్ -టిడిపి పార్టీల ఉనికి ప్ర‌శ్నార్ద‌మ‌య్యేలా లోక్‌స‌భ ఎన్నిక‌ల నాటికి వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా..ఈ రెండు పార్టీల నుండి గెలిచిన వారిని త‌మ పార్టీలో చేర్చుకొని ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. ఇప్ప‌టికే ఆ ఆప‌రేష‌న్ లో స‌గం భాగం పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌, గ్రేట‌ర్ ఎన్నిక‌లు..అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టిఆర్‌య‌స్ కు మ‌ద్ద‌తుగా నిలిచిన సీమాంధ్ర ఓట‌ర్ల‌ను మ‌రింత‌గా ఆక‌ట్టుకొనేందుకు..ఏపి రాజ‌కీయాల పై ప్ర‌భావం చూపించేందుకు సరి కొత్త వ్యూహం తో టిఆర్‌య‌స్ అడుగులు వేస్తోంది. టిడిపికి వ్య‌తిరేకంగా ఉండే సీమాంధ్రులు తెలంగాణ ప్రాంతంలో మాత్రం త‌మ‌తోనే ఉంటార‌ని గ‌త ఎన్నిక‌ల ద్వారా స్ప‌ష్ట‌మైంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఇక‌, టిడిపి కి అన‌కూలంగా ఉన్న వారి ని సైతం త‌మ వైపు తిప్పుకొని..లోక్‌స‌భ ఎన్నిక‌ల నాటికి వారి మ‌ద్ద‌తు సైతం పూర్తి స్తాయిలో పొందేలా కొత్త ప్ర‌తిపాద‌న ల‌ను తెర మీద‌కు తీసుకొస్తున్నారు.

సుహాసినికి మంత్రి ప‌ద‌వి..స‌మ్మ‌తించేనా.!

సుహాసినికి మంత్రి ప‌ద‌వి..స‌మ్మ‌తించేనా.!

టిడిపి అభ్య‌ర్ధిగా కుక‌ట్ ప‌ల్లి నుండి పోటీ చేసి ఓడిపోయిన సుహాసినిని టిఆర్‌య‌స్ లో చేర్చుకోవాల‌నే ఆలోచ‌న‌కు టిఆర్‌య‌స్ శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఎన్నిక‌ల స‌మ‌యంలో తాము చంద్ర‌బాబు పై చేసిన ప్ర‌చారానికి త‌గిన‌ట్లు గా తామే నంద‌మూరి కుటుంబానికి..హ‌రికృష్ణ కుమార్తెగా ప్రాధాన్య‌త ఇస్తున్నామ‌నే సంకేతాలు ఇవ్వ‌టానికి టిఆర్‌య‌స్ నేత‌లు ముందుకు వ‌స్తున్నారు. ఇందులో భాగంగా..సుహాసినికి ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇచ్చి.. మంత్రి గా అవ‌కాశం క‌ల్పిస్తా మ‌ని సుహాసినికి టిఆర్‌య‌స్ ప్ర‌ముఖుడు ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ సమాచారం. చంద్ర‌బాబు సొంత పార్టీలో నంద‌మూరి కుటుంబ స‌భ్యుల‌ను పావుగా వాడుకోవ‌టం మిన‌హా..ప‌దువులు ఇవ్వ‌కుండా కేవ‌లం త‌న కుమారుడికే మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌ని టిఆర్‌య‌స్ నేత‌ల ప్ర‌చారం. దీంతో..ఇప్పుడు నంద‌మూరి వార‌సురాలికి తామే ప్రాధాన్య‌త ఇవ్వ‌టం ద్వారా.. సీమాంధ్ర ఓట‌ర్ల పై త‌మ ప‌ట్ట మ‌రింత సానుకూల‌త పెరుగుతుంద‌నే అంచ‌నాతో ఉన్నారు. ఈ మేర‌కు మంత‌నాలు జ‌రిపి..ఒప్పించే బాధ్య‌త‌ను పార్టీలో ఓ ప్ర‌ముఖుడికి అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది. అయితే, సొంత కుటుంబానికి చెందిన టిడిపిని కాద‌ని టిఆర్‌య‌స్ లో చేరితే..అది ప్ర‌తికూల ప్ర‌భావం చూపిస్తుంద‌నే భావ‌న‌లో సుహ సిని ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో..భ‌విష్య‌త్ లో రాజ‌కీయాల్లో కొన‌సాగాల‌నే ఆలోచ‌న లేన‌ది చెబుతున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, టిఆర్‌య‌స్ ప్ర‌ముఖ నేత ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

English summary
TRS Trying to get Nandamuri Suhasini into cabinet. One of the top leaders in TRS Started discussions with her family. Whether she interest in this proposal or not is note confirmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X