ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రత్యర్థులపై నమ్మకమా?.. పోలీసులపై అపనమ్మకమా?.. ఈవీఎంల భద్రతకు గులాబీ క్యాడర్..!

|
Google Oneindia TeluguNews

ఖమ్మం : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమైంది. అయితే ఎన్నికల తేదీ నాటి నుంచి ఫలితాలు వెలువడానికి నెలన్నర రోజుల సమయం ఉంది. ఎన్నికలకు, ఫలితాలకు ఇంత పెద్ద గ్యాప్ రావడం ప్రధాన పార్టీల అభ్యర్థులను కలవరపెడుతోంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల దగ్గర పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ ను కాపలా పెట్టేందుకు సిద్ధమయ్యారు.

విచిత్రమేంటంటే అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఈవీఎంలకు కాపలాగా ఉండటమనేది విస్మయం కలిగిస్తోంది. సాధారణంగా ప్రత్యర్థి పార్టీశ్రేణులు స్ట్రాంగ్ రూముల దగ్గర కాపలా కాసేందుకు ఈసీ అనుమతి తీసుకుంటారు.

కనురెప్ప వేయం.. బాక్సులు కాపాడతాం..!

కనురెప్ప వేయం.. బాక్సులు కాపాడతాం..!

ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్ కు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి బరిలో నిలిచారు. ఇద్దరూ కమ్మ సామాజిక వర్గానికే చెందినవారు కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. అయితే ఫలితాలు రావడానికి చాలా సమయం ఉండటంతో ఈవీఎంల భద్రతకు టీఆర్ఎస్ శ్రేణులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల దగ్గర కాపలాకు సిద్ధమయ్యారు.

ఏపీ ఎన్నికలపై కేఏ పాల్ క్వశ్చన్ పేపర్..! ఈసీకి 8 ప్రశ్నలుఏపీ ఎన్నికలపై కేఏ పాల్ క్వశ్చన్ పేపర్..! ఈసీకి 8 ప్రశ్నలు

పూటకు ఇద్దరు.. మొత్తం ఆరుగురు

పూటకు ఇద్దరు.. మొత్తం ఆరుగురు

ఈవీఎంల కాపలా కోసం ఆరుగురు టీఆర్ఎస్ కార్యకర్తలు ముందుకొచ్చారట. రోజుకు 3 షిఫ్టుల చొప్పున ఆరుగురు కార్యకర్తలు పోలీసుల బందోబస్తుకు తోడుగా ఉంటారట. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇద్దరు.. మళ్లీ మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు మరో ఇద్దరు.. అలాగే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు ఇంకో ఇద్దరు డ్యూటీలాగా చేస్తారట.

ప్రత్యర్థులపై అనుమానమా?

ప్రత్యర్థులపై అనుమానమా?

ప్రధానంగా ఖమ్మం సెగ్మెంట్ లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉండనుంది. అయితే ఈవీఎంలకు పోలీసులేనా కాపలా?.. మేము సైతం అంటున్న గులాబీ క్యాడర్ తీరు చూసి కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఎన్నికల సంఘం అధికారుల నుంచి పర్మిషన్ తీసుకున్నారా? లేదంటే వారికి వారే కాపలా డ్యూటీలు వేసుకున్నారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

మొత్తానికి ఈవీఎంల భద్రతకు గులాబీ క్యాడర్ సిద్ధం కావడంతో ప్రత్యర్థులు ఏమైనా చేస్తారని వారు భావిస్తున్నారా?.. లేదంటే పోలీసులపై నమ్మకం లేదా? అనే వాదనలు జోరందుకున్నాయి.

English summary
TRS cadre security for evm protection in khammam parliamentary segment. Here, nama nageswara rao from trs and renuka chowdary from congress contested in elections. Big fight among them. Thats why the trs cadre ready for security duties at strong rooms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X