• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

టీఆర్ఎస్ లో న‌మ్మించి గొంతు కోసారు..! తిరుగుబాటు బావుటా ఎగ‌రేసిన వివేక్..!!

|

హైద‌రాబాద్ : రక్తం పంచుకు పుట్టిన సోద‌రుల ప్రేమ ప‌విత్రంగా ఉంటుంది. ఆ మాత్రం ప్రేమ కనబర్చకపోతే అన్నా తమ్ముళ్ల బంధానికి విలువే లేదు. అలాంటి అన్న కోసం రాజకీయంగా ఇబ్బందుల పడుతున్నాడు ఒక తమ్ముడు. ముఖ్యమంత్రి చంద్రశేఖ‌ర్ రావు పై మాజీ ఎంపీ వివేక్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. చంద్ర‌శేఖ‌ర్ రావు నమ్మించి గొంతు కోశారని ధ్వజమెత్తారు. భవిష్యత్ కార్యాచరణపై అనుచరులతో వివేక్‌ సమావేశమయ్యారు. పెద్దపల్లి జిల్లాకు వెంకటస్వామి పేరు పెడతానని చెప్పి చంద్ర‌శేఖ‌ర్ రావు మోసం చేశారన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి ప్రయత్నం చేశానని.. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేసారు. ఆరోప‌ణ‌లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ నుండి బ‌య‌ట‌కు రావ‌డంతో బానిస సంకెళ్ళు తెగిపోయాయ‌ని చెప్పారు.

 గులాబీ పార్టీపై దిక్కార స్వ‌రం..! టీఆర్ఎస్ అదినేత‌పై విమ‌ర్శ‌లు చేసిన వివేక్..!!

గులాబీ పార్టీపై దిక్కార స్వ‌రం..! టీఆర్ఎస్ అదినేత‌పై విమ‌ర్శ‌లు చేసిన వివేక్..!!

టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుండ నమ్మించి గొంతు కోసిందని మాజీ ఎంపీ జీ.వివేకానంద్ ఆరోపించారు. ఇప్పుడు బానిసత్వం నుంచి స్వేచ్చ వచ్చిందన్నారు. టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారంటూ వివేక్ అభిమానుల మధ్య ఉద్వేగానికి గురయ్యారు. అధికార పార్టీలో ఉండి తెలంగాణ కోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించాను. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడుతున్నందుకు త‌న‌పై అప్పటి సీఎం కిరణ్ కుమార్ ఐటీ దాడులు చేయించారని గుర్తు చేసారు. తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చెస్తానని స్పష్టం చేశారు.

 పార్టీలో ఉన్నా త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు..! కేసీఆర్ పై వినోద్, వివేక్ ఆరోప‌ణ‌లు..!!

పార్టీలో ఉన్నా త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు..! కేసీఆర్ పై వినోద్, వివేక్ ఆరోప‌ణ‌లు..!!

ప్రత్యేక తెలంగాణ కోసం కాకా వెంకటస్వామి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్ ని వాక్ అవుట్ చేశారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని యూపీఏ మేనిఫెస్టో లో పెట్టాలని కాకా డిమాండ్ చేశారు. అప్పట్లో వైఎస్ఆర్ వ్యతిరేకించినా... సోనియా గాంధీ తో మాట్లాడి, తెలంగాణ కోసం కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పొత్తు పెట్టించారు అని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎంపీ లను కలుపుకుని దేశ వ్యాప్తంగా ఎంపీలందరి తో మాట్లాడి పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ కోసం కృషి చేశానన్నారు.

 పార్టీలో వినోద్, వివేక్ పై ఆరోప‌ణ‌లు..! పార్టీ కోసం ప‌నిచేయ‌లేదంటున్న క్యాడ‌ర్..!!

పార్టీలో వినోద్, వివేక్ పై ఆరోప‌ణ‌లు..! పార్టీ కోసం ప‌నిచేయ‌లేదంటున్న క్యాడ‌ర్..!!

సొనియా గాంధీ తిరిగి రావాలంటే చంద్ర‌శేఖ‌ర్ రావు అనుమతి తో, ఓడిపోతానని తెలిసి కుడా ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ లోకి వెళ్లానన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభించేందుకు 10వేల కోట్ల రూపాయ‌లు మాఫీ చేయించానన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధి ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేసినా ప్రయోజనం లేదన్నారు. జీ.వెంకటస్వామి పేరు పెద్దపల్లి జిల్లాకు పెడతానని కేసీఆర్ హామీ ఇచ్చారు. పెద్దపల్లి టికెట్ ఇవ్వమని తాను అడగలేదని, వాళ్లే ఇస్తామని అన్నారని గుర్తు చేసారు.

 అడుగ‌డుగానా అవ‌మానించారు..! పెద్ద‌ప‌ల్లి జిల్లాకు వెంక‌ట‌స్వామి పేరుకూడా పెట్ట‌లేద‌న్న వివేక్..!!

అడుగ‌డుగానా అవ‌మానించారు..! పెద్ద‌ప‌ల్లి జిల్లాకు వెంక‌ట‌స్వామి పేరుకూడా పెట్ట‌లేద‌న్న వివేక్..!!

పెద్దపల్లి టికెట్ నాకు ఇవ్వకున్నా, తెలంగాణ ఉద్యమకారునికి టికెట్ ఇస్తే బాగుండేదన్నారు. ఇతర పార్టీల వారు టికెట్ ఇస్తామని అడుగుతున్నారు, కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. పార్టీ కి వ్యతిరేకంగా పనిచేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, లేదా పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని కేటీఆర్ ను అడిగానన్నారు. తన తండ్రి జి.వెంకటస్వామి కాలంనాటి నుంచి వారసత్వంగా వస్తున్న పెద్దపల్లి ఎంపీ సీటు కూడా టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున తెచ్చుకోలేకపోయారు. దీంతో అదికార గులాబీ పార్టీ పై మొద‌టి సారి తిరుగుబాటు బావుటా ఎగ‌రేసే నాయ‌కుడు పుట్టుకొచ్చిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Former MP Vivek has been charged against Chief Minister Chandrasekhar Rao. Vivek said he bereaved Chandrasekhar Rao, but he cut off his throat. Vivek is meeting with his followers on future action. Chandrasekhar Rao has been betrayed by saying that Venkataswamy will be named for the Peddapally district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more