వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రచారం చేసుకోండి: వారికి టిక్కెట్ ఖరారు చేసిన కేసీఆర్, రేవంత్ రెడ్డి మీద ఎవరిని పోటీ చేయిద్దాం!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: లోకసభ ఎన్నికలకు గాను ఐదుగురు ఎంపీలకు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేసుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చ జెండా ఊపారు. వినోద్ కుమార్, నగేష్, కవిత, బూర నర్సయ్య గౌడ్, ప్రభాకర్ రెడ్డిలకు టిక్కెట్ పైన హామీ ఇచ్చారు. ప్రచారం చేసుకోమని కూడా చెప్పారు.

స్వీట్ వార్నింగ్: అంతలోనే కేసీఆర్‌పై పవన్ కళ్యాణ్ అసంతృప్తి, అసలు కారణం ఇదేనా?స్వీట్ వార్నింగ్: అంతలోనే కేసీఆర్‌పై పవన్ కళ్యాణ్ అసంతృప్తి, అసలు కారణం ఇదేనా?

 ఈ దుగురికి పచ్చజెండా

ఈ దుగురికి పచ్చజెండా

నిజామాబాద్ నుంచి కవిత, అదిలాబాద్ నుంచి నగేష్, భువనగిరి నుంచి నర్సయ్య గౌడ్, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్‌వలకు ఫోన్ చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా పేర్లు వెల్లడిస్తానని చెప్పారు. జహీరాబాద్ పార్లమెంటు స్థానంపై సస్పెన్స్ కనిపిస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు పాటిల్‌పై వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించే అవకాశముంది.

సర్వేలు ఆయనకు అనుకూలంగా వచ్చినా

సర్వేలు ఆయనకు అనుకూలంగా వచ్చినా

జహీరాబాద్‌ లోకసభ స్థానానికి బీబీ పాటిల్ వైపు తొలుత మొగ్గుచూపారు. సర్వేలో కూడా ఆయనకు అనుకూలంగానే ఫలితాలు వచ్చాయి. దీంతో ఆయనకు టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. టిక్కెట్ ఖాయమనుకున్న సమయంలో పరిణామాలు మారిపోయాయి. పాటిల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ జహీరాబాద్‌ లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, క్రాంతి కిరణ్‌, భూపాల్ రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డిలు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వద్ద సమావేశమయ్యారట. ఆయన అభ్యర్థిత్వాన్ని తాము అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారట. ఆయన బదులు కర్నె ప్రభాకర్‌తో పాటు ఇతరుల పేర్లు సూచించారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి పోటీ అక్కడ నుండే ?ఈ సారైనా గట్టెక్కుతాడా ?రేవంత్ రెడ్డి పోటీ అక్కడ నుండే ?ఈ సారైనా గట్టెక్కుతాడా ?

రేవంత్ రెడ్డిపై ప్రత్యేక దృష్టి

రేవంత్ రెడ్డిపై ప్రత్యేక దృష్టి

కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే కొందరు అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇందులో మల్కాజిగిరి నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి పోటీ చేయించే అభ్యర్థిపై తెరాస కసరత్తు చేసింది. ఇప్పటికే ఇక్కడి నుంచి నవీన్ రావు పేరు పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డిపై అదే సామాజిక వర్గానికి చెందిన రంజిత్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, లక్ష్మారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు.

English summary
TRS chief KCR confirms 5 Lok Sabha candidates From Nizambad, Adilabad, Bhongir, Medak and Karimnagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X