వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6 రోజులు, 32 సభలు.. ప్రచారానికి గులాబీ బాస్ రెడీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : కేసీఆర్ ప్రచార సభలకు సంబంధించిన షెడ్యూల్ | Oneindia Telugu

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సోమవారంతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. దీంతో ప్రచారంలో దూసుకెళ్లేందుకు ఆయా పార్టీల నేతలు వ్యూహరచన చేస్తున్నారు. అందులో భాగంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మలిదశ ప్రచారానికి సిద్దమయ్యారు. ఆరు రోజుల్లో 32 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచార సభల్లో పాల్గొంటారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు అమలు చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు.. మళ్లీ అధికారంలోకి వస్తే చేయబోయే పనుల గురించి ఈ సభల్లో వివరించనున్నారు.

కేసీఆర్ ప్రచార సభలకు సంబంధించిన షెడ్యూల్ :

trs chief kcr election campaign

నవంబర్ 19 :
మధ్యాహ్నం 2.30 - ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు సంబంధించిన సభ ఖమ్మం టౌన్ లో జరగనుంది.

మధ్యాహ్నం 3.30 - జనగామ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం సభ స్థానికంగా నిర్వహించనున్నారు.

నవంబర్ 20 :
మధ్యాహ్నం 1.00 - సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల సభ సిద్దిపేటలో జరగనుంది.

మధ్యాహ్నం 2.30 - హుజురాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన సభ స్థానికంగా నిర్వహించనున్నారు.

మధ్యాహ్నం 3.30 - సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించి సిరిసిల్లలో సభ జరగనుంది.

సాయంత్రం 4.30 - ఎల్లారెడ్డి నియోజకవర్గం సభ స్థానికంగా నిర్వహించనున్నారు.

నవంబర్ 21, 22, 23, 25 తేదీల్లో మరికొన్ని చోట్ల కేసీఆర్ ప్రచార సభలు ఖరారు చేశారు. అయితే సమయం మాత్రం ఫిక్స్ చేయలేదు. వీలునుబట్టి ఆయా నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు.

నవంబర్ 21 :
జడ్చర్ల, దేవరకొండ, నకిరేకల్, భువనగిరి, మెదక్ నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచార సభలు ఉండనున్నాయి.

నవంబర్ 22 :
ఖానాపూర్, బోథ్, నిర్మల్, ముథోల్, ఆర్మూర్ నియోజకవర్గాల్లో ఖరారయ్యాయి. బోథ్ కు సంబంధించి ఇచ్చోడలో సభ జరగనుంది.

నవంబర్ 23 :
నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి, జనగామ ఖరారు. డోర్నకల్ కు సంబంధించి మరిపెడ, తుంగతుర్తికి సంబంధించి తిరుమలగిరిలో సభలు జరగనున్నాయి.

నవంబర్ 25 :
తాండూరు, పరిగి, నారాయణపేట, దేవరకద్ర, షాద్ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో కేసీఆర్ ప్రచారంలో పాల్గొంటారు.

English summary
trs chief kcr election campaign scheduled in 32 constituencis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X