వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయభేరి .. ఎవరు ఎందుకు గెలిచారంటే ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

MLC ఎన్నికల్లో TRS విజయభేరి

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించింది. నల్గొండ, వరంగల్, రంగారెడ్డి స్థానిక సంస్థల నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి.. సోమవారం ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాల్లో నల్గొండ, వరంగల్ , రంగారెడ్డి స్థానాలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈ మూడు స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది.

చంద్రబాబులాగే కేసీఆర్ కూడా అధికారం పోగొట్టుకుంటారు .. సీపీఐ నేతల సంచలనంచంద్రబాబులాగే కేసీఆర్ కూడా అధికారం పోగొట్టుకుంటారు .. సీపీఐ నేతల సంచలనం

నల్గొండలో కాంగ్రెస్ కు షాక్ .. తేరా చిన్నపు రెడ్డి తొలిసారి విజయం

నల్గొండలో కాంగ్రెస్ కు షాక్ .. తేరా చిన్నపు రెడ్డి తొలిసారి విజయం

నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి లక్ష్మీపై టీఆర్ఎస్ అభ్యర్ధి చిన్నపరెడ్డి విజయం సాధించారు.స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నప్పరెడ్డి ఇక్కడ తొలిసారిగా విజయం నమోదు చేసుకున్నారు. గత ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి చేతిలో ఘోర పరాభవం పాలైన చిన్నప్పరెడ్డి తాజాగా రాజ్ గోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ పై 217 ఓట్లతో ఘన విజయం సాధిం చారు. తేరా చిన్నప్పరెడ్డి పొలిటికల్ కెరీర్ లో తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు. గతంలో మూడు సార్లు ఎమ్మెల్యే,ఎంపీ,ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఓటీ చేసిన చిన్నపు రెడ్డి ఓటమి పాలయ్యారు . ఎమ్మెల్సీ గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. గత ఎన్నికల్లో లాగా ఈసారి కూడా కాంగ్రెస్ కు అనుకూల ఫలితం వస్తుందని భావించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఇది షాక్ అనే చెప్పాలి. ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగ్గోపాల్ రెడ్డి, ఎంపీగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించిన నేపధ్యంలో తమ సిట్టింగ్ స్థానం కాబట్టి తప్పకుండా తమకే విజయం వరిస్తుందని అతి విశ్వాసం ప్రదర్శించిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఝలక్ ఇచ్చారు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు.

వరంగల్ లో భారీ మెజార్టీతో గెలిచిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి .. కాంగ్రెస్ ఘోర ఓటమి

వరంగల్ లో భారీ మెజార్టీతో గెలిచిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి .. కాంగ్రెస్ ఘోర ఓటమి

ఇక వరంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. గతం కొండా మురళి ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించిన స్థానంలో టీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ లో చేరిన కొండా మురళి ఎమ్మెల్సీగా రాజీనామా చేశారు. క ఈ నేపధ్యంలో వరంగల్ ఎమ్మెల్సీ స్థానం నుండి రంగంలోకి దిగిన పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భారీ మెజార్టీ సాధించారు. తెలంగాణ రాష్ట్ర సమితికి 850, కాంగ్రెస్‌కు 23 ఓట్లు మాత్రమే పోలవ్వడంతో... 827 ఓట్ల మెజారిటీతో పోచంపల్లి విజయం సాధించారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వరికోల్ గ్రామానికి చెందినా నాయకుడు కావటం , స్థానికంగా ఉన్న నేతలతో సత్సంబంధాలు కలిగి ఉండటం, కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావటం, కాంగ్రెస్ నుండి బలమైన అభ్యర్థి బరిలో లేకపోవటం వంటి అంశాలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కి కలిసొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుండి కొండా మురళి పోటీ చెయ్యటానికి ఆసక్తి చూపించకపోవటంతో ఇనుగాల వెంకట్రామ రెడ్డిని ఎన్నికల బరిలోకి దింపారు. కానీ స్థానికంగా టీఆర్ ఎస్ బలంగా వుండటం కాంగ్రెస్ పార్టీ కూడా ఈ స్థానం లో కనీసం గట్టి పోటీ ఇచ్చే ప్రయత్నం కూడా చెయ్యకపోవటం తో టీఆర్ ఎస్ కు విజయం సునాయాసం అయింది. ఫలితంగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించి వరంగల్ జిల్లాలో తన పట్టు నిలుపుకున్నారు.

రంగారెడ్డి లో పట్టు నిలుపుకున్న పట్నం మహేందర్ రెడ్డి .. కొమ్మూరి పై విజయం

రంగారెడ్డి లో పట్టు నిలుపుకున్న పట్నం మహేందర్ రెడ్డి .. కొమ్మూరి పై విజయం

రంగారెడ్డి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డి విజయం సాధించారు. మహేందర్ రెడ్డి తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డిపై విజయం సాధించారు. 244 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటికే నల్గొండ, వరంగల్ స్థానాలను కైవసం చేసుకోగా రంగారెడ్డి స్థానాన్ని కూడా చేజిక్కుంచుకుంది. రంగారెడ్డి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం మహేందర్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.కాంగ్రెస్ తరుపున కొమ్మూరి ప్రతాపరెడ్డి పోటీ చేశారు. పట్నం గెలుపు ఖాయమవడంతో కౌంటింగ్ పూర్తవక ముందే ప్రతాపరెడ్డి కేంద్రం నుంచి వెళ్లిపోయారు. పట్నం మహేందర్‌రెడ్డికి 510 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 266 ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్లు 21 ఉన్నాయి. 244 ఓట్ల‌ మెజారిటీతో మహేందర్ రెడ్డి విజయం సాధించారు.2016లో జరిగిన ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా పట్నం నరేందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పట్నం మహేందర్ రెడ్డి పరాజయం పాలయ్యారు. ఇక ఈ నేపధ్యంలో సోదరుడి స్థానంలో ఎన్నికల బరిలోకి దిగిన పట్నం మహేందర్ రెడ్డి విజయం సాధించారు. స్థానికంగా పట్టున్న నేత కావటం, గతంలో మంత్రిగా పని చేసిన నాయకుడు కావటం, రంగారెడ్డి జిల్లాలో టీఆర్ ఎస్ బలంగా వుండటం వంటి కారణాలు పట్నం మహేందర్ రెడ్డి గెలుపుకు కారణం అయ్యాయి.

English summary
The TRS made a historical victory in local bodies quota MLC elections . Nalgonda, Warangal, Ranga Reddy the counting of votes for the local bodies constituencies had taken place on monday . In the results, Nalgonda, Warangal and Ranga Reddy took over the seat by TRS. These three positions are clean swept by TRS . TRS candidate Chinappareddy won the Lok Sabha election from Nalgonda against Congress candidate Komatireddy Lakshmi. TRS candidate Chinappa Reddy registered for the first time in the local body MLC's by-election and the TRS candidate Pochampalli Srinivas Reddy won in the Warangal. Pathnam Mahendar Reddy won in Ranga Reddy district . TRS clean sweep in the local-body quota MLC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X