వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్ సమావేశాలకు దూరంగా ఉండాలని టిఆర్ఎస్ నిర్ణయం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

అవిశ్వాసానికి మద్దతుగా ఆందోళనకు స్వస్తిపలికిన టిఆర్ఎస్

హైదరాబాద్:రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలకు హజరుకాకూడదని టిఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు తమ పార్టీకి చెందిన ఎంపీలను హైద్రాబాద్‌కు తిరిగి వచ్చేయాలని టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ తమ పార్టీ ఎంపీలను ఆదేశించారు.

పార్లమెంట్ ఉభయ సభల్లో పది రోజులుగా ఎలాంటి కార్యక్రమాలు సాగడం లేదు. అవిశ్వాస తీర్మానంపై పార్టీల నోటీసులు ఇచ్చాయి. ఈ విషయమై చర్చ ప్రారంభం కాలేదు. సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదాపడుతున్నాయి.

 Trs decides to not attend to parliament sessions

ఈ పరిస్థితుల నేపథ్యంలో టిఆర్ఎస్ చీఫ్ కెసిఆర్ తమ పార్టీ ఎంపీలను హైద్రాబాద్‌కు తిరిగి వచ్చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 5వ తేది నుండి పార్లమెంట్ సమావేశాలకు హజరుకాకూడదని నిర్ణయం తీసుకొంది.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో విడత సెషన్స్ ప్రారంభమైన తర్వాత టిఆర్ఎస్ ఎంపీలు రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసనలు వ్యక్తం చేశారు. అన్నాడిఎంకె ఎంపీలతో పాటు, టిఆర్ఎస్ ఎంపీల కారణంగా పార్లమెంట్ ఉభయసభలు వాయిదా పడిన సందర్భాలున్నాయి.

అయితే ఏపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అవిశ్వాసానికి మద్దతుగా ఆందోళనకు స్వస్తిపలికింది టిఆర్ఎస్. పది రోజులుగా పార్లమెంట్ లో కార్యక్రమాలు సాగడం లేదు. దీంతో పార్లమెంట్ సమావేశాలకు హజరుకాకూడదని టిఆర్ఎస్ నిర్ణయం తీసుకొంది.

English summary
Trs decided to not attend to Parliament sessions from April 5.TRS chief KCR ordered his party MPs to come to Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X