వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మున్సిపోల్స్ .. తెలంగాణలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచార జోరు .. మంత్రుల మాటల హోరు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. మంత్రులు పోటీపడి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు.ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలోనూ దూసుకుపోతుంది. తెలంగాణా రాష్ట్రంలో అన్ని చోట్లా విజయం సాధించి భారీ మెజార్టీతో సత్తా చాటాలని గులాబీ బాస్ పార్టీ నేతలకు సూచించిన నేపధ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు . ఇక ఈ నేపధ్యంలో గులాబీ పార్టీ జోరుగా ప్రచారం సాగిస్తుంది. నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో మంత్రుల మాటల హోరు కొనసాగుతుంది.

మున్సిపల్ ఎన్నికల్లో ఆ పని చేస్తే నిజామాబాద్ పేరు మారుస్తా : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్మున్సిపల్ ఎన్నికల్లో ఆ పని చేస్తే నిజామాబాద్ పేరు మారుస్తా : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్

అన్ని పార్టీల అధిష్టానాలు ఢిల్లీలో వుంటే టీఆర్ఎస్ తెలంగాణా గల్లీల్లో ఉందన్న హరీష్

అన్ని పార్టీల అధిష్టానాలు ఢిల్లీలో వుంటే టీఆర్ఎస్ తెలంగాణా గల్లీల్లో ఉందన్న హరీష్

మెదక్ జిల్లా నర్సాపూర్‌ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీష్‌ రావు.. విపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని ఆయన పేర్కొన్నారు. తమ అభ్యర్థులకు మెజారిటీ పరంగానే పోటీ వుందని తెలిపారు. అన్ని పార్టీల అధిష్టానాలు ఢిల్లీలో వుంటే.. టీఆర్‌ఎస్‌ అధిష్టానం తెలంగాణ గల్లీలో వుందన్నారు మంత్రి హరీష్‌ రావు. టీఆర్ఎస్‌ పార్టీకి ప్రజలే ప్రధానమని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ తోనే సాధ్యమని అన్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు బుద్ధి చెప్పాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు.

ఇల్లందులో ప్రచారంలో పాల్గొన్న సత్యవతి రాథోడ్

ఇల్లందులో ప్రచారంలో పాల్గొన్న సత్యవతి రాథోడ్

ఇక తెలంగాణా మంత్రి సత్యవతి రాథోడ్ ఇల్లందు లోని పలు వార్డులలో టిఆర్ఎస్ అభ్యర్థుల ప్రచారంలో పాల్గొన్నారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మునిసిపల్ ఎన్నికల్లో ప్రజలు టిఆర్ఎస్ ను ఎంతో ఆదరిస్తున్నారని శిశు సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు ఇంటింటికి వెళ్లి తమ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరిన ఆమె ఏ ఇంటికి వెళ్లిన కారు గుర్తుకే మన ఓటు అని తమకు బొట్టు పెట్టి ప్రజలు హామీ ఇస్తున్నారని పేర్కొన్నారు .

ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దన్న మంత్రి సత్యవతి

ప్రతిపక్ష పార్టీలు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దన్న మంత్రి సత్యవతి

ఇల్లందు పట్టణం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంతో పోలిస్తే ఎంతో అభివృద్ధిని సాధించిందని తెలిపారు. 121 కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో ప్రగతి సాధించిపెట్టిన ఘనత టిఆర్ఎస్ పార్టీదని చెప్పారు. ఇల్లందు పట్టణం ఇంత అభివృద్ధి కావడానికి కెసిఆర్, యువ నాయకుడైన కేటీఆర్ వల్లనే సాధ్యం అయిందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు . ఇల్లందు పట్టణం మరింత అభివృద్ధి చెందాలన్నా ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను టీఆర్ఎస్ కు పట్టం కట్టాలని , ప్రతిపక్ష అభ్యర్థులు , పార్టీలు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని చెప్పారు మంత్రి సత్యవతి రాథోడ్ .

English summary
Municipal election campaign in Telangana Ministers are competing and campaigning too. Ministers and MLAs have entered the field in the wake of kcr suggestion to win all over the state with a huge majority. In this context, the trs party is campaigning vigorously. The leaders' words are exploding.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X