వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీతో.. మేమేం చేయలేం: చేతులెత్తేసిన రాజ్‌నాథ్, కవిత విజ్ఞప్తి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్: ఉద్యోగుల విభజన పైన తాము ఏం చేయలేమని కేంద్ర హోంశాఖ తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఇద్దరు ముఖ్యమంత్రులు (చంద్రబాబు, కెసిఆర్) కూర్చుంటేనే పరిష్కారం అవుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చెప్పారని తెలుస్తోంది.

స్థానికత అని ఒకరు అంటుంటే, ఆప్షన్లు అని మరొకరు అంటున్నారని, మధ్యేమార్గంలో వెళ్లాలని సూచించారని తెలుస్తోంది.

ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

గురువారం టిఆర్ఎస్ ఎంపీలు, టిఎన్జీవోలు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, డీవోపీటీ మంత్రులను కలిశారు. టిఆర్ఎస్ ఎంపీలతో కలిసి కలిశారు.

 ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఈ సందర్భంగా టిఎన్జీవోలు, ఎంపీలు... విభజన భారం మీదేనని కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, జితేంద్ర సింగ్‌తో చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల విభజన భారం కేంద్రానిదేనని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఏసి నేతలు, తెరాస ఎంపీలు విజ్ఞప్తి చేశారు.

 ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

విభజన జరిగి పద్నాలుగు నెలలు గడిచినా ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాకపోవడం విచారకరమన్నారు. గురువారమిక్కడ తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలతో కలసి ఎంపీలు.. కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జితేంద్ర సింగ్‌లతో భేటీ అయ్యారు.

 ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఆంధ్ర ప్రాంతంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకురావాలని కోరారు. జోనల్‌, మల్టీజోనల్, జిల్లాస్థాయి ఉద్యోగులను తెలంగాణకు రప్పించడానికి మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు.

 ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

అదేవిధంగా తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంతానికి చెందిన జోనల్‌, జిల్లాస్థాయి ఉద్యోగులు ఏపీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా ఏపీ ప్రభుత్వం సిద్ధంగా లేదని కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు.

 ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

విభజన ప్రక్రియ న్యాయంగా జరగడం లేదని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని వారికి హామీ ఇచ్చారు.

 ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఎంపీలు జితేందర్ రెడ్డి, వినోద్ కుమార్, కవిత, బూర నర్సయ్య గౌడ్, బీబీ పాటిల్‌లతోపాటు రాష్ట్ర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు దేవీప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, రవీందర్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, మహిపాల్ రెడ్డి గురువారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, సిబ్బంది వ్యవహారాలశాఖ మంత్రి జితేంద్ర సింగ్‌లతో సమావేశమై రెండు గంటలపాటు చర్చలు జరిపారు.

 ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఉద్యోగుల విభజనలో ఎదురవుతున్న సమస్యలను, జాప్యాన్ని వివరించారు. కేంద్రం జోక్యం చేసుకుని వివాదాలను పరిష్కరించాలని కోరారు.

 ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

కమలనాథన్ కమిటీ మార్గదర్శకాలు గందరగోళంగా ఉన్నాయని, వాటివల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేంద్ర మంత్రులకు ఉద్యోగ సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. ఏకపక్షంగా కేటాయిస్తున్నారని ఆరోపించారు.

 ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

ఉద్యోగుల విభజనపై కేంద్రమంత్రులను కలిసిన జెఏసీ

తెలంగాణలోని వేలమంది ఏపీ ఉద్యోగులు స్వరాష్ర్టానికి వెళ్ళిపోతామని చెప్తున్నా ఆ రాష్ట్రం వారిని తీసుకోడానికి ముందుకు రావటంలేదని విమర్శించారు. కాలయాపన జరగకుండా ఓ కమిటీని వేసి ఈ ప్రక్రియను పూర్తికి కేంద్రం చొరవ తీసుకోవాలని సూచించారు.

English summary
Telangana State Employees JAC leaders to meet Rajnath Singh over Employees Bifurcation
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X