హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంగీత ఎలా చెప్తే అలా: ఎంపీ మల్లారెడ్డి, 'కసి' వ్యాఖ్యలపై వాగ్వాదం, రూ.3 కోట్ల కొత్తకోణం

మాజీ టీఆర్ఎస్ యువ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి భార్య సంగీత నాలుగోరోజైన బుధవారం కూడా భర్త ఇంటి ఎదుట నిరసన కొనసాగించారు. ఆమెను ఎంపీ మల్లా రెడ్డి వచ్చి పరామర్శించారు. రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాజీ టీఆర్ఎస్ యువ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి భార్య సంగీత నాలుగోరోజైన బుధవారం కూడా భర్త ఇంటి ఎదుట నిరసన కొనసాగించారు. ఆమెను ఎంపీ మల్లా రెడ్డి వచ్చి పరామర్శించారు. రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. సంగీత ఏం కావాలనుకుంటే అవి నెరవేరుస్తామని చెప్పారు.

Recommended Video

Trs leader Srinivas Reddy and wife Sangeetha case Twist

ఎంపీ మల్లారెడ్డి నిరసన చేపడుతున్న సంగీత వద్దకు వెళ్లారు. తనను స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పంపించారని, నీకు ఏం కావాలంటే అది చేస్తామని, మరో ఆడపిల్లకు ఏ మగాడు ఇలా అన్యాయం చేయకుండా శ్రీనివాస్ రెడ్డి, మీ అత్తామామలపై చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. నీ డిమాండ్లు అన్నీ నెరవేరుస్తామన్నారు.

చదవండి: మాజీ టీఆర్ఎస్ నేత ఇష్యూ: 'సంగీత ప్లాన్ ప్రకారమే వచ్చింది, సంపాదించిందేం లేదు'

వాడు లంగ అని తెలిసింది, కూతురు పేరిట రిజిస్టర్

వాడు లంగ అని తెలిసింది, కూతురు పేరిట రిజిస్టర్

వాడు లంగ అని తెలిసిందని, అతను పార్టీలో చేరినప్పుడు ఆ విషయం తెలియదని ఎంపీ మల్లా రెడ్డి అన్నారు. శ్రీనివాస్ రెడ్డికి కోట్ల ఆస్తులు ఉన్నాయని, నాలుగైదు భవనాలు ఉన్నాయని, ఓ బిల్డింగును నందిని కూతురు పేరిట రిజిస్టర్ చేయిస్తామని చెప్పారు.

మరో మగాడు భయపడేలా

మరో మగాడు భయపడేలా

సంగీతకి ఏ విధంగా న్యాయం జరుగుతుందనుకుంటే అలా న్యాయం చేస్తామని మల్లా రెడ్డి తెలిపారు. ఆయనకు వేసిన శిక్ష మరెవరు అలా చేయకుండా చేస్తామన్నారు. అలాంటి శిక్ష విధించేలా చేస్తామన్నారు. అత్తామామల అరెస్టుపై మాట్లాడుతూ.. వారిని అరెస్టు చేయిస్తామన్నారు. భర్త శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే అరెస్టు అయ్యారన్నారు.

మల్లారెడ్డితో మహిళలతో వాగ్వాదం

మల్లారెడ్డితో మహిళలతో వాగ్వాదం

ఒకటి రెండు సందర్భాలలో ఎంపీ మల్లారెడ్డితో మహిళలు వాగ్వాదానికి దిగారు. ఆయన ఒకటికి రెండుసార్లు సంగీత పగ తీర్చుకునేలా, సంగీత కసి తీరేలా అని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలపై మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సంగీతకు కోపం లేదని, తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారని చెప్పారు. దీనిపై ఎంపీ మాట్లాడుతూ.. తమది తెలంగాణ భాష అని ఇలాగే ఉంటుందని, మీలాగా మాట్లాడటం రాదన్నారు. ఆమె బాధ పోయేటట్లు చేస్తామని తెలిపారు.

దీక్ష విరమించలేదన్న మల్లారెడ్డి

దీక్ష విరమించలేదన్న మల్లారెడ్డి

సంగీత ఇంకా దీక్ష విరమించలేదని ఎంపీ మల్లారెడ్డి చెప్పారు. తన భర్త అరెస్టును ఎందుకు చూపించడం లేదని ఆమె అడుగుతున్నారని, అలాగే తన అత్తామామలను అరెస్టు చేసేదాకా తాను దీక్ష విరమించనని చెప్పారని, ఆమె ప్రస్తుతానికి దీక్ష విరమించడం లేదన్నారు. అత్తమామలు పరారీలో ఉన్నారని చెప్పారు.

నాలుగు హామీలు నెరవేర్చుతాం

నాలుగు హామీలు నెరవేర్చుతాం

సంగీత నాలుగు హామీలు అడిగారని వాటిని నెరవేర్చుతామని ఎంపీ మల్లా రెడ్డి చెప్పారు. ఆమెకు రక్షణ కల్పిస్తామని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని, ఆమె కూతురుకు ఆస్తి భద్రత కల్పిస్తామని, అలాగే ఆమె ఇంట్లో ఉండాలనుకుంటే ఉండవచ్చు లేదా విడిగా ఉండవచ్చునని ఎంపీ చెప్పారు.

డబ్బుందనే అహంకారం, పొగరుతో

డబ్బుందనే అహంకారం, పొగరుతో

అంతకుముందు సంగీత మాట్లాడుతూ.. డబ్బు ఉందనే అహంకారం, పొగరుతో ఇంకో ఆడపిల్లకు అన్యాయం జరగవద్దని చెప్పారు. అందుకే తాను నిరసన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నోరు మూసుకొని ఉంటే ఎవరికీ న్యాయం జరగదని మహిళలకు తెలిసి రావాలన్నారు. తాను ఇలా చేస్తేనే మహిళలు బయటకు వస్తారన్నారు. అంతేకాదు తన భర్తకు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు.

న్యాయం ఎలా, మూడు కోట్ల డిమాండ్ అంటూ కొత్త కోణం

న్యాయం ఎలా, మూడు కోట్ల డిమాండ్ అంటూ కొత్త కోణం

తనకు ఎలా న్యాయం చేస్తుందో ప్రభుత్వం చెప్పాలని సంగీత డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తి లేదన్నారు. తాను డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయని, అదంతా అబద్దమని తేల్చి చెప్పారు. తాను డబ్బులు డిమాండ్ చేయడం లేదన్నారు. తనను చంపేస్తారని, తనకు రక్షణ కల్పించాలన్నారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో కొత్త కోణం వినిపించింది. శ్రీనివాస్ రెడ్డి నుంచి సంగీత రూ.3 కోట్లు డిమాండ్ చేసిందని, అందుకే ధర్నా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సంగీత కొట్టి పారేశారు.

చదవండి: రిలేషన్‌షిప్ వదిలేస్తా, 20ఏళ్ళ యువతివల్లే చిచ్చు: భార్యని కొట్టిన టీఆర్ఎస్ నేత కేసులో ట్విస్ట్‌లు

చదవండి: టీఆర్ఎస్ నేత లీలలు: నందినికి మూడో యువతి పేరెంట్స్ అండ, 'కూతురిని లోబర్చుకున్నాడు'

English summary
MP and TRS leader Malla Reddy on Wednesday met Nandini, who was protest at her husband residence from Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X