హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫ్లైక్సీలపై మళ్లీ కొరడా: ఈ టీఆర్ఎస్ నేతకు 25వేల రూపాయల జరిమానా విధించిన జీహెచ్ఎంసీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: నిబంధనలు అతిక్రమిస్తే తామేంటో మరోసారి నిరూపించింది గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ శాఖ జీహెచ్ఎంసీ. నిబంధనలు అతిక్రమించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఎంతటి వారినైనా సరే వదిలేది లేదని మరోసారి రుజువు చేసింది. ఇక అసలు విషయానికొస్తే... గ‌తంలో ప‌లువురు కార్పొరేట‌ర్లు, శాస‌న స‌భ్యులు నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేసినందుకు జ‌రిమానాల‌ను విధించిన జీహెచ్ఎంసీ అధికారులు నేడు తాజాగా రాష్ట్ర ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస‌యాద‌వ్ ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా ఆయ‌న‌ను అభినందిస్తూ నెక్లెస్ రోడ్ ప్ర‌ధాన రహ‌దారిపై ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది బాలరాజ్ అనే టీఆర్ఎస్ నాయకుడు.

TRS leader imposed fine of RS.25000 by GHMC for putting up Talasni flexies

నిబంధనలు అతిక్రమించి బాలరాజ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో రూ. 25వేల జ‌రిమానాను ఖైర‌తాబాద్ స‌ర్కిల్ అధికారులు విధించారు. దీంతో నిబంధ‌న‌లు అతిక్ర‌మించే ఏ స్థాయి వ్య‌క్తికైనా జ‌రిమానాల‌ను విధించ‌డం జ‌రుగుతుంద‌ని జీహెచ్ఎంసీ స్ప‌ష్టం చేసింది.

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐటీ గ్రిడ్ సీఈఓ... క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అశోక్తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఐటీ గ్రిడ్ సీఈఓ... క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అశోక్

ఇటీవ‌ల ఎల్బీన‌గ‌ర్‌లో జ‌రిగిన ఫ్లైఓవ‌ర్ నిర్మాణం సంద‌ర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకుగాను అక్క‌డి కాంగ్రెస్ నాయ‌కుడికి రూ. 25వేల రూపాయ‌లు గ‌తంలో మంత్రి కేటీఆర్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా ఫ్లెక్సీలు ఏర్పాటుచేసిన ముసారంబాగ్ కార్పొరేట‌ర్‌కు, అంత‌కుముందు ప‌టాన్‌చెరు నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ కార్పొరేట‌ర్‌కు కూడా జ‌రిమానాల‌ను జీహెచ్ఎంసీ విధించిన విష‌యం తెలిసిందే. కాగా హైద‌రాబాద్ న‌గ‌ర సుంద‌రీక‌ర‌ణ‌కు భంగం క‌లిగించే విధంగా ఉన్న ఫ్లెక్సీ బ్యాన‌ర్ల ఏర్పాటును నిషేదించామ‌ని ప్ర‌తిఒక్క పార్టీ, నాయ‌కులు ఈ నిబంధ‌న‌ల‌ను గౌర‌వించాల‌ని మేయ‌ర్ రామ్మోహ‌న్ విజ్ఞ‌ప్తి చేశారు.

English summary
GHMC department imposed a fine of Rs. 25000 to a trs leader who put up flexies of Minister Talasani Srinivas Yadav that were against the rules. This was not the first time that GHMC was imposing fine on netas, earlier few congress and TRS leaders were also imposed fine for ignoring the rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X