హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ నేత లీలలు: నందినికి మూడో యువతి పేరెంట్స్ అండ, 'కూతురిని లోబర్చుకున్నాడు'

రెండో భార్య సంగీతను కొట్టిన టీఆర్ఎస్ యువ నాయకుడు శ్రీనివాస్ రెడ్డిని (32) మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతనిని కోర్టు ఎదుట హాజరుపరిచి, అనంతరం చంచల్‌గ

|
Google Oneindia TeluguNews

Recommended Video

TRS Leader Srinivas Reddy Arrest : టీఆర్ఎస్ నేత రాస లీలలు | Oneindia Telugu

హైదరాబాద్: రెండో భార్య సంగీతను కొట్టిన టీఆర్ఎస్ యువ నాయకుడు శ్రీనివాస్ రెడ్డిని (32) మేడిపల్లి పోలీసులు అరెస్టు చేశారు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతనిని కోర్టు ఎదుట హాజరుపరిచి, అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు.

చదవండి: రిలేషన్‌షిప్ వదిలేస్తా, 20ఏళ్ళ యువతివల్లే చిచ్చు: భార్యని కొట్టిన టీఆర్ఎస్ నేత కేసులో ట్విస్ట్‌లు

కోట్లు ఇచ్చి మొదటి భార్యకు విడాకులు

కోట్లు ఇచ్చి మొదటి భార్యకు విడాకులు

శ్రీనివాస్ రెడ్డికి కొన్నేళ్ల క్రితం స్వాతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా వేధించాడని తెలుస్తోంది. ఆయన తిరుగుళ్లు, వేధింపులు భరించలేక ఆమె విడాకులు తీసుకుంది. రూ.5 కోట్ల మొత్తం ఇచ్చి అతను విడాకులు తీసుకున్నాడని తెలుస్తోంది. శ్రీనివాస్ రెడ్డికి తల్లిదండ్రుల నుంచి ఆస్తి వచ్చింది. ఆ తర్వాత రియల్ ఎస్టేట్‌లోను బాగా సంపాదించాడు.

ఆడపిల్ల పుట్టిందని

ఆడపిల్ల పుట్టిందని

ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి నాలుగేళ్ల క్రితం సంగీతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెను కూడా వేధించాడు. రెండేళ్ల క్రితం వారికి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టిందని ఆమెను వద్దన్నాడు. దీనిపై ఆమె మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి తన తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఏడాదిన్నరగా వేరుగా ఉంటున్నారు.

మూడో పెళ్లి విషయం తెలిసి వచ్చిన సంగీత

మూడో పెళ్లి విషయం తెలిసి వచ్చిన సంగీత

దేవీజగదీశ్వరిని శ్రీనివాస్ రెడ్డి మూడో పెళ్లి చేసుకున్నాడని తెలిసి సంగీత ఇంటికి వచ్చి నిలదీసింది. దీంతో అతను ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. దీంతో ఆమె మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కూతురు కనిపించడం లేదని

కూతురు కనిపించడం లేదని

మరోవైపు, దేవీ జగదీశ్వరి (మూడో యువతి) తల్లిదండ్రులు సంగీతకు మద్దతు తెలపడం గమనార్హం. తమ కూతురుకు ఏం తెలియదని, ఆమెను కిడ్నాప్ చేశారని, తమ కూతురును కూడా రేపు ఇలాగే మోసం చేస్తాడని దేవీ జగదీశ్వరి తల్లి శిరీష, తండ్రి వాపోయారు. ఈ మేరకు వారు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో అదృశ్యమైందని ఫిర్యాదు చేశారు.

పెళ్లి చేసుకున్నామని

పెళ్లి చేసుకున్నామని

తామిద్దరం పెళ్లి చేసుకున్నమని శ్రీనివాస్ రెడ్డి, దేవీ జగదీశ్వరి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. తాను అదృశ్యం కాలేదని ఆమె చెప్పారు. ఆ తర్వాత సంగీతను కొట్టడంతో ఆమె కూడా ఫిర్యాదు చేశారు. అతను పరారయ్యాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్టు చేశారు.

దేవీ జగదీశ్వరి తల్లి ఇలా

దేవీ జగదీశ్వరి తల్లి ఇలా

శ్రీనివాస్ రెడ్డి తమ కూతురును కూడా ఇలాగే మోసం చేస్తాడని, కాబట్టి ఆమెను తమకు అప్పగించాలని సంగీతకు మద్దతు తెలిపిన దేవీ జగదీశ్వరి తల్లిదండ్రులు అన్నారు. మా కుమార్తెను లోబర్చుకున్నాడన్నారు. తమ చిన్న కూతురును చంపుతానని బెదిరించాడని తల్లి వాపోయారు. మా కుమార్తెను మాకు అప్పగించాలన్నారు. శ్రీనివాస్ రెడ్డి తమను తిట్టాడని, బెదిరించాడని చెప్పారు. మరొకరు అయితే ఆ తిట్లకు ఆత్మహత్య చేసుకునే వారన్నారు. సంగీతలా మా బిడ్డ బతుకు కావొద్దనేదే మా ఉద్దేశ్యం అన్నారు.

తల్లి వ్యాఖ్యలపై దేవీ జగదీశ్వరి

తల్లి వ్యాఖ్యలపై దేవీ జగదీశ్వరి

తన తల్లి వ్యాఖ్యలపై దేవీ జగదీశ్వరి స్పందించారు. చెల్లిని చంపుతానని శ్రీనివాస్ రెడ్డి బెదిరించలేదన్నారు. తన తల్లి ఆయనతో పెళ్లి చేస్తానని చెప్పిందన్నారు. తిట్టడం మాత్రం నిజమే అన్నారు. తండ్రి మాట్లాడుతూ.. గతంలోను తప్పిపోయిందని, ఈసీఎల్‌లో దొరికితే తీసుకు వచ్చామన్నారు. శ్రీనివాస్ రెడ్డి నుంచి అసభ్యకర సందేశాలు వచ్చేవని, దీంతో తన కూతురును వారించేవారమన్నారు.

English summary
In a shocking case, Telangana Rashtra Samithi leader Srinivas Reddy was caught on camera abusing and mercilessly beating his wife after she raised questions about Reddy's marriage to another girl, without seeking a divorce.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X