హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాజీ టీఆర్ఎస్ నేత ఇష్యూ: 'సంగీత ప్లాన్ ప్రకారమే వచ్చింది, సంపాదించిందేం లేదు'

టీఆర్ఎస్ లీడర్, రియాల్టర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రెండో భార్య సంగీత ఫిర్యాదుతో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 307, 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు మూడ్రోజులుగా భర్త ఇంటి

|
Google Oneindia TeluguNews

Recommended Video

Trs leader Srinivas Reddy and wife Sangeetha case Twist

హైదరాబాద్: టీఆర్ఎస్ లీడర్, రియాల్టర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. రెండో భార్య సంగీత ఫిర్యాదుతో ఆయనపై ఐపీసీ సెక్షన్లు 307, 290, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు మూడ్రోజులుగా భర్త ఇంటి ఎదుట సంగీత ఆందోళన నిర్వహిస్తోంది.

చదవండి: నిత్య పెళ్లి కొడుక్కి టీఆర్ఎస్ షాక్: ఇంటి ముందే సంగీత, 'ఆడపిల్లతో ఎమ్మెల్యే ఇలానా?'

సంగీత ప్లాన్ ప్రకారమే వచ్చింది

సంగీత ప్లాన్ ప్రకారమే వచ్చింది

శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఆయన మీడియాతో మాట్లాడాడు. సంగీత ప్లాన్ ప్రకారమే తమ ఇంటికి వచ్చిందని ఆరోపించాడు. ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయి చాలా రోజులు అవుతోందని, అప్పటి నుంచి కాపురానికి రమ్మని ఎంత బతిమాలినా ఫలితం లేకుండా పోయిందన్నారు.

నేను సంపాదించింది ఏమీ లేదు, పేరెంట్స్‌దే

నేను సంపాదించింది ఏమీ లేదు, పేరెంట్స్‌దే

అంతేకాకుండా తనతో పాటు, తన తల్లిదండ్రులపై పలు రకాల కేసులు పెట్టిందని శ్రీనివాస్ రెడ్డి అన్నాడు. తాను సంపాదించింది ఏమీ లేదని, ఆస్తి అంతా తన తల్లిదండ్రులదేనని చెప్పాడు. సంగీత, ఆమె సోదరుడు తమపై దాడి చేసిన వీడియోలు, తన దగ్గర ఉన్నాయని, త్వరలో వాటిని బయటపెడతానని చెప్పాడు.

కట్నం కోసం కూడా వేధించారు

కట్నం కోసం కూడా వేధించారు

సంగీత తన భర్త ఇంటి ముందు తన ఆందోళనను కొనసాగిస్తోంది. ఆమె భర్త శ్రీనివాస్ రెడ్డి, మరో ఆరోపణ కూడా చేశారు. తనను కట్నం కోసం కూడా వేధించారని తెలిపారు. తన భర్త తనను ఓ పని మనిషిగా చూశాడన్నారు. తాను చాన్నాళ్లుగా తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానని, తనకు తెలియకుండా మూడో పెళ్లి చేసుకోవడంతో న్యాయం కోసం తల్లిదండ్రులతో కలిసి వచ్చానని చెప్పారు.

శ్రీనివాస్ రెడ్డి

శ్రీనివాస్ రెడ్డి

కాగా, శ్రీనివాస్ రెడ్డిని పెళ్లి చేసుకున్న మూడో భార్య జగదీశ్వరి సోమవారం ఆయన ఇంటికి వచ్చి, మీడియాతో మాట్లాడి వెళ్లిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ రెడ్డి విషయం వెలుగు చూడటంతో ఆయనపై పార్టీ వేటు వేసింది.

ఎమ్మెల్యే తో మహిళల వాగ్వాదం

ఎమ్మెల్యే తో మహిళల వాగ్వాదం

సంగీత నిరసన మంగళవారం మూడో రోజుకు చేరుకుంది. న్యాయం చేసేందుకు వ‌చ్చిన ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మహిళలు నినాదాలతో నిర‌స‌న తెలిపారు. మూడు రోజులు కావ‌స్తున్నా సంగీత‌కు న్యాయం జ‌ర‌గ‌లేదంటూ ఆయ‌న‌తో చెప్ప‌డంతో ఎమ్మెల్యే స్పందించిన తీరుపై మ‌హిళ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆయన స్పందన సరిగా లేదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయ‌న అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.

క్షీణిస్తున్న్ సంగీత ఆరోగ్యం

క్షీణిస్తున్న్ సంగీత ఆరోగ్యం

మూడో రోజు నిరసన చేపట్టడంతో సంగీత ఆరోగ్యం క్షీణిస్తోంది. తాను ఎన్ని రోజులైనా, తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని చెప్పారు. తనను వేధించిన అత్తామామలను అరెస్టు చేయాలన్నారు. వాళ్లు చేసింది చిన్న తప్పు కాదన్నారు. ఓ ఆడపిల్లను కిరాతకంగా హింసించారన్నారు. తనకు ఎమ్మెల్యే నుంచి హామీ రాలేదని సంగీత అన్నారు.

చదవండి: రిలేషన్‌షిప్ వదిలేస్తా, 20ఏళ్ళ యువతివల్లే చిచ్చు: భార్యని కొట్టిన టీఆర్ఎస్ నేత కేసులో ట్విస్ట్‌లు

చదవండి: టీఆర్ఎస్ నేత లీలలు: నందినికి మూడో యువతి పేరెంట్స్ అండ, 'కూతురిని లోబర్చుకున్నాడు' l

English summary
"Since the last few months, my in-laws have been torturing me for dowry. My husband would also misbehave with me and treat me like a servant. Things got worse after I gave birth to a girl child. He would say this child is not mine. I was thrown out of the house. Now, he has got married without my knowledge. I came here with my parents to demand justice," Srinivas Reddy's wife Sangeetha told media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X