సిద్దిపేట వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారీ వర్షాలు, వరదలు: కారుతో సహా వరదలో కొట్టుకుపోయిన టీఆర్ఎస్ నేత

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే వరద నీటిలో చిక్కుకున్న పలువురు సహాయక బృందాలు కాపాడిన విషయం తెలిసిందే. తాజాగా, సిద్దిపేట జిల్లాలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది.

Recommended Video

Telangana Floods: Warangal, Karimnagar and Khammam districts were Affected
కారుతో సహా గల్లంతైన టీఆర్ఎస్ నేత..

కారుతో సహా గల్లంతైన టీఆర్ఎస్ నేత..

రాజన్న సిరిసిల్ల జిల్లా తుంగళ్లపల్లి టీఆర్ఎస్ నేత జంగపల్లి శ్రీనివాస్.. సిద్దిపేట జిల్లా శనిగరం-బద్దిపల్లి రోడ్డులోని వాగులో ఆయన కారుతో సహా గల్లంతయ్యారు. ఆదివారం రాత్రి శ్రీనివాస్ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఇన్నోవా వాహనంలో మంథనికి బయల్దేరారు.

వరద ఉధృతిలో కొట్టుకుపోయిన శ్రీనివాస్.. కేటీఆర్ స్పందన

వరద ఉధృతిలో కొట్టుకుపోయిన శ్రీనివాస్.. కేటీఆర్ స్పందన


ఈ క్రమంలో మద్దికుంట వాగులో వీరు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు ముగ్గురిని రక్షించగా.. కారుతోపాటు శ్రీనివాస్ వరద ఉధృతికి కొట్టుకుపోయారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్.. సిద్దిపేట జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఘటనా స్థలికి సిద్దిపేట ఆర్డీవో చేరుకుని గాలింపు చర్యలు పర్యవేక్షిస్తున్నారు.

ప్రమాదకర స్థాయిలో వరద ఉధృతి.. పొంగిపొర్లుతున్న వాగులు, నదులు

ప్రమాదకర స్థాయిలో వరద ఉధృతి.. పొంగిపొర్లుతున్న వాగులు, నదులు

కాగా, గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదిలో నీటి మట్టాలు ప్రమాదకరస్థాయిలో పెరిగాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లోని అనేక గ్రామాలు వరదనీటిలోనే ఉన్నాయి. ఇక భద్రాచలంలో నీటి మట్టాలు ప్రమాదకరస్థాయికి చేరుకుని 53 అడుగుల మార్కును దాటాయి. దీంతో జిల్లా అధికారులు హై అలర్ట్ ప్రకటించి మూడో హెచ్చరిక జారీ చేశారు. కాగా, భారీగా వస్తోన్న వరదతో భద్రాచలం వద్ద నీటిమట్టం మరింత పెరిగి సోమవారం రాత్రి 9 గంటలకు 63 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

లోతట్టు ప్రాంతాలు జలమయం..

లోతట్టు ప్రాంతాలు జలమయం..


ఇక, లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. గోదావరి జిల్లాల్లోనూ భారీగా వరదనీరు చేరింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టాలు పెరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అనేక గ్రామాలు వరద నీటిలో ఉన్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాగా, మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించిది. దీంతో మరింత అధ్వాన్నంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

English summary
trs leader srinivas washed away in flood water at siddipet district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X