హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపి ప్రభుత్వ ప్రకటనలను తెలంగాణాలో నిలిపివేయాలంటూ ఈసీకి తెరాస ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:తెలుగు టివి ఛానెళ్లలో విస్తృతంగా ప్రసారం అవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటనలను తెలంగాణలో నిలిపివేయాలని టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది.

ఈ మేరకు ఆ పార్టీ ఎంపీ వినోద్ తెలంగాణా సెక్రటేరియట్ లో తెలంగాణా రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వ్యయంతో ఎపి స్టేట్ గవర్నమెంట్ టీవీ ఛానెళ్లలో ఇస్తున్న ప్రకటనలు తెలంగాణాలో పెద్ద ఎత్తున ప్రసారం అవుతున్నాయని వినోద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టిడిపి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమితో కలిసి పోటీ చేస్తున్న విషయాన్ని వివరించారు. ఎపి ప్రభుత్వంపై టిఆర్ఎస్ ఫిర్యాదు చర్చనీయాంశంగా మారింది.

TRS leaders EC to ban AP government ads in Telangana

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలు తెలుగు టివి ఛానెళ్లలో ప్రసారం చేస్తుండటంపై తెలంగాణా రాష్ట్రీయ సమితి ఎంపి వినోద్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. ప్రభుత్వ ప్రకటనలు కాకుండా తెలుగు దేశం పార్టీ రాజకీయ ప్రకటనలు ఇచ్చుకుంటే తమకేమీ అభ్యంతరం లేదని ఎంపి వినోద్ పేర్కొన్నారు. తెలంగాణాలో టిడిపి,కాంగ్రెస్ తదిదర పార్టీల కూటమి నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అమరావతికి వెళ్లిరావడం కూడా జరిగిందని, ఈ చర్యల క్రమంలోనే
ఎపి ప్రభుత్వ ప్రకటనలను తెలంగాణాలో ప్రసారం కాకుండా నిలిపివేయాలని తాము కోరినట్లు వినోద్ వివరించారు.

మరోవైపు బిజెపి కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, అటువంటి చర్యలకు పాల్పడకుండా ఆ పార్టీని కూడా నిలువరించాలని వినోద్ ఈసీని కోరారు. అనంతరం టిఆర్ ఎస్ ప్రచారం కోసం వినియోగించనున్న ఆరు పాటల సీడీకి ఎన్నికల సంఘం అనుమతి కోసం ఎంపి వినోద్ ఆ పాటల సీడీని ఎన్నికల అధికారులకు వినోద్ అందించారు. అందులో కొన్ని పాటలు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రాసినట్లు వినోద్ ఈ సందర్భంగా తెలిపారు.

ఈసీకి ఫిర్యాదు,సిడిల అందచేత అనంతరం టిఆర్ఎస్ ఎంపి వినోద్ మీడియాతో మాట్లాడారు. తాము తెలంగాణా ఈసీకి తాము ఇచ్చిన ఫిర్యాదును తెలంగాణా రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అలాగే తాము కూడా ఇదే విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా పిర్యాదు చేస్తామని వినోద్ చెప్పారు. అలాగే టిఆర్ ఎస్ ప్రచారం కోసం ఇచ్చిన పాటల సిడీని వినిన అనంతరం వాటిపై అనుమతి ఇస్తామని ఎన్నికల అధికారి జ్యోతి బుద్ధ ప్రకాశ్‌ చెప్పారని ఎంపి వినోద్ తెలిపారు.

English summary
Hyderabad: TRS leaders on Sunday urged Election commission to put a ban on advertisements being released in print and electronic media in Telangana by Andhra Pradesh government ruled by TDP. A representation was submitted by TRS MP Vinod Kumar to Additional CEO Buddha Prakash Jyothi at Secretariat on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X