హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టిఆర్ఎస్ ప్లీనరీకి విస్తృత ఏర్పాట్లు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఏర్పాట్లను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సలీం బుధవారం పరిశీలించారు. మైదానంలో తిరుగుతూ అక్కడి అనుకూలతలు ప్రతికూలతపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ప్లీనరీ సమావేశాలకు 10 జిల్లాల నుంచి దాదాపు 50వేల మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఏప్రిల్ 24న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ ప్లీనరీ సమావేశాలు ఎల్బీ స్టేడియంలో జరుగుతాయని, వచ్చిన ప్రతినిధులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో విందు ఆరగించేలా నిజాం కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అరగంటకుపైగా అక్కడే గడిపిన వారు ఏర్పాట్ల కోసం రూపొందించిన మ్యాప్‌ను పరిశీలించారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు నిజాం కాలేజీ గ్రౌండ్‌లో భోజనాలు ఏర్పాటుచేయనుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిపారు. వంటశాలలు, భోజన హాళ్లు, మంచినీటి వసతి తదితర ఏర్పాట్లపై కసరత్తులు చేశారు. ప్రతినిధులకు అసౌకర్యం కలుగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన

ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన

హైదరాబాద్ నగరంలోని నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ఏర్పాట్లను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎంపి జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సలీం బుధవారం పరిశీలించారు.

ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన

ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన

మైదానంలో తిరుగుతూ అక్కడి అనుకూలతలు ప్రతికూలతపై సుదీర్ఘంగా చర్చించారు.

ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన

ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ప్లీనరీ సమావేశాలకు 10 జిల్లాల నుంచి దాదాపు 50వేల మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు.

ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన

ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన

ఏప్రిల్ 24న ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ఈ ప్లీనరీ సమావేశాలు ఎల్బీ స్టేడియంలో జరుగుతాయని, వచ్చిన ప్రతినిధులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైన వాతావరణంలో విందు ఆరగించేలా నిజాం కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన

ప్లీనరీ ఏర్పాట్ల పరిశీలన

అరగంటకుపైగా అక్కడే గడిపిన వారు ఏర్పాట్ల కోసం రూపొందించిన మ్యాప్‌ను పరిశీలించారు. ప్లీనరీకి వచ్చే ప్రతినిధులకు నిజాం కాలేజీ గ్రౌండ్‌లో భోజనాలు ఏర్పాటుచేయనుండటంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చలు జరిపారు.

English summary
Ministers Mahamood Ali and Talasani Srinivas Yadav and TRS Leaders inspected Nizam College Ground in view of Plenary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X