వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంతగూటికి డీఎస్.. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న టీఆర్ఎస్ నేతలు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఎన్నికలకు కొద్ది రోజుల మాత్రమే సమయం మిగిలి ఉండటంతో వలసలు ఊపందుకుంటున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి ఈ వలసలు ఎక్కువయ్యాయి. తమ పార్టీలో అసంతృప్తులపై టీఆర్ఎస్ నిఘా పెట్టింది. ఎన్నికల నేపథ్యంలో చట్టసభల సభ్యులు, నియోజకవర్గ స్థాయి నేతలు పార్టీని ఎందుకు వీడుతున్నారో తెలుసుకునే పనిలో పడింది. ఎవరికైతే పార్టీ టికెట్ దక్కక ఇతర పార్టీల్లో చేరుతున్నారో వారిని పట్టించుకోవడం లేదు కారుపార్టీ. అయితే మిగతా నాయకులు ఎందుకు పార్టీని వీడుతున్నారో విశ్లేషణ చేస్తోంది. టీఆర్ఎస్

సొంత గూటికి డీఎస్... కాంగ్రెస్‌లోకి ‌మరో ఇద్దరు నేతలు

సొంత గూటికి డీఎస్... కాంగ్రెస్‌లోకి ‌మరో ఇద్దరు నేతలు

పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని తెలిసినప్పటికీ నేతలు పక్క పార్టీ వైపు చూడటం ఇప్పుడు గులాబీ పార్టీని కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక ఈ క్రమంలోనే పలువురు గులాబీ గూటి నుంచి బయటకు వచ్చి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వీరిలో రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాములు నాయక్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిలు కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఇక పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ అయ్యారు. పార్టీకి నష్టం కలిగించే పనులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోను సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు.

ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారా?: డీజీపీని నివేదిక కోరిన ఈసీ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారా?: డీజీపీని నివేదిక కోరిన ఈసీ

 నేతలు పార్టీ మారుతుండటంతో గులాబీ పార్టీలో కలవరం

నేతలు పార్టీ మారుతుండటంతో గులాబీ పార్టీలో కలవరం

ఇందులో భాగంగానే గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను కూడా పార్టీ సస్పెండ్ చేసింది . ఇంకా పార్టీలో ఇలాంటి నేతలు ఎవరైనా ఉన్నారా అని పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. నియోజకవర్గాల వారీగా నేతల జాబితాను తయారు చేస్తోంది. ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో నేతలు పార్టీకి దూరం కావడం, వారి వెంట క్యాడర్‌ను తీసుకెళుతుండటంతో పార్టీలో ఒక్కింత ఆందోళన నెలకొంది.

 టీఆర్ఎస్‌ను వీడిన పలువురు ప్రముఖ నాయకులు

టీఆర్ఎస్‌ను వీడిన పలువురు ప్రముఖ నాయకులు

నిజామాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్‌ కూడా కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌ కొన్ని నెలలుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సొంత జిల్లాలోనూ కీలక నేతలు టీఆర్‌ఎస్‌ను వీడారు. గజ్వేల్‌ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితోపాటు నారాయణఖేడ్‌ టికెట్‌ విషయంలో ఎమ్మెల్సీ రాములునాయక్‌ను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేశారు. వీరిద్దరూ శనివారం రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నారు. అంధోల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌ టీఆర్‌ఎస్‌ను వీడి ఇదే సెగ్మెం ట్‌లో బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో మిర్యాలగూడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి 3 రోజుల క్రితం కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

English summary
As the assembly elections are nearing in Telangana, leaders have been switching to other parties. In a fresh move TRS leaders decide to join the congress party. The leaders include Rajyasabha MP D.Srinivas, MLC Ramulunaik and EX MLA Thumkunta Narsareddy.These leaders will join the congress party on saturday in presence of Rahul Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X