వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతియ పార్టీ ఏర్పాటుపై కేసిఆర్ అట్లా..కేటిఆర్ ఇట్లా, వాట్ ఇజ్ దిస్ కొలవెరి ?

|
Google Oneindia TeluguNews

జాతియా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాం...అవసరమైతే పార్టీ సైతం పెడతాం, అసలు సీట్లే లేని కమ్యూనిస్టులు సైతం జాతియ రాజకీయాల్లో చక్రం తిప్పుతుంటే అధికారంలో ఉన్న మనకేమయింది.....,ఇప్పుడే పార్టీ పెట్టే అవసరంలేదు, దేశంలో అటు కాంగ్రెస్ ,ఇటు బిజేపి పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు చాల ఉన్నాయి.వాటికి మద్దతు ఇస్తాం, పరిస్థితిని బట్టి వాటి మద్దతును కూడగడతాం ....ఇవి జాతియ రాజకీయాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తోపాటు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటి రామారావు చెబుతున్న మాటలు.ఓకే పార్టీలో ఇద్దరు వేర్వేరు ప్రకటనలు చేస్తుండడం కేసిఆర్ జాతియ రాజకీయల్లో చక్రం తిప్పాలనుకునే పార్టీ అభిమానులకు,సానూభూతిపరులకు ఓకింత అసహనంగా కనిపిస్తోంది.

120 మందిన కూడగట్టిన,అవసరమైతే జాతియ పార్టీ

120 మందిన కూడగట్టిన,అవసరమైతే జాతియ పార్టీ

కరీంనగర్ సభలో ఎన్నికల శంఖారావాన్నిపూరించిన సిఎమ్ కేసిఆర్ దేశంలో కాంగ్రెస్ ,బిజేపి ముక్త్ భారత్ కావాలే అంటూ జాతియ రాజకీయాలపై సుదీర్ఘ ప్రసంగం చేశారు..దీంతో ఢిల్లిలో చక్రం తిప్పేందుకు ప్లాన్ రెఢి చేశామని చెప్పారు. ఆఖరి రక్తపు బోట్టు వరకైనా పోరాడి ఫెడరల్ ఫ్రంట్ కు ప్రాణం పోస్తానని చెప్పారు.
అవసరమైతేనే జాతియ పార్టీ ఏర్పాటు చేస్తానని అన్నారు.

జాతియ పార్టీ ఏర్పాటు పై కేటిఆర్ వ్యాఖ్యలు,

జాతియ పార్టీ ఏర్పాటు పై కేటిఆర్ వ్యాఖ్యలు,

దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు నడుస్తున్నవి సంకీర్ణ ప్రభుత్వాలే.మన శక్తి ఇతరులకు ఇచ్చి వారికి బలాన్నిచ్చే బదులు మనమే జాతియ స్థాయిలో కీలకం కావచ్చు కాదా ఉద్దేశ్యంతో కేసిఆర్ ఈ మాటలు అని ఉంటారు. ఇక 2019 లోనే అంతా అయిపోవాలని మేం భావించడం లేదు, విశాలమైన భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కేసిఆర్ ఆ మాటలన్నారు. అవసరమైతే నే భవిష్యత్ లో పార్టీ పెడతామని చెప్పారు ..అంటూ కేసిఆర్ కరీంనగర్ బహిరంగ సభలో మాట్లాడిన మాటలకు వివరణ ఇచ్చారు.

మోడీ మళ్లీ వస్తే ఎన్నికలనేవి ఉండవన్న అశోక్ గెహ్లాట్ మోడీ మళ్లీ వస్తే ఎన్నికలనేవి ఉండవన్న అశోక్ గెహ్లాట్

మళ్లి తెరపైకి ఫెడరల్ ఫ్రంట్,

మళ్లి తెరపైకి ఫెడరల్ ఫ్రంట్,

రాష్ట్ర ఎన్నికల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ పేరుతో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ను కలిసిన సిఎమ్ కేసిఆర్ ఆ తర్వాత దాని పై పెద్దగ స్పందించలేదు..దీంతో అంతా ఫెడరల్ ఫ్రంట్ ఉండదని భావించారు..కాని కేటిఆర్ మాత్రం మరోసారి ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని ప్రస్తావించారు.త
కాంగ్రెస్,బిజేపిలకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలను ఏకతాటిపైకి తెస్తాము, ఈనేఫథ్యంలోనే తృణముల్ కాంగ్రెస్, వైసిపి,ఎస్పి,బిఎస్పి,డిఎంకే,బిజేడి వంటి పార్టీలతో కలిసి పోటి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కు కృషి చేస్తున్నట్టు తెలిపారు

కేసిఆర్ దూరదృష్టి,

కేసిఆర్ దూరదృష్టి,

ఈ ప్రకటనల నేపథ్యంలో జాతియ పార్టీపై ఎలాంటీ స్పష్టత రావడం లేదు.దీంతో పలు రకాలు చర్చలు జరుగుతున్నాయి..ఇదంతా కేవలం పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్రకటనలని ఇతర పార్టీల నేతలు కొట్టి పడేస్తుంటే, కేసిఆర్ లోతులు తెలిసిన వారు మాత్రం అదను చూసి జాతియ రాజకీయాల్లోకి వెళతారని అని చెబుతున్నారు..సిఎమ్ కేసిఆర్ రాజకీయ చతురత చాల దూర దృష్టితో ఉంటున్న నేపథ్యంలో జాతియ పార్టీ ఏర్పాటు పై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.

English summary
Taking off from where Chief Minister K Chandrashekhar Rao left on the issue of TRS playing a major role in national politics at his Karimnagar meeting on Sunday, TRS working president K T Rama Rao on said the time has come for regional parties to realise their potential and stop their dependence on either the BJP or the Congress in electoral politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X