వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడ్చినా వినలేదు, రాజకీయాల్లోకి అలా, తమ్ముడంటూ ఎన్టీఆర్ ఇలా..

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంత్రివర్గ సమావేశంలో ఎన్టీఆర్ ఉండగా నేరుగా మంత్రివర్గ సమావేశంలోకి వెళ్ళాను. రండి బ్రదర్ అంటూ ఎన్టీఆర్ ఆహ్వానించారు.అయితే మంత్రులకు చాలా కోపం వచ్చిందన్నారు ఆంథోల్ ఎమ్మెల్యే బాబుమోహన్.

ఎబిఎన్ ఆంద్రజ్యోతి ఛానల్ లో రాధాకృష్ణ చేసిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్ కె లో బాబుమోహన్ ఎన్ఠీఆర్, చంద్రబాబునాయుడు, కెసిఆర్ ల గురించి ఆసక్తికరవిషయాలను చెప్పారు.

ఎన్టీఆర్ తనను బాగా లైక్ చేసేవారని చెప్పారు.తాను ఎప్పుడూ అన్నగారిని కలిసేందుకు వెళ్ళిన తనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారని బాబుమోహన్ గుర్తు చేసుకొన్నారు.తాను ఏ సమయంలోనైనా ఎన్టీఆర్ ను కలిసే అవకాశం ఉండేదన్నారు.

Trs MLA Babumohan intresting comments on NTR Chandrababunaidu and Kcr.

ఓ రోజు షూటింగ్ గ్యాప్ లో సెక్రటేరియట్ లో అన్నగారిని కలిసేందుకు వెళ్ళాను.అయితే ఆ సమయంలో క్యాబినెట్ సమావేశం జరుగుతోంది.అయితే క్యాబినెట్ సమావేశం జరుగుతుండగా మరో వ్యక్తి వెళ్ళకూడదనే విషయం తనకు తెలియదన్నారు.

అయితే క్యాబినెట్ సమావేశమందిరంలోకి తాను వెళ్ళగానే ఏం బ్రదర్ ఇలా వచ్చారని ఎన్టీఆర్ అడిగారని బాబు మోహన్ చెప్పారు. అయితే ఆ సమయంలో క్యాబినెట్ సమావేశంలోకి వచ్చినందుకు తనపై ఇతర మంత్రులు సీరియస్ అయ్యారని చెప్పారు. అయితే ముందుకు వారి దగ్గరకు వెళ్ళండి, వారు ఎదురుచూస్తున్నారని లక్ష్మీపార్వతి వద్దకు వెళ్ళాలని ఆదేశించారని చెప్పారు.

లక్ష్మీపార్వతి వద్దకు వెళ్ళగానే టిఫిన్ పెట్టి, కాపీ ఇచ్చారని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబుతో తనకు పరిచయం ఏర్పడిందని చెప్పారు. చంద్రబాబునాయుడును అన్నా అంటూ పిలిచేవాడినని ఆయన గుర్తుచేసుకొన్నారు.చంద్రబాబు కూడ తనను బాగా లైక్ చేసేవారని చెప్పారు.

టిడిపిలో ఉన్న కాలంలో మెదక్ ఇంచార్జ్ మంత్రిగా కెసిఆర్ ఉండేవాడని చెప్పారు.తనను పట్టుబట్టి కెసిఆర్ రాజకీయాల్లోకి తీసుకువచ్చారని ఆయన గుర్తు చేసుకొన్నారు. రాజకీయాల్లోకి రానని బతిమిలాడాను, ఏడ్చినా వినలేదు, ఎహె..నువ్వు రావాల్సిందే అంటూ తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చారని కెసిఆర్ గురించి గుర్తుచేసుకొన్నారు. మూడు మాసాలు తన నియోజకవర్గంలో ఉండి తనను గెలిపించారని ఆయన ప్రస్తావించారు.కెసిఆర్ తన గాడ్ ఫాదర్ అన్నారు బాబుమోహన్.

English summary
Trs MLA Babumohan intresting comments on NTR , Chandrababunaidu and Kcr. ABN Andhrajyothy interviewed Babumohan,he revealed how to enter into politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X