వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు షాక్... ఆ కేసులో జైలు శిక్ష విధించిన కోర్టు...

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ఉద్యమం నాటి కేసులో ప్రభుత్వ చీఫ్ విప్,టీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు జైలు శిక్ష విధించింది.తెలంగాణ ఉద్యమ సమయంలో రైలురోకోలో పాల్గొన్న కేసులో వినయ్ భాస్కర్‌పై అభియోగాలు రుజువుకావడంతో ఆయనకు శిక్ష పడింది.వినయ్ భాస్కర్‌తో పాటు 18 మందికి కోర్టు జైలు శిక్ష, రూ.3వేలు జరిమానా విధించింది. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Maloth Kavitha : టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు షాక్... ఆర్నెళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు Maloth Kavitha : టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవితకు షాక్... ఆర్నెళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు

ప్రస్తుతం వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న దాస్యం వినయ భాస్కర్ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు కాజీపేట జంక్షన్ వద్ద రైలు రోకో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పట్లో దీనిపై కేసు నమోదవగా విచారణ కొనసాగుతూ వచ్చింది. బుధవారం(జులై 28) తుది తీర్పు వెల్లడించిన కోర్టు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు జైలు శిక్ష విధించింది.

trs mla dasyam vinay bhaskar sentenced jail in rail roko case

ఇటీవల మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితకు కూడా ప్రజాప్రతినిధుల కోర్టు రూ.10వేలు జరిమానాతో పాటు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారన్న అభియోగాలు రుజువు కావడంతో కోర్టు ఎంపీ కవితకు శిక్ష విధించింది. కోర్టు విధించిన జరిమానాను చెల్లించిన కవిత... న్యాయస్థానం నుంచి బెయిల్ పొందారు.

2019 ఎన్నికల ప్రచారంలో మాలోతు కవిత డబ్బుల పంపిణీ చేశారన్న ఆరోపణలతో బూర్గం పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పటినుంచి దీనిపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవల తుది తీర్పు వెలువరించిన న్యాయస్థానం ఎంపీకి జరిమానాతో పాటు జైలు శిక్ష విధించింది.

కొద్దిరోజుల క్రితం మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు కూడా జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్‌లో 2013లో నమోదైన కేసులో నాగేందర్‌ను దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు ఆయనకు ఆర్నెళ్ల జైలు శిక్ష విధించింది. ఓ వ్యక్తిపై దాడి చేశారన్న అభియోగాలు రుజువు కావడంతో ఆయనకు శిక్ష ఖరారు చేసింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు కోర్టు ఆయనకు నెల రోజుల గడువు ఇచ్చింది. అప్పటివరకూ ఆయన్ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలిచ్చింది.

English summary
Chief Whip and TRS MLA Dasyam Vinay Bhaskar has been sentenced jail by Nampally court in rail roko case which is filed during Telangana movement. Vinay Bhaskar was convicted after proving the charges against him in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X