• search
  • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

‘బిర్యానీ అడిగితే పాచి అన్నం పెడతారా? నకిలీ ఎంపీ అరవింద్‌‌కు పిచ్చెక్కిందట’

|

హైదరాబాద్: బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఆర్మూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసీ ఛైర్మన్ జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. నిజామాబాద్‌కు పసువు బోర్డు పై కేంద్రానివి, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌వి నకిలీ మాటలన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

అది పసుపు బోర్డు కాదు..

అది పసుపు బోర్డు కాదు..

‘ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని అరవింద్ పార్లమెంటు ఎన్నికల్లో హామీ ఇచ్చాడు. 1986 నుంచి నిజామాబాద్‌లో పసుపు బోర్డు డిమాండ్ ఉంది. నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు పసుపు బోర్డు కోసం పాదయాత్ర చేశాను. ఇపుడు కేంద్రం ఇచ్చింది పసువు బోర్డు కాదు ..స్పైసెస్ బోర్డు రీజినల్ ఆఫీస్ మాత్రమే... రీజినల్ ఆఫీసులు ఇప్పటికే ఆరు ఉన్నాయి. ఇలాంటి ఆఫీస్‌ను 2018 లోనే ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి కూడా కేటాయించింది' అని జీవన్ రెడ్డి తెలిపారు.

బిర్యానీ అడిగితే పాచి అన్నం పెడతారా?

బిర్యానీ అడిగితే పాచి అన్నం పెడతారా?

‘కేంద్రం తాజాగా ఏర్పాటు చేసింది డివిజనల్ ఆఫీస్ ప్రమోషనల్ ఆఫీస్ మాత్రమే. కేంద్రం పాచి పోయిన అన్నాన్ని నిజామాబాద్ రైతులకు వడ్డిస్తోంది. రైతులకు వాస్తవాలు త్వరలోనే అర్ధమవుతాయి. మాజీ ఎంపీ కవిత పసుపు బోర్డు కోసం ఎక్కని గడప లేదు.. మొక్కని దేవుడు లేడు' అని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘పసుపు బోర్డుపై బీజేపీ నేత రాంమాధవ్ మాయ మాటలు చెప్పారు.. తెచ్చామని ఇపుడు ట్వీట్ చేస్తున్నారు. బిర్యానీ అడిగితే పాచి అన్నం పెడతారా? నిజామా బాద్ రైతులు చైతన్య వంతులు.. తప్పక తిరగబడతారు.

పసుపు బోర్డు నిజామాబాద్ తెలంగాణ రైతుల హక్కు. ఇప్పటికే వరంగల్, గుంటూరులో స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. అయినా రైతులకు ఒరిగిందేమి లేదు' అని జీవన్ రెడ్డి అన్నారు.

అరవింద్ ఓ నకిలీ ఎంపీ.. బాండ్ హామీ..

అరవింద్ ఓ నకిలీ ఎంపీ.. బాండ్ హామీ..

‘ఎంపీ అరవింద్‌కు పసుపు భూమి లోపల పండిస్తారా? అంతరిక్షంలో పండిస్తారా? అనే విషయం తెలుసా? .2019కు ముందు పసువు గురించి అరవింద్‌కు తెలుసా? ఆయనెప్పుడైనా పసుపు రైతుల ఉద్యమం లో పాల్గొన్నారా? అరవింద్ ఓ నకిలీ ఎంపీ నకిలీ జీఓలతో మాయ చేస్తుంటారు. 2018లో రావాల్సిన జీవోను కేంద్రం ఇప్పుడు ఇచ్చింది. దీంతో ఒరిగేదేమి లేదు. అరవింద్ బాండ్ పేపర్లో రాసి ఇచ్చింది మేము అమలు చేయమంటున్నాం. అరవింద్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు.. నేను తెలుగు మీడియంలో చదువుకున్నా. అరవింద్ ఇంగ్లీష్‌లో రాసి ఇచ్చిందే అమలు చేయమంటున్నాం' అని జీవన్ రెడ్డి చెప్పారు.

అరవింద్‌ను ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి..

అరవింద్‌ను ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చేర్చాలి..

‘పసుపు బోర్డు కోసం మాజీ ఎంపీ కవిత పార్లమెంటులో ప్రైవేటు బిల్లు ప్రవేశ పెట్టారు. ఆ బిల్లులోని అంశాల ప్రకారం బోర్డు వస్తేనే అంగీకరిస్తాం. అరవింద్ నకిలీ మాటలపై నిజామాబాద్‌లో ప్రతి గ్రామంలోని రైతులు నిలదీస్తారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ చేయాల్సిదంతా చేశారు. పసుపు బోర్డు కేంద్రం పరిధిలోని అంశం... అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేక పోయింది. పసుపు బోర్డు ఏర్పాటు అరవింద్ వల్ల కానే కాదు. ఐదు పంటలకు ఏ విధంగా బోర్డులున్నాయో పసుపునకు అదే బోర్డు కావాలి.

దమ్ముంటే అరవింద్ నాలుగేళ్లు ఢిల్లీలో నైనా ఉండి పసుపు బోర్డు సాధించాలి. నిజామాబాద్ రాకుండా ఢిల్లీలోనే తన పదవీ కాలాన్ని పూర్తి చేసి అయినా పసుపు బోర్డు సాధించాలి. ఎంపీగా గెలిచాక అరవింద్‌కు మతి తప్పిందని నిజామాబాద్ ప్రజలు చర్చించుకుంటున్నారు. అరవింద్‌ను ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలి. పసుపు బోర్డు కోసం టీఆర్ఎస్ పరంగా అనేక రాష్ట్రాల సీఎంలను కలిశాం. ప్రధానిని కలిశాం.. ఇంకేం చేయాలి?' అని అన్నారు జీవన్ రెడ్డి.

రూ. 15వేలకు మించి ఖర్చు చేయలేరు..

రూ. 15వేలకు మించి ఖర్చు చేయలేరు..

‘కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు ఎగిరెగిరి పడ్డారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత వెల్లకిలా పడ్డారు. .పసుపు బోర్డు కోసం కేంద్రం ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఢిల్లీకి పాదయాత్ర చేయమంటారా? అన్ని రాష్ట్రాల సీఎంలను మళ్ళీ కలవమన్నా కలుస్తం. ఇప్పుడు మంజూరు చేసిన కార్యాలయానికి బీజేపీ నేతలు కాషాయపు రంగు వేస్తారు. అంతకు మించి ఏం చేయరు. పార్లమెంటు సమావేశాల్లో మా ఎంపీలు పసుపు బోర్డు అంశంపై కచ్చితంగా నిలదీస్తారు. ఇపుడు మంజూరైన స్పైసెస్ కార్యాలయానికి 15 వేల రూపాయలకు మించి ఖర్చు చేసే అధికారం లేదు. కరెంటు బిల్లు 16 వేలు వచ్చినా ఢిల్లీ నుంచి అనుమతి తెచ్చుకోవాలి. ఢిల్లీకి విమాన టికెట్ పైసలు కూడా ఆ ఆఫీస్ బడ్జెట్‌తో రావు. అరవింద్‌కు ప్రజలే గుణపాఠం చెబుతారని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

English summary
trs mla jeevan reddy hits out at MP D arvind for turmeric board issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X