వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసి బస్సులో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఆర్టీసి బస్సులో ఎమ్మెల్యేలు : అందరూ షాక్

హైదరాబాదు: ముగ్గురు తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులు హైదరాబాదులో ఆర్టీసి బస్సులో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణ ప్రయాణికుల్లా వారు బస్సులో ప్రయాణం చేసి అసెంబ్లీకి వచ్చారు.

ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, వివేక్, మాధవరం కృష్ణారావు తోటి ప్రయాణికులతో కలిసి ఆర్టీసి బస్సులో ప్రయాణించారు. ఉదయం బాచుపల్లి గ్రామంలో గాంధీ ఆర్టీసి బస్సు ఎక్కారు. దానిక ముంు బస్ స్టాప్ వద్ద ప్రయాణికుల సమస్యలు తెలుసుకున్నారు.

ఆ తర్వాత ఎమ్మెల్యే వివేక్

ఆ తర్వాత ఎమ్మెల్యే వివేక్

గాంధీ తర్వాత వివేకానందనగర్ బస్ స్టాప్ వద్ద ఎమ్మెల్యే వివేక్ బస్సు ఎక్కారు. ఎమ్మెల్యే గాంధీ ఇతర ప్రయాణికులతో కలిసి ప్రయాణించారు. బస్సులో ప్రయాణికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవరం...

ఆ తర్వాత ఎమ్మెల్యే మాధవరం...

కాగా, మరో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బస్సులో ప్రయాణించారు. ఆయన అసెంబ్లీ ముందు ఆకాశవాణి కేంద్రం బస్ స్టాప్ వద్ద బస్సు దిగి కాలినడకన అసెంబ్లీకు చేరుకున్నారు. తోటి ప్రయాణికులతో పాటు ఎమ్మెల్యేలు బస్టాండ్‌లో బస్సు కోసం నిరీక్షించారు.

ఎమ్మెల్యే వివేక్ ఇలా

ఎమ్మెల్యే వివేక్ ఇలా

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ తన నివాసం నుంచి కాలినడకన సాధారణ ప్రయాణికుడి మాదిరిగా బస్టాప్‌నకు చేరుకున్నారు. సుభాష్ నగర్ నుంచి సిపిఎస్ ఆర్టినరీ బస్సు ఎక్కి అసెంబ్లీ వరరకు తనతో పాటు పిఎ, ఇద్దరు గన్‌మెన్‌కు టికెట్లు తీసుకున్నారు.

లేచి సీటు ఇచ్చిన విద్యార్థి

లేచి సీటు ఇచ్చిన విద్యార్థి

బస్సులో ఓ కాలేజీ విద్యార్థి లేచి వివేక్‌కు సీటు ఇచ్చారు. స్కూల్ కాలేజీ రోజుల్లో బస్సులో వెళ్లిన రోజులను వివేక్ గుర్తు చేసుకున్నారు. బస్సు కండక్టర్‌ను కూడా ఆయన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పటి నుంచో అసెంబ్లీకి బస్సులో వచ్చి సమస్యలను తెలుసుకోవాలని అనుకుంటున్నానని, ఇప్పటికి సాధ్యమైందని అన్నారు.

English summary
MLAs arekepudi Gadhi, Madhavaram Krishna Rao and Vivek travelled in RTC Bus to Telangana assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X