వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైనంపల్లి ఏం చదువుకొన్నాడు: డిగ్రీపై కోర్టులో కేసు

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మొదలుకొని అనేక మంది ప్రముఖుల విద్యార్హతల , అఫిడవిట్లలో పేర్కొన్న వివరాలు వివాదాస్పదమయ్యాయి.ఇదే తరహలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు విద్యార్హతల విషయం కూడ వివాదాస్పదమైంది.ఆయన విద్యార్హతల విషయమై కొందరు కోర్టును ఆశ్రయించారు. దీంతో మైనంపల్లి ఎమ్మెల్సీ పదవికి ఎసరు వచ్చే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం సాగుతోంది.

మైనంపల్లి హన్మంతరావు 2014 ఎన్నికల వరకు టిడిపిలో కొనసాగారు. మల్కాజిగిరి అసెంబ్లీ టిక్కెట్టు దక్కకపోవడంతో ఆయన టిఆర్ఎస్ లో చేరారు. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి ఆయన టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలయ్యాడు.

అయితే 2009 లో ఆయన మెదక్ జిల్లా నుండి టిడిపి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించాడు. 2014 లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుండి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన సమయంలో ఇచ్చిన విద్యర్హతలకు ఎమ్మెల్సీగా విద్యార్హతలకు మద్య తేడా ఉంది.

TRS MLC Mynampally Hanumantha Rao qualifications differences between 2009 to 2017

2009 , 2014 ఎన్నికల్లో అమెరికాలోని అలబామా యూనివర్శిటీలో బీబీఏ చేసినట్టు ప్రకటించాడు. అయితేఎమ్మెల్సీగా అఫిడవిట్ ఇచ్చే సమయంలో తాను ఇంటర్మీడియట్ వరకు మాత్రమే చదువుకొన్నానని చెప్పారు.

ఇదే విషయమై ఓ ఆంగ్ల దినపత్రిక విలేఖరి ఈ విషయమై ఫోన్ చేస్తే స్వయంగా కలిసి వివరిస్తానని చెప్పాడంట. కాని, సరైన సమాధానం చెప్పలేదు. ఈ మేరకు ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.

అయితే మైనంపల్లి విద్యార్హతల విషయమై కొందరు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దీన్ని ఆడ్మిట్ చేసుకొంది. wpsr68708/2017 . ఈ కేసును విచారణకు స్వీకరించింది కోర్టు.ఎన్నికల అఫిడవిట్లలో తప్పుడు వివరాలను ఇచ్చి పోస్టులు కోల్పోయిన కేసులు చాలానే ఉన్నాయి.

ప్రజా ప్రాతినిథ్య చట్టం సెక్షన్ 125 ప్రకారంగ ఇలా తప్పుడు సమాచారం ఇవ్వడం తప్పు.అయితే వేర్వేరు సమాచారాన్ని ఇచ్చిన ఈ అఫిడవిట్లపై కోర్టు ఏ రకంగా స్పందిస్తోందో చూడాలి.

English summary
The election affidavit filed by TRS new MLC Mynampally Hanumantha Rao shows discrepancies in to his educational qualifications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X