• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అది కేసీఆర్ గొప్పతనమే కదా -ఈటల ఆస్తుల గ్రాఫ్ పైపైకి -10 రోజుల్లో కనుమరుగు: పల్లా, గువ్వల ఫైర్

|

టీఆర్ఎస్ పార్టీకి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సందర్భంలో ఈటల రాజేందర్.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయగా, వాటికి గులాబీ దళం కౌంటరిచ్చింది. కన్నతల్లిలాంటి పార్టీపై ఈటల అభాండాలు వేస్తున్నాడని, ప్రజాస్వామిక నేత అయిన కేసీఆర్ ను నియంత అంటూ తూలనాడుతున్నాడని టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సహా తదితరులు శుక్రవారం తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ ఈటలపై మాటల తూటాలు పేల్చారు..

వైఎస్సార్ పిల్లలకు ఆ రాత లేదేమో-షర్మిల పేరు లేకుండా తెలంగాణలో కొత్త పార్టీ- YSRTPపై ఈసీ కీలక ప్రకటనవైఎస్సార్ పిల్లలకు ఆ రాత లేదేమో-షర్మిల పేరు లేకుండా తెలంగాణలో కొత్త పార్టీ- YSRTPపై ఈసీ కీలక ప్రకటన

కేసీఆర్ తయారు చేసిన నేత

కేసీఆర్ తయారు చేసిన నేత

ఈటల రాజేందర్ రాజీనామా చేసింది ఆత్మ‌గౌర‌వం కోసం కానేకాదని, ఆస్తుల ర‌క్ష‌ణ కోస‌ం మాత్రమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు. నిజంగా ఈటలకు ఆత్మ‌గౌర‌వం ఉంటే, పేద‌ల ఆస్తుల‌ను అక్ర‌మంగా ఆక్ర‌మించేవారు కాదని, తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ తయారు చేసిన ఎంతో మంది నేతల్లో ఈటల ఒకరని, ఉద్య‌మం పీక్స్ లో ఎంతో మంది పార్టీలో చేరారని, కేసీఆర్ వ‌ల్లే తెలంగాణ సాధ్య‌మైంద‌ని, అంతకు ముందు, తర్వాత కూడా ఎంతో మంది టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయారని, బ‌య‌ట‌కు వెళ్తూ కేసీఆర్‌పై అనుచిత విమ‌ర్శ‌లు చేశారని, ఇప్పటి వంతు ఈటలదని ఎమ్మెల్సీ అన్నారు.

రఘురామ ఇష్యూలో ట్విస్ట్: పార్లమెంట్‌కు ఏపీ సీఐడీ ఉదంతం -షాకైన ఎంపీలు -జగన్‌ను హిట్లర్‌తో పోల్చుతూరఘురామ ఇష్యూలో ట్విస్ట్: పార్లమెంట్‌కు ఏపీ సీఐడీ ఉదంతం -షాకైన ఎంపీలు -జగన్‌ను హిట్లర్‌తో పోల్చుతూ

కేసీఆర్ పచ్చి ప్రజాస్వామిక వాది

కేసీఆర్ పచ్చి ప్రజాస్వామిక వాది


‘‘ఎవరో అనామ‌కుడు ఇచ్చిన ఫిర్యాదుపై సీఎం కేసీఆర్ స్పందించారంటే అది నియంతృత్వం కాదు ప్ర‌జాస్వామ్యమే అవుతుంది కదా, కేసీఆర్ గొప్పతనమే కదా, అసలు బాధ్యతగల మంత్రిపదవిలో ఉండి భూములు కబ్జాపెట్టుడేంది? పార్టీలో ఉన్న‌ప్పుడు కేసీఆర్ దేవుడు అన్నాడు.. బ‌య‌ట‌కు వెళ్లి నియంత‌, దెయ్యం అంటున్నారు. అన‌వ‌స‌రంగా నోరు పారేసుకుంటే.. సూర్యుడిపై ఉమ్మేసిన‌ట్టే. ఈట‌ల వెనుక కొంత మంది అసంతృప్తులు మాత్ర‌మే ఉన్నారు. హుజురాబాద్0 ప్ర‌జ‌లంద‌రూ టీఆర్ఎస్ వైపే ఉన్నారు.

కులాల మధ్య ఈటల కుంపట్లు

కులాల మధ్య ఈటల కుంపట్లు

కరోనా రివ్యూలో తాను లేకుండా సీఎం ఒక్కడే చేశాడని ఈటల చెప్పడం హాస్యాస్పదం. అసలు మంత్రిగా చేసిన శాఖపై ఈటలకు అవగాహన ఉందా? నిరంతరం ముఖ్యమంత్రి మానిటరింగ్ చేస్తూ ఈటలకు ఇబ్బంది కాకుండా చూసింది వాస్తవం కాదా, ఈటల మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ అధికారులను ఎలా ఇబ్బందులకు గురి చేశారో అందరికీ తెలుసు. కులాల మధ్య కుంపట్లు పెట్టే ఆలోచన మానుకోవాలి. టీఆర్ఎస్ పార్టీలో ఈటలకు దక్కినన్ని పదవులు ఎవరికీ దక్కలేదు. ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి ప్రథకం కేసీఆర్ మదిలో నుంచి పుట్టిందే.

10 రోజుల్లో ఈటల కనుమరుగు.

10 రోజుల్లో ఈటల కనుమరుగు.

భూకబ్జాలకు పాల్పడిన ఈటల పార్టీ నుంచి వెళుతూ కేసీఆర్ పై అభాండాలు వేశారు. త్వరలో ఆయన బీజేపీలో చేరబోతున్నారట. బీజేపీలో చేరిన 10 రోజులకే ఈటల కనుమరుగవుతారు. దాన్ని ప్రజలంతా చూస్తారు. ధాన్యం సేకరణ అనేది విషయంలో రాజేందర్ చెప్పింది తప్పు. రైతుల ధాన్యాన్ని కచ్చితంగా ప్రభుత్వం చేయాల్సిన పని లేదు. తాను ధాన్యం కొనమంటే సీఎం కేసీఆర్ వద్దన్నారంటూ ఈటెల అసత్యాలు ప్రచారం చేస్తున్నాడు. అసలు.. రైతు వ్యతిరేక చట్టాలు చేసి, రైతుల జీవితాలతో ఆడుకుంటోన్న బీజేపీలో చేరేముందు ఈటల ఒకసారి ప్రశ్నించుకోవాలి'' అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.

ఈటల ఆస్తుల డ్రాఫ్ పైపైకి..

ఈటల ఆస్తుల డ్రాఫ్ పైపైకి..


సీఎం కేసీఆర్ పై విమర్శలు చేసిన రాజేందర్ పై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సైన్డ్ భూముల్లో దందాలు చేసుకుంటూ.. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎవ‌రూ కాపాడ‌లేరని, తన ఆత్మ‌గౌర‌వాన్ని ఢిల్లీలో తాక‌ట్టుపెట్టిన ఈట‌లకు ఆత్మ‌గౌర‌వం గురించి మాట్లాడే అర్హ‌త లేదని మండిపడ్డారు. ‘‘అసైన్డ్ భూములను కొనే చ‌ట్టం ఉంటే అది చూపించండి. మా ఆస్తుల గ్రాఫ్‌లు త‌గ్గిపోతున్నాయి. కానీ ఈట‌ల ఆస్తుల గ్రాఫ్ మాత్రం అమాంతం పెరిగిపోతోంది. మొన్నటిదాకా కేసీఆర్ ను పెద్దన్న అని, ఇప్పుడేమో నియంత అని తిట్టడం దారుణం. కేసుల్లో ఇరుక్కున్న తనను ఢిల్లీలో ఉన్న వారు కాపాడుతారు అని ఈట‌ల అనుకుంటున్నారేమో, ఆయ‌న చేసిన పాపాల‌ను చ‌ట్టం గ‌మ‌నిస్తోంది, ఈట‌ల రాజేంద‌ర్‌ను ఏ ప్ర‌ధాని, ఏ ముఖ్య‌మంత్రి కాపాడ‌లేరు'' అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.

English summary
trs leaders hits back on etela rajender, who resigned to trs and huzurabad mla post on friday. as rajender slams cm kcr with strong words, trs mlc palla rajeshwar reddy and mla guvvala balaraju hits back on rajender. palla sid etala will fade out within 10 days after joining bjp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X