• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రేవంత్ ఆపరేషన్ స్వగృహ - టీఆర్ఎస్ కు జలక్ : సోనియాతో డీఎస్ భేటీ - రీ ఎంట్రీ ఖాయం..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

తెలంగాణ లో మూడు ప్రధాన పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ పగ్గాలు చేపట్టిన తరువాత అధికార టీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు..సభలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో ఉప ఎన్నికల్లో గెలుస్తూ టీఆర్ఎస్ కు తామే ప్రత్యర్ధి అనే విధంగా బీజేపీ ముందుకు వెళ్తోంది. ఇక, బీజేపీని - కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ సీఎం కేసీఆర్ కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇక, టీపీసీసీ రేవంత్ ముందుగా కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన వారిని తిరిగి సొంత గూటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

సోనియాతో డీ శ్రీనివాస్ భేటీ

సోనియాతో డీ శ్రీనివాస్ భేటీ

అందులో భాగంగా... పీసీసీ మాజీ చీఫ్.. మాజీ మంత్రి డీ శ్రీనివాస్ తో కొద్ది నెలల క్రితం సమవేశం అయ్యారు. కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించారు. ఇక, హుజూరాబాద్ బైపోల్ లో గెలిచిన తరువాత ఈటల రాజేందర్ సైతం డీ శ్రీనివాస్ తో సమావేశం అయ్యారు. డీ శ్రీనివాస్ కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరిన తరువాత ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు డీ శ్రీనివాస్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలు చర్చలు చేసారు. తెలంగాణ రాజకీయాలు..కాంగ్రెస్ పరిస్థితి పైన చర్చించారు.

కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఖాయమంటూ

కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఖాయమంటూ

డీ శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ లోకి రావటం ఖాయమైందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉండగా... తాజా పరిణామంతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఆగమేఘాలపై పిలిపించినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కేకే వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ రాష్ట్ర నేతలతో చర్చించిన తర్వాత డి.శ్రీనివాస్‌ కాంగ్రెస్ లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. ప్రస్తుతం డీ శ్రీనివాస్ టీఆర్ఎస్ ఎంపీగా ఉన్నా..గులాబీ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు.

టీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి..

టీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి..

సీఎం కేసీఆర్ సైతం డీఎస్ తీరును నిశితంగా గమనిస్తున్నారు. ఎంపీగా మరో ఆరు నెలలు కొనసాగేందుకు డీఎస్ కు అవకాశం ఉంది. అయితే, ఇప్పుడు సోనియాతో సమావేశం కావటంతో టీఆర్ఎస్ ఆయన పైన చర్యలు తీసుకుంటుందా..లేక, ముందుగానే తన ఎంపీ పదవితో పాటుగా టీఆర్ఎస్ కు డీఎస్ రాజీనామా చేస్తారా అనే చర్చ రెండు పార్టీల్లోనూ కొనసాగుతోంది. అయితే, కాంగ్రెస్ లో చేరే అంశం పైన మాత్రం డీఎస్ ఓపెన్ గా స్పందించటానికి అంగీకరించలేదు. తాను సోనియాగాంధీని తరుచూ కలుస్తూనే ఉంటానని ఆయన అన్నారు.

మరిన్ని చేరికలు అంటూ ప్రచారం

మరిన్ని చేరికలు అంటూ ప్రచారం

డీఎస్‌ చేరిక విషయం తనకు తెలియదని, ముఖ్య నేతలతో మాట్లాడిన తర్వాత తనను ఎందుకు రమ్మన్నారో చెబుతానని భట్టి విక్రమార్క తెలిపారు. డీఎస్ తో పాటుగా మరి కొందరు ఇతర నేతలు సైతం తిరిగి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దంగా ఉన్నారంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నా..వారెవరనేది మాత్రం చెప్పటం లేదు. ఇదే సమయంలో బీజేపీ నేతలు సైతం ఇదే వాదన వినిపిస్తున్నారు.

టీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాల్లో నేతల పార్టీల మార్పు రానున్న రోజుల్లో వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది. డీఎస్ కాంగ్రెస్ లో చేరిక అంశం పైన ఈ రోజున పూర్తి స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు.

English summary
TRS MP D Srinivas met Congress chief Sonia Gandhi, He may rejoin in congress shortly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X