హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు ఆ మాటలపై కవిత తీవ్ర ఆగ్రహం, జగన్ సహా అందర్నీ కలుస్తాం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నాయకురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై బుధవారం నిప్పులు చెరిగారు. ఆమె ట్విట్టర్ లైవ్ ద్వారా విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

చంద్రబాబుపై విమర్శలు

చంద్రబాబుపై విమర్శలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు జనాభా పెంచమని వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై కవిత స్పందించారు. దేశంలో, ప్రపంచంలో జనాభా పెరుగుతోందని, ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరమని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉండటం అంటూ విమర్శలు గుప్పించారు.

మోడీపై కవిత నిప్పులు

మోడీపై కవిత నిప్పులు

నరేంద్ర మోడీ పైన కూడా కవిత నిప్పులు చెరిగారు. బీజేపీ ప్రభుత్వానికి మెజార్టీ ఉన్నప్పటికీ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకు రాలేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్‌ రోజు రోజుకు పడిపోతుందన్నారు. రాహుల్ గాంధీ గ్రాప్ కూడా పడిపోతుందన్నారు. అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు సత్తా చాటుతున్నాయని, దేశ రాజకీయాల్లో ఫెడరల్‌ ఫ్రంట్‌ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రక్షణ రంగంలో భారత్‌ స్వావలంబన సాధించాలన్నారు. రిజర్వేషన్ల అంశం గురించి మాట్లాడుతూ.. పేదవాడు ఓసీ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా అందరికీ చదువు అవసరమని చెప్పారు. చదువు రిజర్వేషన్‌కు పేదరికం ముఖ్యం కానీ, కమ్యూనిటీ ముఖ్యం కాదని చెప్పారు.

జగన్‌తో సహా అందర్నీ కలుస్తాం

జగన్‌తో సహా అందర్నీ కలుస్తాం

తమ పార్టీ విద్యార్థులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తోందని కవిత చెప్పారు. నిజామాబాద్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నందున వల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలిగిందన్నారు. రాబోయే రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు పాటు ఇతర పార్టీలను ఫెడరల్ ఫ్రంట్ కోసం కలుస్తామని చెప్పారు. దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కేటీఆర్ పని తీరుకు పదికి పది మార్కులు ఇస్తానని, కేసీఆర్ పని తీరుకు పదికి వంద మార్కులు ఇస్తానని చెప్పారు.

 తెరాస ఫ్యామిలీ పార్టీ అనడంపై

తెరాస ఫ్యామిలీ పార్టీ అనడంపై

టీఆర్ఎస్ ఫ్యామిలీ పార్టీ కాదని కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్, టీడీపీలలో కూడా వారసత్వ రాజకీయాలు ఉన్నాయని చెప్పారు. బీజేపీలో కూడా ఫ్యామిలీ పాలిటిక్స్ ఉన్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీల్లో కుటుంబ పాలన ఉందని చెప్పారు. అయితే మిగతా పార్టీలకు, తెరాసకు తేడా ఉందని చెప్పారు. తమది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అన్నారు. కుటుంబం అని కాకుండా వారి సామర్థ్యాన్ని బట్టి నేతను ఎన్నుకోవాలన్నారు. లేదంటే ఓట్లు వేయవద్దన్నారు.

English summary
Telangana Rastra Samithi MP Kalvakuntla Kavitha fired at at AP CM Nara Chandrababu Naidu and Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X