హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సచిన్‌తో ఎంపీ కవిత: సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మంగళవారం నగరంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ఇనార్బిట్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ గేమింగ్ జోన్‌ 'స్మాష్'ను ప్రారంభించడానికి వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

అభిమానులతో సచిన్‌ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. సచిన్ చూడడానికి అభిమానులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా నిజమాబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, సచిన్ టెండూల్కర్‌ను కలిశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్ లాంటి ప్రఖ్యాత క్రీడాకారుడు నగరానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. సచిన్ ప్రపంప వ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి అని, అదే విధంగా నగరానికి స్మాష్ రావడం తెలంగాణకే గర్వకారణమని అన్నారు.

ఇలాంటి క్రీడలు కేవలం హైదరాబాద్ నగరానికే కాకుండా జిల్లాల్లోని వారికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమం అనంతరం ఎంపీ కవిత, సచిన్ టెండూల్క‌ర్‌కు జ్ఞాపికను అందజేశారు.

సచిన్‌తో ఎంపీ కవిత

సచిన్‌తో ఎంపీ కవిత

మంగళవారం నగరంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సందడి చేశారు. ఇనార్బిట్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ గేమింగ్ జోన్‌ 'స్మాష్'ను ప్రారంభించడానికి వచ్చిన ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు.

 సచిన్‌తో ఎంపీ కవిత

సచిన్‌తో ఎంపీ కవిత

అభిమానులతో సచిన్‌ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. సచిన్ చూడడానికి అభిమానులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా నిజమాబాద్ ఎంపీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, సచిన్ టెండూల్కర్‌ను కలిశారు.

సచిన్‌తో ఎంపీ కవిత

సచిన్‌తో ఎంపీ కవిత

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్ లాంటి ప్రఖ్యాత క్రీడాకారుడు నగరానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. సచిన్ ప్రపంప వ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి అని, అదే విధంగా నగరానికి స్మాష్ రావడం తెలంగాణకే గర్వకారణమని అన్నారు.

 సచిన్‌తో ఎంపీ కవిత

సచిన్‌తో ఎంపీ కవిత

ఇలాంటి క్రీడలు కేవలం హైదరాబాద్ నగరానికే కాకుండా జిల్లాల్లోని వారికి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమం అనంతరం ఎంపీ కవిత, సచిన్ టెండూల్క‌ర్‌కు జ్ఞాపికను అందజేశారు.

సచిన్‌తో ఎంపీ కవిత

సచిన్‌తో ఎంపీ కవిత

హైదరాబాద్‌లోని ఇనార్బిట్‌ మాల్‌లో ఏర్పాటు చేసిన గేమింగ్‌ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం సచిన్ మాట్లాడుతూ.. ‘వీవీఎస్‌ లక్ష్మణ్‌, నేను కలిసి చానాళ్లు భారత జట్టుకి ఆడాం. అప్పట్లో మా మధ్య బిర్యానీ చర్చ అంతగా వచ్చేది కాదు. కానీ.. ఐపీఎల్‌లో ముంబై టీమ్‌ సభ్యులైన రా యుడు, ఓఝాతో దాని గురించి ఎక్కువగా చర్చ సాగేది. హైదరాబాద్‌ వస్తే నాకొక్కడికే కాదు.. జట్టు మొత్తానికీ బిర్యానీ ఉండాల్సిందే. నా దృష్టిలో హైదరాబాద్‌ బిర్యానీని మించింది లేద'ని సచిన్‌ అన్నాడు

సచిన్‌తో ఎంపీ కవిత

సచిన్‌తో ఎంపీ కవిత

‘హైదరాబాద్‌లో నాకు చాలామంది స్నేహితులున్నారు. వారు ఫలక్‌నుమా ప్యాలెస్‌ గు రించి ఎంతో గొప్పగా చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్యాలెస్‌లో రెండ్రోజులు గడిపా. అక్కడి ఆతిథ్యం సూపర్‌. రాయల్‌ అనుభూతికి లోనయ్యా. అదో అద్భుత కట్టడమ'ని మాస్టర్‌ చెప్పాడు.

 సచిన్‌తో ఎంపీ కవిత

సచిన్‌తో ఎంపీ కవిత

శ్రీలంక ఏస్‌ పేసర్‌ లసిత్‌ మలింగను ముంబై ఇండియన్స్‌ టీమ్‌కు ‘బాహుబలి'గా సచిన్‌ అభివర్ణించాడు. ‘మలింగ సిసలైన చాంపియన్‌. ముంబై జట్టుకు అతడు ‘బాహుబలి' లాంటివాడ'ని సచిన్‌ చెప్పాడు.

English summary
Sachin Inaugurated Smaaash Game Zone in Inorbit Mall, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X