వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టడీ: లోకసభ స్పీకర్ తోపాటు బెల్జియం బయల్దేరిన ఎంపి కవిత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యూరోపియన్ యూనియన్ (ఈయూ) సభ్యదేశాల్లో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం టిఆర్‌ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత ఆదివారం రాత్రి బెల్జియం బయలుదేరి వెళ్లారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం.. ఈయూ పార్లమెంట్ వ్యవహారాలపై అధ్యయనంతోపాటు ప్రస్తుతం జరుగుతున్న ప్లీనరీ సమావేశాలను వీక్షిస్తుంది.

బెల్జియం, బ్రస్సెల్స్, సైప్రెస్, బ్రూజెస్ తదితర నగరాలలో పర్యటిస్తుంది. భారత్‌తో కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలతోపాటు విదేశీ వ్యవహారాలపై ఈయూ విధానపరమైన నిర్ణయాలను కూడా ఈ బృందం అధ్యయనం చేస్తుంది.

TRS MP Kavitha visits Belgium with Lok Sabha Speaker

ఇందుకోసం ఈయూ విదేశీ వ్యవహారాల కమిటీ చైర్మన్, సభ్యులతో ఈ బృందం సమావేశమవుతుంది. బెల్జియంతోపాటు వివిధ నగరాల్లోని భారత సంతతి ప్రజలతో సమావేశమై వారి అనుభవాలను తెలుసుకుంటుంది.


ఈ పర్యటనలో స్పీకర్ సుమిత్రా మహాజన్, కవితలతో పాటు మరో ఇద్దరు బిజెపి ఎంపీలు, కాంగ్రెస్, శివసేన, బీఎస్పీల తరపున ఒక్కో ఎంపీ కూడా ఉన్నారు. ఆదివారం రాత్రి బయలుదేరిన ఈ బృందం 26 ఉదయం తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది.

English summary
TRS MP Kavitha has visited Belgium on a four-day tour starting from June 22. She has visited Belgium along with two BJP MPs, one MP each from Congress, BSP and Shiva Sena under the leadership of Lok Sabha Speaker Sumithra Mahajan to study the parliamentary affairs of European Union (EU) and other aspects of plenary meetings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X