వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిఆర్ఎస్ దూకుడు: చంద్రబాబును చిక్కుల్లో పెట్టేందుకు... (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి హైకోర్టుపై ఆలస్యం జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు గురువారం నాడు గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. కేంద్రం దీనిపై తాత్సారం చేస్తోందని ఆరోపించారు.

మరోవైపు, మంత్రి జూపల్లి కృష్ణా రావు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రావుల చంద్రశేఖర రెడ్డికి పాలమూరు ప్రాజెక్టుల పైన చర్చకు సవాల్ విసిరారు.

చర్చ కోసం జూపల్లి ప్రెస్ క్లబ్ వచ్చారు. రావుల రాకపోవడంతో ఆయన తెలంగాణ టిడిపి నేతల పైన మండిపడ్డారు. చర్చకు వచ్చే దమ్ము లేదన్నారు.

టిఆర్ఎస్ ఎంపీలు

టిఆర్ఎస్ ఎంపీలు

హైకోర్టు విభజనపై ఏపీ ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు సహకారం లభించడంలేదని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైనమేర చొరవ తీసుకోవాలని నరసింహన్‌ను గురువారం తెరాస పార్లమెంటరీ పార్టీ కోరింది.

టిఆర్ఎస్ ఎంపీలు

టిఆర్ఎస్ ఎంపీలు

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు విభజనపై వివరాలు అందజేయాలని ఏపీని కోరిందని, దాంతో కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ జూన్‌ 11వ తేదీన ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారని, తర్వాత 25వ తేదీన గవర్నర్‌కు కూడా లేఖ రాశారని, అయినా నుంచి ఎలాంటి స్పందనలేదన్నారు. ఎంపీల అభ్యర్థనపై గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్లు తెల్సింది. తాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఈ అంశంపై చర్చిస్తానని చెప్పినట్టు ఎంపీలు మీడియా ప్రతినిధులకు తెలిపారు.

 జూపల్లి

జూపల్లి

పాలమూరు జిల్లాలో చంద్రబాబు హయాంలోనే కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు వచ్చాయన్న టిడిపి నేతల మాటలు అబద్ధమని జూపల్లి అన్నారు. పాలమూరు ప్రజల్లో మట్టి కొట్టేందుకు టిడిపి నేతలు చంద్రబాబుతో కలిసి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

జూపల్లి

జూపల్లి

చంద్రబాబుకు పాలమూరు ప్రజలపై ప్రేమ ఉంటే పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని ఏపీ ప్రభుత్వ కేంద్ర జలవరుల సంఘానికి లేఖ రాయాలని సవాల్ చేశారు. తద్వారా బాబును చిక్కుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

English summary
Telangana Rastra Samithi MP'S MEMORANDUM TO GOVERNOR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X