వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో టిఆర్ఎశ్ పార్లమెంటు సభ్యులు ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజన త్వరగా చేయాలని ఎంపీలు డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. హైకోర్టు విభజన కాకపోవడంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఎంపీ కవిత, జితేందర్ రెడ్డిలు అన్నారు.

రాష్ట్రం ఏర్పడి ఏడాదైనా హైకోర్టు విభజన జరగకపోవడం దారుణమన్నారు. కేంద్రం తక్షణమే చొరవ తీసుకుని హైకోర్టు విభజన జరిగేలా చూడాలన్నారు. కొందరు కేబినెట్ మంత్రులే హైకోర్టు విభజనను అడ్డుకుంటున్నారన్నారు. మా హైకోర్టు మాకు కావాలని నినాదాలు చేశారు. ఈసారి నిర్ణయం తీసుకోవాలన్నారు.

మరోవైపు, తలసాని శ్రీనివాస్ రాజీనామా ఆమోదించాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు హైదరాబాదులో సభాపతి మధుసూధనా చారిని కలిశారు. సభాపతిని కలిసేందుకు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి తదితర ఐదుగురికి అనుమతించారు.

సభాపతిని కలిసిన అనంతరం తెలంగాణ టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. తలసాని రాజీనామాను ఇప్పటి వరకు ఎందుకు ఆమోదించలేదో చెప్పాలన్నారు. తలసాని సనత్ నగర్ నియోజకవర్గంలో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎర్రబెల్లి సవాల్ చేశారు.

అంతకుముందు స్పీకర్ ఇంటి ముందు టిడిపి నేతలు ఆందోళనకు దిగారు. తలసాని రాజీనామా పైన స్పీకర్ స్పష్టత ఇవ్వాలన్నారు. టిఆర్ఎస్‌లో చేరిన ఇతర ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాగా, మంగళవారం వారు గవర్నర్‌ను కలిసి, ధర్నా చేసిన విషయం తెలిసిందే.

టిఆర్ఎస్ ఎంపీలు

టిఆర్ఎస్ ఎంపీలు

పార్లమెంట్ ఆవరణలో టీఆర్‌ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. హైకోర్టు విభజన త్వరగా చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు.

పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్

పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే కేబినెట్లో చోటు దక్కించుకున్నారని, ఆయనను బర్తరఫ్ చేయాలంటూ టిడిపి నేతలు మంగళవారం రాజ్ భవన్ ఎదుట టిడిపి నేతలు ధర్నా చేశారు.

పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్

పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే కేబినెట్లో చోటు దక్కించుకున్నారని, ఆయనను బర్తరఫ్ చేయాలంటూ టిడిపి నేతలు మంగళవారం రాజ్ భవన్ ఎదుట టిడిపి నేతలు ధర్నా చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్

పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే కేబినెట్లో చోటు దక్కించుకున్నారని, ఆయనను బర్తరఫ్ చేయాలంటూ టిడిపి నేతలు మంగళవారం రాజ్ భవన్ ఎదుట టిడిపి నేతలు ధర్నా చేశారు. పోలీసు వాహనం ఆపేందుకు టిడిపి కార్యకర్తల ప్రయత్నం.

పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్

పార్లమెంట్లో టిఆర్ఎస్ ఆందోళన, గెలిస్తే... తలసానిపై ఎర్రబెల్లి సవాల్

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా చేయకుండానే కేబినెట్లో చోటు దక్కించుకున్నారని, ఆయనను బర్తరఫ్ చేయాలంటూ టిడిపి నేతలు మంగళవారం రాజ్ భవన్ ఎదుట టిడిపి నేతలు ధర్నా చేశారు.

English summary
TRS MPs protest at Parliament for High Court for Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X