వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలాగైనా ఓకే.. మాకే ప్రయోజనమే!: అసెంబ్లీ సీట్ల పెంపుపై టీఆర్ఎస్

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాలు పెంచినా, పెంచకున్నా ఫర్వాలేదని అధికార టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నది. ఒకవేళ సీట్లు పెంచితే తమకే అడ్వాంటేజ్‌ లభిస్తుందని గులాబీ పార్టీ అధినేత ఆశాభావంతో ఉన్నారు.
తమకు గల అవకాశాలను సద్వినియోగం చేసుకుంటామని టీఆర్ఎస్ నాయకత్వం ధీమాతో ఉన్నది.

గులాబీ పార్టీ నాయకత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలకు అభ్యర్థులే దొరకరన్న భరోసా నెలకొంది. ఈ నేపథ్యంలోనే గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలువక పోతే 'రాజకీయ సన్యాసం' తీసుకుంటానని సీఎం కేసీఆర్ తనయుడు, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సవాల్ చేశారు మరి.

 అసెంబ్లీ స్థానాల పెంపుపై బీజేపీపై ప్రాధాన్యం ఇలా

అసెంబ్లీ స్థానాల పెంపుపై బీజేపీపై ప్రాధాన్యం ఇలా

తెలంగాణలో ఇప్పుడు ఉన్న అసెంబ్లీ స్థానాలు 119.. ఒకవేళ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే 153 స్థానాలకు పెరుగుతాయి. దేనికైనా తాము సిద్ధమేనని అధికార టీఆర్‌ఎస్‌ అధిష్ఠాన శిబిరం చెబుతున్నది. ఎన్నికలను ఎదుర్కొనే క్రమంలో తమకు అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల సంఖ్య అప్రాధాన్యమని అభిప్రాయపడుతోంది. ఎన్నికల నాటికి అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగినా, పెరగకున్నా రాజకీయంగా ఎలాంటి ఇబ్బంది ఉండబోదనే ధీమా వ్యక్తం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై కేంద్రంలో కదలిక వచ్చిందనే వార్తల నేపథ్యంలో తెలంగాణలో అధికార పార్టీగా టీఆర్‌ఎస్‌ మనోగతం ప్రాధాన్యం సంతరించుకున్నది.

 కాంగ్రెస్ పార్టీలా బీజేపీ స్వలాభం మానుకుంటుందా?

కాంగ్రెస్ పార్టీలా బీజేపీ స్వలాభం మానుకుంటుందా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న హామీల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కూడా ఒకటి. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే, రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మాదిరిగా సొంత లాభం వదులుకుని ‘తెలంగాణ' ఏర్పాటు చేయడానికి సంసిద్ధం కావచ్చునేమో గానీ బీజేపీ ఆ పని చేసే అవకాశాలు లేశమాత్రం లేవంటి అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూర్చడానికి పూనుకుంటుందా? అన్నది అనుమానమే మరి.

ఇలా టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్, టీడీపీ నేతల చేరిక

ఇలా టీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్, టీడీపీ నేతల చేరిక

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే రాజకీయ పునరేకీకరణలో భాగంగా పలువురు కాంగ్రెస్‌, టీడీపీలతోపాటు ఇతర పార్టీల ప్రజా ప్రతినిధులు, ముఖ్యమైన కీలక నేతలను ‘గులాబీ' గూటిలో చేర్చుకున్నది. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌ చాలా కాలం క్రితమే మిగిలిన విభజన హామీలతోపాటు, నియోజకవర్గాల పెంపునకు పూనుకోవాలని కేంద్రానికి ఒక లేఖ ఇచ్చింది. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ కీలక నేతలు ఢిల్లీ పర్యటనల్లో కేంద్ర మంత్రుల వద్ద ఈ అంశంపై అడపాదడపా ప్రస్తావిస్తున్నా, సీరియస్‌గా ప్రయత్నించిన దాఖలాలు లేవు. తాజాగా ముందస్తు జమిలి ఎన్నికల ఆలోచన నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు ఆసక్తిగా ఉండటంతోనే ఆ పార్టీ రాష్ట్ర శాఖ ముఖ్య నేతలకు హస్తిన నుంచి పిలుపు వచ్చిందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ముఖ్య నాయకత్వం ఆసక్తిగా గమనిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.

 ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ సీట్లు అవసరం ఇలా

ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ సీట్లు అవసరం ఇలా

తాము అనుకున్నంత మాత్రాన అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండబోదని, కేంద్రం సానుకూలంగా ఉంటేనే, దాని ఆచరణ సాధ్యం అవుతుందనే వాస్తవం తమకు తెలుసునని పార్టీ ముఖ్యులు అంటున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కేంద్ర నాయకత్వం రాజకీయ లాభ, నష్టాలను బేరీజు వేసుకోదని ఊహించలేమని చెబుతున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న తమతో పోలిస్తే ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి అసెంబ్లీ స్థానాల పెంపు అవసరం ఎక్కువగా ఉందని టీఆర్‌ఎస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ భాగస్వామి టీడీపీ బలమైన ఆకాంక్ష మేరకు ఏపీలో స్థానాల పెంపు జరిగినప్పుడు, తెలంగాణలోనూ పెరుగుతున్నదని, ఈ విషయంలో తమకు ఎలాంటి కంగారు లేదని అంటున్నారు.

 పెరిగిన 34 స్థానాల్లో అభ్యర్థులు పుష్కలం ఇలా

పెరిగిన 34 స్థానాల్లో అభ్యర్థులు పుష్కలం ఇలా

కేంద్రం కనుక అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు పూనుకుంటే, ఈ ప్రక్రియ పూర్తి కావటానికి మూడు నెలల సమయం పడుతుందని, వచ్చే ఎన్నికలు పెరిగిన నియోజకవర్గాలకే జరుగుతాయని టీఆర్‌ఎస్‌ పెద్దలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే తమకు అడ్వాంటేజ్‌ ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తమ పార్టీలో 119కి తోడు, అదనంగా పెరుగుతాయని అనుకుంటున్న 34 అసెంబ్లీ స్థానాలకు మించి సమర్థులైన అభ్యర్థులు ఉన్నారని అంటున్నారు.

రాజ్యసభ, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టుల్లో భర్తీకి ఇలా హామీ

రాజ్యసభ, ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టుల్లో భర్తీకి ఇలా హామీ

మరోవైపు రాష్ట్రంలోని అసెంబ్లీ స్థానాల సంఖ్య 153కి పెరిగితే, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీతోపాటు విపక్షాలకు అన్ని స్థానాలకు అభ్యర్థులు కూడా ఉండరని చెబుతున్నారు. పేరుకు అన్ని స్థానాల్లో విపక్షాలు అభ్యర్థులను నిలబెట్టినా, టీఆర్‌ఎస్‌ ముందు తేలిపోవటం ఖాయమని చెబుతున్నారు. ఏదేని కారణాల వల్ల కేంద్రం రాష్ట్ర విభజన హామీ మేరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జోలికి వెళ్లని పరిస్థితుల్లో ఇప్పుడున్న 119 స్థానాలకే ఎన్నికలు జరిగినప్పటికీ, తమకు ఇబ్బందిలేదనే విశ్వాసంతో ‘గులాబీ' దళం ఉంది. తమ అవసరాల కంటే ఎక్కువగా ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల స్థాయి నేతలను ఇతరత్రా సర్దుబాటు చేస్తామని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. మండలి, రాజ్యసభ సభ్యత్వాలు, నామినేటెడ్‌ పదవులు కట్టబెడతామని అంటున్నారు.

English summary
TRS leader ship didn't serious on assembly seats hike. It's high command has ready to go polls with double stratergy with 119 or 153 seats. It's not interested that union government ready to hike assembly seats or not hike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X