హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీఆర్ఎస్ ఆవిర్భావం : సీఎం కేసీఆర్ ఎమోషనల్ - జెండా ఆవిష్కరణ : ఇక అధికారికంగా..!!

|
Google Oneindia TeluguNews

రెండు దశాబ్దాలకు పైగా తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన టీఆర్ఎస్ కొత్త పేరుతో రూపాంతరం చెందింది. 21 ఏళ్ల పార్టీ..60 లక్షల మంది పైగా కార్యకర్తలు ఉన్న టీఆర్ఎస్ తెలంగాణ పేరు స్థానంలో బీఆర్ఎస్ గా ఇక కొనసాగనుంది. పార్టీ అధినేత - తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ జెండాను నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 1.20 గంటలకు ఆవిష్కరించారు. పార్టీ అధినేతగా బీఆర్ఎస్ పత్రాల పైన సంతకాలు చేసారు. పార్టీ నేతలందరికీ బీఆర్ఎస్ కండువాలు కప్పారు. 21 ఏళ్లు టీఆర్ఎస్ నేతలుగా చెలామణి అయిన నేతల్లో ఒకింత ఉద్వేగం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమోషనల్ అయ్యారు. టీఆర్ఎస్ స్థానంలో బీఆర్ఎస్ వచ్చింది. జెండా రంగు అదే ఉంది. కానీ, జెండా మధ్యలో కారు మాత్రం కనిపించలేదు.

బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ తొలి సంతకం..

బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్ తొలి సంతకం..

సరిగ్గా 1.20 గంటలకు బీఆర్ఎస్ అధినేతగా సీఎం కేసీఆర్ సంతకం చేసారు. ఆ వెంటనే పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ ఒకింత ఎమోషనల్ అయ్యారు. దీనికి ముందు పార్టీ రూపాంతరం వేళ బీఆర్ఎస్ జెండాలను ఉంచి ప్రత్యేకంగా పూజలు చేసారు. వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. బీఆర్ఎస్ అధికారికంగా ప్రజల్లోకి వస్తున్న వేళ కేసీఆర్ కు పలువురు నేతలు శుభాకాంక్షలు చెప్పారు. సీఎం కేసీఆర్ తో పాటుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి .. జేడీఎస్ చీఫ్ కుమారస్వామితో పాటుగా సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ సాధించుకున్నాం.. తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకొన్నామో.. అదే విధంగా దేశాన్ని బాగుచేసుకొనేందుకు కదులుదాం అంటూ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటన నాడు దసరా రోజున పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా పార్టీ పేరు మార్పుకు ఆమోదం రావటం తో ఈ రోజు నుంచి టీఆర్ఎస్ ఇక అధికారికంగా బీఆర్ఎస్ గా మారింది.

అదే రంగు..జెండా - అజెండాలో కొత్తదనం

బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. గులాబీ రంగులోనే బీఆర్ఎస్ జెండా ఖరారు చేసారు. జెండా మధ్యలో తెలంగాణ స్థానంలో భారత దేశ మ్యాప్ ను ఉంచారు. జెండా ఆవిష్కరణ పూర్తయిన వెంటనే కేసీఆర్ తన మెడలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అక్కడ ఉన్న పార్టీ ముఖ్యులకు బీఆర్ఎస్ కండువా కప్పారు. జెండాను ఆవిష్క‌రించిన స‌మ‌యంలో తెలంగాణ భ‌వ‌న్ ప‌టాకులు, డ‌ప్పుల‌తో ద‌ద్ధ‌రిల్లిపోయింది. జై కేసీఆర్, జై భార‌త్ నినాదాలు మార్మోగాయి. దేశ పౌరులుగా మన దేశాన్ని మనం కాపాడుకుందామా.. మీరంతా కలిసి వస్తారా అంటూ కేసీఆర్ పలు సభల్లో ప్రజలను కోరారు. ఆ సమయంలో ప్రజల నుంచి వచ్చిన స్పందనతో ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటులో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. పార్టీ పేరు మార్పు పై ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా లేఖ రావటంతో ఇక ఆలస్యం చేయకుండా ముందుగానే నిర్ణయించిన విధంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఇక..తెలంగాణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేసీఆర్ తన రాజకీయ కార్యకలాపాలు వేగవంతం చేసారు.
ఆనందం - ఉద్విగ్న క్షణాలు

ఆనందం - ఉద్విగ్న క్షణాలు


టీఆర్ఎస్ 21 ఏళ్లుగా ఆ పార్టీ లో సీఎం కేసీఆర్ మొదలు పార్టీ నేతలు - కార్యకర్తల వరకు అందరి జీవితాలతో పెనవేసుకున్న బంధం. ఇప్పుడు ఆ పేరు మారింది. బీఆర్ఎస్ గా టీఆర్ఎస్ రూపాంతరం చెందింది. దీని ద్వారా ప్రాంతీయ పార్టీ ఒక జాతీయ పార్టీగా అడుగులు వేస్తోంది. పేరు మార్పు పూర్తయినా.. సాంకేతికంగా జాతీయ పార్టీ హోదా కోసం చేయాల్సింది ..సాధించాల్సింది మిగిలే ఉంది. ఇక, ఈ పార్టీ పేరు మార్పు పైన దసరా కు ముందే పార్టీ సమావేశంలో సీఎం కేసీఆర్ పార్టీలోని నేతలందరికీ వివరించారు. ఇక, ఇప్పుడు బీఆర్ఎస్ పేరుతో గులాబీ పార్టీ నేతలు ఎన్నికల బరిలోకి దిగాల్సి ఉంది. బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల ను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఇక, ఇప్పుడు బీఆర్ఎస్ తక్షణ లక్ష్యం.. రాజకీయ అడుగులు ఏంటనేది ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

English summary
TRS now Officiallayy changes as BRS, CM KCR Emotional moments durgin new party flag hoasting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X