హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్ధరాత్రైనా సమస్య పరిష్కరిస్తా: డ్యాన్స్ చేసిన మంత్రి (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో కనివిని ఎరుగని రీతిలో 150 డివిజన్లకు గాను 99 డివిజన్లలో విజయం కేతనం ఎగురవేయడంపై పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలాయి. హైదరాబద్ చరిత్రలోనే తొలిసారి అత్యధిక స్థానాలను గెలుచుకుని టీఆర్ఎస్ మేయర్ పీఠం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని, టపాసులు కాల్చి, రంగులు చల్లుకుని, బైక్ ర్యాలీలు, తీన్ మార్ డ్యాన్సులతో హోరెత్తించారు. ఈ సందర్భంగా మంత్రి పద్మారావు ఇంటి దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మంత్రి పద్మారావు డ్యాన్స్ చేశారు.

 కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

ఈ సందర్భంగా మంత్రి పద్మారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంపై ప్రజలు నమ్మకంతో ఓట్లువేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలపించారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు.

కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రతి కుటుంబం తమ కుటుంబ పెద్దగా భావించి ఓట్లరూపంతో అభిమానాన్ని చాటుకున్నారన్నారు.

కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయకుండా చూస్తామన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా అర్థరాత్రి అయినా సరే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటానన్నారు.

 కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

సికింద్రాబాద్ నియోజకవర్గంలో కనీసం పదివేల డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పారు. నియోజకవర్గంలో సరైన ఫంక్షన్‌హాల్‌లు ఎక్కడా లేవని, సీతాఫల్‌మండిలో ఉన్న వెల్ఫేర్‌సెంటర్ స్థలంలో మల్టీఫ్లెక్స్ పంక్షన్ హాల్‌ను నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

హైజెనిక్ డిజైన్‌లో ప్రకృతి అందాలను తలపించేలా దీని నిర్మాణం ఉంటుందని చెప్పారు. మరో నాలుగైదు నెలల్లో నీటి సమస్య తీరతాయని చెప్పారు. వేసవిలో ప్రజలు నిరంతర విద్యుత్ ఉంటుందన్నారు.

 కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

కొందరు నాయకులు టీఆర్‌ఎస్‌ను ఎంతో చులకనగా మాట్లాడారని, ఏ నాయకుడు ఎక్కడెక్కడ పనిచేశారో తనకు పూర్తిగా తెలుసునని చెప్పారు. కష్టపడి అభ్యర్థులను గెలిపించుకున్న నాయకులకు పార్టీ అండగా ఉంటుందన్నారు.

 కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

గత 30 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు అందించిన ప్రజలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజాతీర్పు పట్ల ప్రభుత్వంపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు.

 కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

గత 19 మాసాలుగా సీఎం కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలపై పూర్తి విశ్వాసంతో పార్టీని ఆదరించిన అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని చూసుకుంటామని చెప్పారు.

 కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

సీఎం నేతృత్వంలో రూపొందిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఎజెండాలో అంశాలను తూచా తప్పకుండా అమలు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి తలసాని హామీ ఇచ్చారు.

 కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

కార్యకర్తలతో కలిసి డ్యాన్స్ చేసిన మంత్రి పద్మారావు

హైదరాబాద్ నగరానికి 24 గంటల విద్యుత్ సరఫరాతో పాటు మంచినీటి సమస్య పరిష్కారానికి, నగరం ఇరువైపులా తలపెట్టిన రెండు భారీ రిజర్వాయర్ల నిర్మాణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామన్నారు.

English summary
Trs party leaders celebrating win at midnight padmarao house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X