వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గులాబీ పార్టీ ఆఫీసుల భూమిపూజ .. భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సోదరుడు , సూర్యాపేటలో రైతులు అడ్డగింత

|
Google Oneindia TeluguNews

Recommended Video

టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ శంకుస్థాపనను అడ్డుకున్న గండ్ర నారాయణరెడ్డి || TRS Party Offices To Be Laid

టిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల శంకుస్థాపన నేడు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమాలు జరుగుతుంటే కొన్ని చోట్ల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపన వివాదాలకు కారణం అవుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మాత్రం టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి సోదరుడు గండ్ర నారాయణ రెడ్డి. ఇక సూర్యాపేటలో కూడా శంకుస్థాపన అడ్డుకుంటామని రైతులు ఆందోళన చేశారు.

ఏపీ కలెక్టర్ల సమావేశం .. పక్కా ఇళ్ళ విషయంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశంఏపీ కలెక్టర్ల సమావేశం .. పక్కా ఇళ్ళ విషయంలో సీఎం జగన్ కీలక ప్రకటన చేసే అవకాశం

భూపాలపల్లిలో టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే గండ్ర సోదరుడు గండ్ర నారాయణ రెడ్డి .. శంకుస్థాపన అడ్డగింత

భూపాలపల్లిలో టీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చిన ఎమ్మెల్యే గండ్ర సోదరుడు గండ్ర నారాయణ రెడ్డి .. శంకుస్థాపన అడ్డగింత

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమిని సేకరించారు. నేడు శంకుస్థాపన కోసం సేకరించిన స్థలంలో భూమి పూజ నిర్వహించాలనుకున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులను సోదరుడు నారాయణరెడ్డి అడ్డుకున్నారు. సర్వేనెంబర్ 170 లో గల భూమి తమదంటూ వరంగల్ అర్బన్ జిల్లా కు చెందిన మిరియాల పాపిరెడ్డి, అలాగే చెల్పూరు గ్రామానికి చెందిన గండ్ర నారాయణ రెడ్డి అదే స్థలంలో భూమి పూజ నిర్వహించకుండా తమకున్న లారీలను ఆ స్థలంలో పార్క్ చేశారు. అంతేకాదు తమ స్థలంలో పార్టీ కార్యాలయం ఏ విధంగా కడతారు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

 భూమి పూజ చెయ్యకుండా లారీల పార్కింగ్.. స్థలం నుండి లారీలను తీసివేయించిన అధికారులు

భూమి పూజ చెయ్యకుండా లారీల పార్కింగ్.. స్థలం నుండి లారీలను తీసివేయించిన అధికారులు

దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, పోలీసులు అది ప్రభుత్వ స్థలం అని చెప్పి లారీలను అక్కడినుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ భూమి పూజకు సంబంధించి అన్ని ఏర్పాటు చేసుకున్న నేపధ్యంలో సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే ఇటీవల టీఆర్ ఎస్ లో ఫిరాయించిన ఎమ్మెల్యే అయిన గండ్ర వెంకటరమణారెడ్డి సోదరుడే ఆందోళన చేయడం గమనార్హం. ఇక ఈ స్థల వివాదం విషయంలో తాను వెనక్కి వెళ్ళేది లేదంటూ, ఖచ్చితంగా తన స్థలం కోసం పోరాటం చేస్తాం అంటూ గండ్ర సోదరుడు తేల్చి చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి టిఆర్ఎస్ పార్టీ కార్యాలయాల భూమి పూజ వేళ భూపాలపల్లిలో టీఆర్ఎస్ పార్టీకి అధికార పార్టీలో ఉన్న నేత సోదరుడే షాక్ ఇవ్వడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

నల్గొండ జిల్లాలో కూడా శంకుస్థాపన అడ్డుకుంటామని ఆందోళన చేసిన భూ నిర్వాసితులు

నల్గొండ జిల్లాలో కూడా శంకుస్థాపన అడ్డుకుంటామని ఆందోళన చేసిన భూ నిర్వాసితులు

నల్లగొండ జిల్లా సూర్యాపేటలో కూడా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపనను అడ్డుకున్నారు భూ నిర్వాసితులు. టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం తమ భూమిని లాక్కోవడం ఎంతవరకు సమంజసమని భూ నిర్వాసితులు ఆందోళన చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని లేదంటే శంకుస్థాపన ను అడ్డుకుంటామని పేర్కొన్నారు. గతంలోనే ఎస్పీ కార్యాలయం కోసం ప్రభుత్వం కొంత భూమిని తీసుకుందని, మళ్లీ ఇప్పుడు పార్టీ కార్యాలయం కోసం భూమిని తీసుకుంటుందని ఆందోళన చేసిన రైతులు తమ సమస్యను మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి వివరించారు. ఇక జగదీశ్వర్ రెడ్డి రైతులకు పరిహారం అందేలా చూస్తానని ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు రైతులు.

English summary
TRS party chief, Telangana CM KCR said to the party leaders TRS party offices to be laid today. The TRS party's office-building activities are going on in some places, causing controversy. Jayashankar in Bhupalapalli district, the TRS party was given the nod by MLA Gandra Venkata Ramana Reddy's brother, Gandra Narayana Reddy.Farmers were impeded in suryapet because they haven't get ex gratia .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X