కాంగ్రెస్‌కు చెక్: విద్యుత్‌పై విపక్షాల విమర్శలకు కౌంటర్, కెసిఆర్ ప్లాన్ ఇదే

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: విద్యుత్ విషయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలనే టిఆర్ఎస్ నిర్ణయించింది. పదేళ్ళ కాంగ్రెస్ పార్టీ పాలనలో విద్యుత్ విషయంలో చోటు చేసుకొన్న పరిణామాలను టిఆర్ఎస్ ప్రస్తావించాలని భావిస్తోంది.

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ ఇస్తోంది. అయితే 24 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరా విషయంలో విపక్షాలు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ విమర్శల నేపథ్యంలో టిఆర్ఎస్‌ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టాలని టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో విద్యుత్ విషయంలో ఏ రకంగా నిర్లక్ష్యం చేసిందనే విషయాన్ని అసెంబ్లీ వేదికగా నిరూపించాలని టిఆర్ఎస్ యోచిస్తోంది.

టిఆర్ఎస్ వ్యూహత్మక అడుగులు

టిఆర్ఎస్ వ్యూహత్మక అడుగులు

విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పక్షాలు చేస్తున్న విమర్శలపై టిఆర్ఎస్ వ్యూహత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించింది. అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని టిఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏ రకంగా విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిందనే విషయాలను కూడ టిఆర్ఎస్ లెక్కలతో సహ వివరించాలని భావిస్తోంది.

తప్పుడు విమర్శలపై సమాధానాలు

తప్పుడు విమర్శలపై సమాధానాలు

తమ ప్రభుత్వం హయంలో తప్పులు జరిగితే ఆ తప్పులకు సంబంధించిన ఆధారాలతో రావాలని టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తో సహ ఇతర పక్షాలకు సవాల్ చేయాలని టిఆర్ఎస్ యోచిస్తోంది. ఈ విషయాన్ని టిఆర్ఎస్ ముఖ్య నేతలు తమ అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఏ రకంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం కల్గిందనే వివరాలను కూడ టిఆర్ఎస్ నేతలు ఇవ్వాలని భావిస్తున్నారు.

ఇసుక రవాణాపై

ఇసుక రవాణాపై

కాంగ్రెస్‌ నేతలు కేవలం రాజకీయ కారణాలతోనే ఇసుక రవాణాకు సంబంధించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారనే భావన టిఆర్ఎస్ నేతల్లో ఉంది. ఈమేరకు కాంగ్రెస్‌ హయాంలో ఇసుక రవాణా తీరు, ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం, ఇప్పుడు ఇసుక రవాణా సాగుతున్న తీరు, ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం వివరాలను గణాంకాలతోసహా అసెంబ్లీలో ప్రకటించాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది.

అసెంబ్లీ పకడ్బందీగా వ్యవహరించాలి

అసెంబ్లీ పకడ్బందీగా వ్యవహరించాలి

అసెంబ్లీలో పకడ్బందీగా వ్యవహరించాలని టిఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. అసెంబ్లీ తేదీలు ఖరారు చేసేలోపు విపక్షాల విమర్శలకు, ప్రతివిమర్శలు చేసినప్పటికీ, సభా వేదికగా మాత్రం పకడ్బందీగా విపక్షాల విమర్శలను దీటుగా ఆధారాలతోసహా తిప్పికొట్టాలని భావిస్తున్నారు. సభా వేదికగా మాత్రం పకడ్బందీగా విపక్షాల విమర్శలను దీటుగా ఆధారాలతోసహా తిప్పికొట్టాలని భావిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Trs planning to expose congress party's negligence on electricity department in the coming Assembly sessions .

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి