వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గులాబీ పార్టీకి నిర‌శ‌న‌ల సీజ‌న్ న‌డుస్తోంది..! హోమం తో శాంతి చేయాలె..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

టిఆర్ఎస్ లో నిర‌శ‌న‌ల ప‌ర్వం..!

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్ర స‌మితి లో నిర‌శ‌న‌ల ప‌ర్వం కొన‌పాగుతోంది. ఏకంగా మంత్రుల ముందే త‌మ నిర‌శ‌న‌ల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఐతే ఇటీవ‌ల టికెట్ రాని వారు గులాబీ పార్టీని విమ‌ర్శిస్తే అంద‌రూ లైట్ గా తీసుకున్నారు. కాని సామాన్య‌క‌ర్త‌లు కూడా ప్ర‌భుత్వ తీరును స్వ‌యంగా మంత్రి కేసీఆర్ ముందే ఎండ‌గ‌డుతుంటే అదికారులంద‌రూ అవాక్క‌య్యారు. సిరిసిల్ల కార్యకర్తల సమావేశంలో మంత్రి కేటీఆర్ కు ఓ కార్యకర్త ఝలక్ ఇచ్చారు. కార్యకర్తలకు మాట్లాడనిచ్చే ధైర్యం, స్వేచ్ఛ లేని ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటు ఆయన ముందే విరుచుకుపడ్డాడు. కార్యకర్తలు మాట్లాడటం సిగ్గుచేటా అని కార్యకర్త ఆవేశంగా ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డి పేట కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ కు ఈ అనుభవం ఎదురైంది. కార్యకర్త ప్రసంగం ముగిసిన తర్వాత మంత్రి కేటీఆర్ ఆయనను పిలిపించుకొని పేరు అడిగి తెలుసుకోవడం గ‌మ‌నార్హం.

అంతంకాదు ఆరంభం లా నిర‌శ‌స‌న‌లు..! టీఆర్ఎస్ లో ఊపందుకున్న నిర‌శ‌న‌ల ప‌ర్వం..!!

అంతంకాదు ఆరంభం లా నిర‌శ‌స‌న‌లు..! టీఆర్ఎస్ లో ఊపందుకున్న నిర‌శ‌న‌ల ప‌ర్వం..!!

కేసీఆర్ వ్యవహారశైలిపైన వరంగల్ ఈస్ట్‌ నాయకురాలు కొండ సురేఖ నిప్పులు చెరిగి రెండు వారాలు కాకుండానే మరో నాయకురాలు ఆ దారిలోనే నడవడానికి సిద్ధమౌతున్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకుండా పెండింగ్‌ లో ఉంచడంతో తీవ్ర ఆగ్రహంగా ఉన్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బుడిగె శోభ ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గత వారం రోజులుగా సిఎం కేసీఆర్ తో పాటు కేటీఆర్ ను కలవడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మూడు రోజుల క్రితం సిరిసిల్లలో కేటీఆర్ ను శోభ కలిశారు.అయితే ఎక్కువ సమయం ఇవ్వకపోవడంతో పాటు ఆయన వ్యవహారశైలితో బుడిగ శోభ ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. తనకు టిక్కెట్‌ ఇచ్చే అవకాశాలు ఎంత మాత్రం లేకపోవడంతో ఆమె తుది నిర్ణయానికి వచ్చినట్లు అనుచరులు చెపుతున్నారు.

బీజేపిలోకి శోభ‌..! కేసీఆర్ పై కారాలు, మిరియాలు నూరుతున్న మాజీ ఎమ్మెల్యే..!!

బీజేపిలోకి శోభ‌..! కేసీఆర్ పై కారాలు, మిరియాలు నూరుతున్న మాజీ ఎమ్మెల్యే..!!

టీఆర్ఎస్ కు రాజీనామా చేయడానికి శోభ సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఆమె చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెపుతున్నాయి. కాంగ్రెస్ లో అవకాశం లేకపోవడంతోనే ఆమె బీజేపీని ఎంచుకున్నట్లు సమాచారం. ఇక్కడ కాంగ్రెస్ టిక్కెట్ రేవంత్ రెడ్డి అనుచరుడు సత్యంకు దాదాపుగా ఖరారైంది. మరో వైపు మాజీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య టీఆర్ఎస్ లో చేరడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. దీంతో ఆయనకే ఆ పార్టీ టిక్కెట్ సూచనలున్నాయి.తనకు కేసీఆర్ అవకాశం ఇవ్వరని స్పష్టంగా అర్థమైన తర్వాతే ఆమె బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

 గులాబీ పార్టీకి న‌ల్గొండ జిల్లా లో పెద్ద కుదుపు..! ముఖ్య‌నేత‌లు పార్టీకి రాం రాం..!!

గులాబీ పార్టీకి న‌ల్గొండ జిల్లా లో పెద్ద కుదుపు..! ముఖ్య‌నేత‌లు పార్టీకి రాం రాం..!!

టీఆర్ఎస్ కు నల్గొండ జిల్లాలో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా రెబెల్స్ కాలు దువ్వుతున్నారు. నకిరేకల్, మునుగోడు, ఆలేరు, నల్గొండ, మిర్యాలగూడా, దేవరకొండ, హూజూర్ నగర్, కోదాడ, నాగార్జున సాగర్ నియోజకవర్గాల్లో పార్టీలో కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా అసమ్మతి నేతలు భారీ ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే టీఆర్ఎస్ కు జిల్లా పరిషత్ ఛైర్మన్ బాలునాయక్ ఝలక్ ఇచ్చారు. దేవరకొండ టిక్కెట్ రవీంధ్రనాయక్ కు ఇవ్వడంపైన తీవ్ర అసంత్రుప్తితో ఉన్న ఆయన టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు.

గులాబీ నేత బాలు నాయ‌క్ ఔట్..!! కాంగ్రెస్ లో చేరేందుకు స‌న్నాహాలు..!!

గులాబీ నేత బాలు నాయ‌క్ ఔట్..!! కాంగ్రెస్ లో చేరేందుకు స‌న్నాహాలు..!!

ఈ నెల 26న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు బాలునాయక్. వాస్తవానికి ఆయ‌న కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే. కాంగ్రెస్ తరుపునే ఆయన జిల్లా పరిషత్ ఛైర్మన్ గా ప‌నిచేసారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. కాని దేవరకొండ సిపిఐ నుంచి విజయం సాధించిన ఎమ్మెల్యే రవీంద్రనాయక్ కూడా గులాబీ కండువా కప్పుకోవడంతో బాలునాయక్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. నియోజకవర్గంలో టీఆర్ఎస్ రెండు వర్గాలుగా వీడిపోయింది. దేవరకొండ టిక్కెట్ ను రవీంద్రనాయక్ కు కేటాయించడంతో బాలునాయక్ తన అస్థిత్త్వం కోసం పార్టీని వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో సొంత గూటికి చేరుకోవ‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్నారు నాయ‌క్. దీంతో తెలంగాణ‌స్త్ర వ్యాప్తంగా చెల‌రేగుతున్న అసంత్రుప్తికి ఎలా అడ్డుక‌ట్ట వేయాలా అని గులాబీ బాస్ ఆలోచిస్తున్నార‌ట‌. ఇదే సంద‌ర్బంలో పార్టీలోని ఓ సీనియ‌ర్ హోమం చేసి పార్టీలో శాంతి నెల‌కొల్పుదామ‌ని స‌ల‌హా ఇచ్చిన‌ట్టు ప్ర‌గ‌తిభ‌వ‌న్ వ‌ర్గ‌లు
చెప్పుకొస్తున్నాయి.

English summary
dissatisfaction leaders in telangana raising their voice against trs. the leaders, mlas demanding seats again for them. telangana cm kcr planing to accommodate them in nominated posts. but those leaders rejecting nominated posts and focusing on as mla candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X