వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు షాక్: టిఆర్ఎస్‌కు 102 సీట్లు, ముందస్తుకు కెసిఆర్ సై

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడు జరిగినా రాష్ట్రంలోని 102 స్థానాల్లో విజయం సాధిస్తామని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు పార్టీ నేతలకు ఎన్నికలకు సిద్దంగా ఉండాలని సూచిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా తమకు ప్రయోజనమనే అభిప్రాయాన్ని టిఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. నామినేటేడ్ పోస్టుల భర్తీతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని పార్టీ నాయకత్వం యోచిస్తోంది.

పవన్‌కు తెలంగాణపై ప్రేమెందుకు పుట్టింది, వైఎస్ఆర్‌ నాకు లైప్ ఇచ్చారు: పొన్నంపవన్‌కు తెలంగాణపై ప్రేమెందుకు పుట్టింది, వైఎస్ఆర్‌ నాకు లైప్ ఇచ్చారు: పొన్నం

2019లో కూడ మరోసారి తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేసేందుకు పావులు కదుపుతున్నారు.

టార్గెట్ 2019: కెసిఆర్‌కు వ్యతిరేకంగా మహకూటమి, పవన్ దారెటు?టార్గెట్ 2019: కెసిఆర్‌కు వ్యతిరేకంగా మహకూటమి, పవన్ దారెటు?

అయితే రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్‌కు 2019 ఎన్నికల్లో పోటీ ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలను దృష్టిలొ ఉంచుకొన్న కెసిఆర్ ఇతర పార్టీల నుండి కూడ బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

ముందస్తుకు కూడ టిఆర్ఎష్ సిద్దమే

ముందస్తుకు కూడ టిఆర్ఎష్ సిద్దమే

2019 నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ఎన్నికలు జరిగినా తాము అందుకు సిద్దంగా ఉన్నామని టిఆర్ఎస్ నాయకత్వం చెబుతోంది. ఇప్పటికే పలు సర్వేల్లో టిఆర్ఎస్‌కు అనుకూలమైన వాతావరణం ఉందని తేలిందని టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పార్టీ నేతలకు భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా 102 సీట్లను కైవం చేసుకొంటామని కెసిఆర్ పార్టీ నేతలకు సర్వే రిపోర్ట్‌ వివరాలను అందిస్తున్నారని సమాచారం. ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడ పార్టీ విజయం కోసం ప్రయత్నాలు చేయాల్సిన అవసరాన్ని కెసిఆర్ పార్టీ శ్రేణులకు నొక్కి చెబుతున్నారు.

ఫిబ్రవరి 1 నుండి పార్టీ కార్యక్రమాలు విస్తృతం

ఫిబ్రవరి 1 నుండి పార్టీ కార్యక్రమాలు విస్తృతం

ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా సిద్దంగా ఉండేందుకు వీలుగా ఉండాలని పార్టీ నేతలకు కెసిఆర్ సూచించారు. మరో వైపు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసే కార్యక్రమాలపై కూడ కెసిఆర్ కేంద్రీకరించారు. ఈ మేరకు ఫిబ్రవరి 1వ, తేది నుండి పార్టీ సంస్థాగత నిర్మాణంపై కెసిఆర్ కేంద్రీకరించనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారంలో పార్టీ పొలిట్‌బ్యూరో, నామినేటేడ్ పదవులను భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం.

త్వరలోనే ముఖ్య నేతలతో కెసిఆర్ సమావేశం

త్వరలోనే ముఖ్య నేతలతో కెసిఆర్ సమావేశం

టిఆర్ఎస్ఎల్పీ, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీతో పాటు పార్టీలోని ముఖ్య నేతలతో కెసిఆర్ త్వరలోనే సమావేశం కావాలిని యోచిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన సర్వే ఫలితాలను పార్టీ నేతలకు కెసిఆర్ పూర్తిస్థాయిలో వివరించే అవకాశం ఉంది. ఏ ప్రాంతంలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయనే విషయమై సర్వేల రిపోర్టుల ఆధారంగా కెసిఆర్ వివరించే అవకాశం లేకపోలేదని కెసిఆర్ చెబుతున్నారు.

Recommended Video

2019 Assembly Elections : TRS Tickets సిట్టింగ్‌లకు టిక్కెట్లు దక్కుతాయా ? | Oneindia Telugu
ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి

ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలి

ప్రజల సంక్షేమం కోసం చేపట్టిన పనుల గురించి ఎప్పటికప్పుడు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని కెసిఆర్ చెప్పారు సంక్షేమ రంగంలో టిఆర్ఎస్ అనుసరిస్తున్న పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కెసిఆర్ పార్టీ నేతల వద్ద ప్రస్తావించారు. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని కెసిఆర్ సూచించారు.

English summary
While stating that the Centre would not take the risk of holding early polls by implementing its proposal of conducting simultaneous elections to both Lok Sabha and State Assemblies this year, TRS ready to face the general elections even if they are held much earlier than the scheduled time, sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X