హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రగతి నివేదన సభ: చెప్తా... అసెంబ్లీ రద్దు, రాజకీయ నిర్ణయాలపై కేసీఆర్ కీలక ప్రకటన

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ అట్టహాసంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభకు నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. బహిరంగ సభకు ముందు కేబినెట్ భేటీ కావడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకొంది. ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జరుగుతున్న సభపై ఆసక్తి నెలకొంది. సీఎం ఏం చెబుతారనే చర్చ సాగింది. అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ ఏదో చెబుతారని అందరూ భావించారు. కానీ వాటి గురించి తర్వాత సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. వాటిపై తాను నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు చెబుతానని అన్నారు.

Recommended Video

    అవును ఆ పిచ్చోడిని నేనే అని చెప్పా: కేసీఆర్ |
    TRSs Pragathi Nivedana Sabha Live: All roads lead to Kongara Kalan

    Newest First Oldest First
    7:27 PM, 2 Sep

    టీఆర్ఎస్ అధికారంలో లేకుంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేకుంటే రిజర్వేషన్లు అమలు అయి ఉండకపోయేవన్నారు. ఇది తమ నిబద్దత అన్నారు. మనం ఢిల్లీకి గులాంగిరి చేసేవారిగా ఉందామా, లేక స్వతంత్ర గులాబీలుగా ఉందామా ప్రజలు గమనించాలన్నారు. మనం ఢిల్లీకి బానిసలం కావొద్దన్నారు. నిర్ణయాధికారం మన చేతుల్లోనే ఉండాలన్నారు. ప్రజలు మరోసారి తనను దీవిస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని చెప్పారు.
    7:22 PM, 2 Sep

    మళ్లీ కేసీఆరే రావాలని ప్రజావాణి వినిపిస్తోందని కేసీఆర్ చెప్పారు. ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాతో పాటు గ్రామాల్లోకి టీవీ వాళ్లు వెళ్లినా ప్రజలు కేసీఆర్‌ను కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ ఏదో రాజకీయ నిర్ణయం తీసుకుంటారని, అసెంబ్లీ రద్దు తదితర అంశాలపై చెబుతారని మీడియా చెబుతోందని, కానీ ఏది మంచి నిర్ణయం అయితే అది తీసుకోవాలని, మంత్రి వర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు తనకు అప్పగించారని కేసీఆర్ చెప్పారు. రాజకీయ పరమైన నిర్ణయాలు త్వరలో తీసుకుంటామన్నారు. కొత్త పథకాలు ప్రకటిస్తారని కూడా పత్రికలు రాశాయన్నారు. కానీ చెబితే అమలు చేయాల్సి ఉంటుందని, అది సరికాదని, కాబట్టి తాను అలా చెప్పదల్చుకోలేదన్నారు. జోన్ల వ్యవస్థపై మోడీని అడిగి తెచ్చుకున్నానని చెప్పారు.
    7:08 PM, 2 Sep

    ఓ రోజు ఉద్యమం సమయంలో తాను వరంగల్ జిల్లా ములుగు ప్రాంతానికి వెళ్లానని, అప్పుడు బీమా నాయక్ అనే వ్యక్తి ఏడవటం తాను చూశానని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇంట్లో పెళ్లికి రూ.50వేలు తెచ్చి పెట్టుకుంటే కాలిపోయాయని కన్నీరుమున్నీరు అయ్యాయని, ఆయనకు తాను రూ.1 లక్ష ఇచ్చి, ఆ పెళ్లికి కూడా వెళ్లివచ్చానని చెప్పారు. తాను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళితులు, పేదల ఇళ్లలోని వారికి పెళ్లిళ్లు చేశానని, ఇదే ఇప్పుడు ప్రభుత్వ పరంగా మేం తీసుకు వచ్చిన కళ్యాణలక్ష్మి అన్నారు. కళ్యాణ లక్ష్మి, రైతు బంధు వంటి వాటిని అమలు చేస్తున్నామని చెప్పారు. కేసీఆర్ మాటలు చెప్పడని, చేసి చూపిస్తాడన్నారు. తెలంగాణలలో రైతులు అప్పుల్లో ఉన్నారని, అందుకే రైతు బంధు అన్నారు.
    7:08 PM, 2 Sep

    సమైక్యాంధ్ర పాలనలో తెలంగాణలో విధ్వంస పాలన సాగిందన్నారు. ఈ పాలనపై తాను కూడా ఏడ్చానని చెప్పారు. ఆ రోజు సిరిసిల్ల గోడలపై నాటి కలెక్టర్ రాయించిన రాతలు చూసి కన్నీళ్లు వచ్చాయన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, ఆత్మహత్యలు పరిష్కారం కాదని రాశారని, అలా రాసుకునే దౌర్భాగ్యం రావడం దారుణం అన్నారు. తెలంగాణ వచ్చాక నేతన్నలు సంతోషిస్తున్నారని చెప్పారు. మనం ఇంకా ఎంతో చేయాల్సి ఉందన్నారు. నాటి సమైక్య పాలకులు చీఫ్ లిక్కర్ లాబీకి తలొగ్గి, నేతన్నల పొట్ట గొట్టారన్నారు. పారిశ్రామిక వృద్ధి మాత్రమే వృద్ధి అని, ఐటీ వృద్ధి అని చెబుతుంటారని, కానీ గొర్రెల పెంపకం కూడా అభివృద్ధేనని చెప్పారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో గొర్లు పంచగా, ఈ రోజు గొల్లకురుమలు ఆనందంగా ఉన్నారని చెప్పారు.
    6:57 PM, 2 Sep

    తెలంగాణ కోసం తాను ఢిల్లీలో ఓ కమ్యూనిస్ట్ నేత వద్దకు 38 సార్లు తిరిగానని, దానికి ఆయన తనను పిచ్చిడివానయ్యా అని అన్నారని, అప్పుడు తాను అవును నేను పిచ్చోడినేనని, తెలంగాణ పిచ్చోడినని ఆయనకు చెప్పానని కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చాక కొత్త రాష్ట్రంలో ప్రజలు తెరాసను ఆశీర్వదించారని చెప్పారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో విపత్కర పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో మన ప్రస్తానం ప్రారంభించామన్నారు. జయశంకర్ తెలంగాణకు ఆత్మ అన్నారు. తెలంగాణ వస్తే ఏం చేయాలనే విషయాన్ని జయశంకర్‌తో కలిసి ఎప్పుడో రాసుకున్నామని చెప్పారు. నేటి మిషన్ కాకతీయ 12 ఏళ్ల క్రితం జయశంకర్ కల అన్నారు. దేశంలో 24 గంటల విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణే అన్నారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మారుస్తామన్నారు.
    6:53 PM, 2 Sep

    కేసీఆర్ ప్రసంగం ప్రారంభమైంది.
    6:39 PM, 2 Sep

    రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ వద్ద డీసీఎం వ్యానుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నల్గొండ జిల్లా మాదారం వాసి జానీ(35)గా గుర్తించారు. అతను కొంగర కలాన్‌లో జరుగుతున్న ప్రగతి నివేదనసభకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
    6:31 PM, 2 Sep

    టీఆర్ఎస్ ర్యాలీ వేదిక వద్ద కేసీఆర్
    6:19 PM, 2 Sep

    ప్రగతి నివేదన సభకు వచ్చిన ట్రాక్టర్లు అన్నీ రాత్రికి ఇక్కడే ఉంచుతామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. రేపు ఉదయం వాటిని పంపిస్తామన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సభ పూర్తయిన తర్వాత ముందు ప్రకటించిన రూట్లలోనే వెళ్లాలన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా ఎవరూ ప్రవర్తించవద్దని కోరారు.
    6:16 PM, 2 Sep

    ప్రగతి నివేదన సభకు చేరుకున్న కేసీఆర్
    5:44 PM, 2 Sep

    టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సాంస్కృతిక సారథి బృందం తెలిపింది. రసమయి బాలకిషన్ నేతృత్వంలోని కళాకారుల బృందం ఆటాపాట రూపంలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలియజేశారు.
    5:38 PM, 2 Sep

    ప్రగతి నివేదన సభ పేరుతో కేసీఆర్ ఫ్లెక్సీలు, పోస్టర్లకు కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి బదులు నగరంలోని గుంతలు పూడ్చాలని కాంగ్రెస్ ఓ ట్వీట్ చేసింది.
    5:33 PM, 2 Sep

    తెలంగాణ కాంగ్రెస్ షాకింగ్ వీడియోను ఒకదానిని రీట్వీట్ చేసింది. సభకు వస్తున్న వారు వాహనాల్లోనే మందు తాగుతున్నారంటూ ఓ వీడియోను పోస్ట్ చేసింది. అందులో బస్సులోనే మందు తాగుతూ, తింటూ ఉన్నట్లుగా ఉంది. మనిషికి రూ.1000, తినడానికి పదార్థాలు, హైదరాబాద్ ప్రయాణించేందుకు ఆర్టీసీ బస్సులు ఇచ్చారని.. ప్రగతి నివేదన సభకు పెద్ద ఎత్తున జనాలు తరలి రావడానికి ఇవే కారణాలు అని పేర్కొన్నారు. ఇలా తాగుతూ వెళ్తే దేశంలోనే తెలంగాణ మద్యం అమ్మకాల్లో మొదటిస్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
    5:27 PM, 2 Sep

    వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని,కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారనే విషయం ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీలకు తెలుసునని కేటీఆర్ అన్నారు.ప్రజల వద్దకు వెళ్లడానికి ప్రతిపక్షాలు భయపడుతున్నాయన్నారు. వచ్చే అయిదేళ్లలో ఏం చేయబోతున్నామో కేసీఆర్ ఈ సభలో చెబుతారన్నారు.
    5:03 PM, 2 Sep

    ప్రగతి నివేదన సభ ప్రాంగణంలో మంత్రి కేటీఆర్‌తో సోదరి, ఎంపీ కవిత సెల్ఫీ తీసుకున్నారు.
    5:00 PM, 2 Sep

    కేసీఆర్ మరో కేబినెట్ భేటీని ఈ నెల 6న నిర్వహిస్తారని లేదు.. లేదు 4నే నిర్వహిస్తారనే ప్రచారం సాగుతోంది.
    4:59 PM, 2 Sep

    కొంగర్ కలాాన్ ప్రగతి నివేదన సభ వేదిక వద్దకు ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి వచ్చారు.
    4:59 PM, 2 Sep

    రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ ర్యాలీ నిర్వహిస్తోంది. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ... దేశంలోనే అతిపెద్ద తొలి రాజకీయ ర్యాలీ అని చెప్పారు.
    4:57 PM, 2 Sep

    తెలంగాణ రాష్ట్ర సమితి ర్యాలీకీ సిద్ధమైన కార్యకర్తలు.
    4:57 PM, 2 Sep

    కేబినెట్ భేటీ పైన, ప్రగతి నివేదన సభకు ర్యాలీపై కవిత స్పందించారు.
    4:42 PM, 2 Sep

    ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీ రామారావు హుషారుగా డోలు వాయించారు.
    4:39 PM, 2 Sep

    ఏ రోడ్లు చూసినా ప్రగతి నివేదన సభకు తరలివస్తున్న వాహనాలతో నిండిపోయాయి. దీంతో రోడ్లన్నీ గులాబీమయం అయ్యాయి. ముఖ్యంగా ట్రాక్టర్లు గులాబీ రంగు పులుముకొని ప్రగతి నివేదన సభకు తరలివస్తున్నాయి. ఈ సందర్భంగా వరుస కట్టి వస్తున్న ట్రాక్టర్లను డ్రోన్ ద్వారా వీడియో తీశారు. ఈ వీడియో చూడండి...
    4:24 PM, 2 Sep

    రంగారెడ్డి జిల్లాలో ఓ షాకింగ్ ప్రమాదం జరిగింది. అది స్వల్ప ప్రమాదమే. ప్రగతి నివేదన సభ నేపథ్యంలో అన్నిదారులు కొంగరగలాన్ వైపు సాగుతున్నాయి. దీంతో అక్కడి రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. ఈ సమయంలో ద్విచక్ర వాహనాన్ని మినీ ట్రక్ ఢీకొట్టింది.
    4:21 PM, 2 Sep

    సభకు హాజరయ్యే నిమిత్తం తెలంగాణ మంత్రులు కొంగరకలాన్ బయలుదేరారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రెండు హెలికాఫ్టర్లలో వారు బయలుదేరారు. సీఎం కేసీఆర్ కోసం మరో హెలికాఫ్టర్‌ను సిద్ధం చేశారు.
    4:16 PM, 2 Sep

    సమాచారం మేరకు మరో కేబినెట్ భేటీ సెప్టెంబర్ 6వ తేదీన జరగనుందని తెలుస్తోంది. అప్పుడు కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అంటున్నారు.
    3:56 PM, 2 Sep

    సీఎం కేసీఆర్ కటౌట్లను భారీ సంఖ్యలో ఏర్పాటు చేశారు. ఓ ఫ్లెక్సీలో శ్రీరాముడి రూపంలో కేసీఆర్ ఉంది.
    3:47 PM, 2 Sep

    ఈ సభకు 25 లక్షల మంది వస్తారని తెరాస నేతలు చెబుతున్నారు.
    3:27 PM, 2 Sep

    సభా ప్రాంగణంలో కేసీఆర్ నాలుగున్నరేళ్ల పాలనకు సంబంధించిన పలు అంశాలతో వీడియో ప్రదర్శించారు.
    3:26 PM, 2 Sep

    రాహుల్ గాంధీ సభకు కనీసం 25 వేల మంది రాలేదని, తమ సభకు 46 లక్షలమంది క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారని, బీరు, బిర్యానీ ఇచ్చి ప్రజలను సభలకు తరలించడం కాంగ్రెస్ నైజమని వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు.
    3:26 PM, 2 Sep

    ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని, పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే విషయాన్ని కేసీఆర్ చూసుకుంటారని, బీరు, బిర్యానీలు ఇచ్చి ప్రజలను సభలకు తరలించడం కాంగ్రెస్ నైజమని, తమ పార్టీ సభలకు అలా రారని మంత్రి కేటీఆర్ చెప్పారు.
    READ MORE

    English summary
    Over 25 lakh supporters likely to participate; over 20,000 police personnel to be deployed.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X