వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ లో మాజీ మంత్రులు , సీనియర్ నాయకులు సీఎం కేసీఆర్ పై అసంతృప్తితో ఉన్నారా ?

|
Google Oneindia TeluguNews

టిఆర్ఎస్ పార్టీలో మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు అసంతృప్తితో ఉన్నారా? కనీసం కెసిఆర్ కానీ, కెటిఆర్ కానీ వారిని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదా ? తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా సమూలంగా చెక్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ తప్ప అసంతృప్తితో ఉన్న నాయకులకు వేరే ప్రత్యామ్నాయం లేదా? అంటే అవును అని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

 బాబే కాదు జగన్, కేసీఆర్ యూపీఏతో జట్టు కడతారు : జగ్గారెడ్డి జోస్యం బాబే కాదు జగన్, కేసీఆర్ యూపీఏతో జట్టు కడతారు : జగ్గారెడ్డి జోస్యం

ప్రతిపక్షమే లేకుండా చేసేపనిలో టీఆర్ఎస్

ప్రతిపక్షమే లేకుండా చేసేపనిలో టీఆర్ఎస్

ముందస్తు ఎన్నికలకు వెళ్లిన గులాబీ బాస్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని సమర్థవంతంగా పాలన చేయాల్సిన టిఆర్ఎస్ సర్కార్ ప్రతిపక్ష పార్టీలను ఖాళీ చేసే పనిలో పడింది. అటు శాసనమండలిలో ప్రతిపక్షం లేకుండా చేసింది. అసెంబ్లీలో సైతం ప్రతిపక్షం లేకుండా చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక రాష్ట్రంలో తమపై ఎటువంటి వ్యతిరేక ప్రచారం రాకుండా ఎక్కడికక్కడ అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది టిఆర్ఎస్ సర్కార్.

మాజీ మంత్రులకు, వారి కోటరీకి న వేకెన్సీ అంటున్న టీఆర్ఎస్ అధిష్టానం

మాజీ మంత్రులకు, వారి కోటరీకి న వేకెన్సీ అంటున్న టీఆర్ఎస్ అధిష్టానం

ఇదిలా ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఒక వెలుగు వెలిగిన మాజీ మంత్రుల పరిస్థితి ఇప్పుడు అధ్వానంగా తయారైంది .రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్ క్యాబినెట్ లో స్థానం దొరకని మంత్రులు కలత చెందడం స్పష్టంగా కనిపిస్తుంది.

రాజకీయాల్లో దూసుకుపోతున్న కేసీఆర్ , తన కుమారుడిని కేటీఆర్ కు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యత అప్పజెప్పారు. రెండోసారి ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో సైతం కొత్తవారికి అవకాశం కల్పించారు. కొందరు మంత్రులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఇక అలాంటి వారికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పక్కన పెట్టేశారు గులాబీ బాస్. అంతేకాదు మాజీ మంత్రుల కోటరీలో ఉన్నవారికి ఎలాంటి పదవులు ఇవ్వాలన్నా కూడా గులాబీ బాస్ ఆసక్తి చూపించడం లేదని టాక్ వినిపిస్తోంది.

సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకని వైనం .. అసంతృప్తిలో మాజీ మంత్రుల గణం

సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకని వైనం .. అసంతృప్తిలో మాజీ మంత్రుల గణం

ఇక మాజీ మంత్రులకు, ఓటమిపాలైన నేతలకు మాట్లాడటానికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారట గులాబీ బాస్. దీంతో వారు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోసం సీఎం ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారట.

టిఆర్ఎస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు పార్టీ వీడి వెళ్లడానికి ప్రత్యామ్నాయం లేక, ఇటు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగలేక ఇబ్బంది పడుతున్నారట. టిఆర్ఎస్ హైకమాండ్ యొక్క వైఖరి నచ్చక మల్లగుల్లాలు పడుతున్న నేతలు ఏం చేయాలో పాలుపోని స్థితి లో ఉన్నారట. మొత్తానికి గులాబీ నేతల్లో అంతర్గతంగా ఉన్న అధిష్టానంపై వ్యతిరేక భావన ఏదో ఒక రోజు తప్పక బహిర్గతమవుతుంది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

English summary
With TRS winning a majority, this time the party Chief K. Chandrasekhar Rao's confidence has gone through the roof. With almost no Opposition, the government has managed to suppress any negative propaganda against it. It is also evident in the way Telangana Chief Minister has been functioning, soon after forming the government. Apparently, after he formed the new Cabinet, former ministers who did not find a place in Telangana Cabinet have been visibly upset.Apparently, former ministers have been trying to meet Telangana Chief Minister to recommend corporation posts for their coterie of people, who they had made promises to. However, with CM not showing any interest in meeting them, they are apparently annoyed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X