వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ దేవుడే కానీ..: స్వీయ గృహనిర్బంధంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

తనకు టికెట్ ఇవ్వకుంటే ఏం చేస్తానో తెలియదు అంటున్న మాజీ ఎమ్మెల్యే

చెన్నూరు: తనకు టికెట్ కేటాయించలేదని మనస్తాపంతో మంచిర్యాల చెన్నూరు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మంగళవారం స్వీయ గృహ నిర్బంధం విధించుకున్నారు. ఇటీవల టీఆర్ఎస్ ప్రకటించిన 105మంది అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

<strong>కొండగట్టు వద్ద ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు, 30మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు</strong>కొండగట్టు వద్ద ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు, 30మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

మందమర్రి మూడో జోన్‌లోని తన నివాసంలో గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయనతోపాటు భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు సందీప్, కుమార్తె జ్యోత్స్న, తల్లి పోచవ్వ కూడా ఇంట్లోనే ఉన్నారు. తనకు టికెట్ కేటాయింపుపై స్పష్టమైన హామీ ఇస్తే గానీ, తాను గృహ నిర్బంధం నుంచి బయటకు రానని ఆయన తేల్చి చెప్పారు.

TRS sitting MLA house arrests himself demanding TRS ticket

కాగా, స్థానిక నేతలు, కార్యకర్తలు నల్లాల ఓదేలుకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాను 2009 నుంచి ఎలాంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని నల్లాల ఓదేలు చెప్పారు. తాజా జాబితాలో సిట్టింగులు అందరికీ టికెట్ ఇచ్చి.. తనకు మాత్రమే ఇవ్వకపోవడం బాధించిందని అన్నారు.

TRS sitting MLA house arrests himself demanding TRS ticket

తనకు కేసీఆర్ ఇప్పటికీ దేవుడేనని నల్లాల ఓదేలు అన్నారు. బాల్క సుమన్ వల్లే తనకు టికెట్ రాలేదని ఆయన ఆరోపించారు. తనకు టికెట్ ఇచ్చేంత వరకు తన నిరసన కొనసాగిస్తానని ఓదేలు స్పష్టం చేశారు.

English summary
TRS sitting MLA Nallala Odelu house arrests himself today demanding MLA ticket from TRS party. He is saying he will not come out of the house until KCR confirms his ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X