• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ టార్గెట్ గా టీఆర్ఎస్ వ్యూహం ..పార్టీ శ్రేణులకు కేటీఆర్ కఠిన ఆదేశం

|

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. చాలా కఠినమైన ఆదేశాలు ఇచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి , రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల గురించి మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీలు టిఆర్‌ఎస్‌పై పైచేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నందున రాబోయే ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని కెటిఆర్ తన పార్టీ నాయకులను కోరారు.

పవన్ పార్టీ విషయంలో ముద్రగడ ఏం చేశారో తెలుసా .. లేఖలో జగన్ కు ఏం చెప్పారంటేపవన్ పార్టీ విషయంలో ముద్రగడ ఏం చేశారో తెలుసా .. లేఖలో జగన్ కు ఏం చెప్పారంటే

క్షేత్ర స్థాయి నుండే పార్టీని బలోపేతం చెయ్యాలని ఆదేశం .. మున్సిపల్ ఎన్నికల దిశా నిర్దేశం చేసిన కేటీఆర్

క్షేత్ర స్థాయి నుండే పార్టీని బలోపేతం చెయ్యాలని ఆదేశం .. మున్సిపల్ ఎన్నికల దిశా నిర్దేశం చేసిన కేటీఆర్

ఇక క్షేత్ర స్థాయి నుండే పార్టీని బలోపేతం చెయ్యాలని , పార్టీ సామర్థ్యాన్ని బూత్ స్థాయి నుండే మెరుగుపరిచేందుకు బలమైన కేడర్‌ను నిర్మించడంపై దృష్టి పెట్టాలని కెటిఆర్ గులాబీ పార్టీ కీలక నాయకులను ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల్లో చేదు అనుభవం చవి చూసిన తర్వాత రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం అప్రమత్తంగా వ్యవహరించాలని భావిస్తున్నారు. అందుకే మునిసిపాలిటీ ఎన్నికలపై కెసిఆర్ మరియు కెటిఆర్ ఇద్దరూ తమ దృష్టిని కేంద్రీకరించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కు షాక్ ఇచ్చిన బీజేపీ ..

పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ కు షాక్ ఇచ్చిన బీజేపీ ..

అధికారంలోకి వచ్చినప్పటి నుండి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలనే ప్రధాన ప్రత్యర్థులుగా భావించిన టీఆర్ఎస్ పార్టీ ఆ రెండు పార్టీల మీదే దృష్టి పెట్టింది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రంలో పాలన సాగిస్తున్న గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా ప్రత్యర్ధి పార్టీలకు చెక్ పెట్టింది. ఆపరేషన్ ఆకర్ష ద్వారా ఫిరాయింపులను ప్రోత్సహించి ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసింది. ప్రస్తుతం అసెంబ్లీ లో ప్రతిపక్ష హోదా లేకుండా ఏక చత్రాధిపత్యంగా పాలన సాగిస్తుంది. కానీ ఈమధ్యలో బీజేపీ చాప కింద నీరులా తెలంగాణా రాష్ట్రంలో తనపని తాను చేసుకుంటూ పోతుంది. టీఆర్ ఎస్ కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగటానికి ప్రయత్నం చేస్తుంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు సాధించి టీఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది.

బీజేపీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు .. మున్సిపల్ ఎన్నికలే టార్గెట్

బీజేపీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు .. మున్సిపల్ ఎన్నికలే టార్గెట్

ముఖ్యంగా కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవితను ఓటమి పాలు చేసింది. పైగా రాష్ట్రానికి కేంద్ర మంత్రి పదవి తెచ్చుకుని ఉనికిని చాటుకుంది. ఇక ఆ ఉత్సాహంతో మున్సిపల్ ఎన్నికలకు సిద్దమవుతోంది. దీంతో బీజేపీని తక్కువగా అంచనా వెయ్యటానికి లేదని ప్రజల్లోకి మరింత లోతుగా వెళ్లేందుకు కార్యాచరణను సిద్దం చేసుకుంది టీఆర్ఎస్ . అందులో భాగంగానే సభ్యత్వ నమోదును మొదలుపెట్టింది . కేసీఆర్ సైతం బీజేపీ వ్యుహాలను అంచనావేసి నడుచుకోవాలని, ఎట్టి పరిస్తితిలోనూ బీజేపీ మీద పైచేయి సాధించాలని ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ గా పని చెయ్యాలని పార్టీ నాయకులకు , శ్రేణులకు సూచిస్తున్నారు.

English summary
Telangana Rashtra Samithi working president K Tarakarama Rao interacted with the party cadre today and spoke about the coming municipality elections.KTR urged his party leaders not to take the coming elections lightly as the opposition parties are trying to gain an upper hand on TRS especially BJP .KTR ordered his party core-level leaders to concentrate on building a strong cadre so as to improve the party’s efficiency right from booth level .Interestingly, both KCR and KTR have set their main focus on municipality elections after facing a holy in parliamentary elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X