వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్ వ్యూహం ఫలించనుందా... కాంగ్రెస్ విలీనానికి 13 మంది సంతకాలు చేశారా ?

|
Google Oneindia TeluguNews

Recommended Video

కాంగ్రెస్ విలీనానికి 13 మంది సంతకాలు చేశారా ? || Oneindia Telugu

తెలంగాణా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఉనికిని ప్రశ్నార్ధకం చెయ్యనుందా? కాంగ్రెస్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసే దిశగా పావులు కదుపుతుందా? శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి శాసనసభాపక్షహోదా దక్కకుండా టీఆర్ఎస్‌ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిందా? అంటే అవును అనే సమాధానమే వస్తుంది.

రేణుకా చౌదరికి పువ్వాడ సవాల్ .. ఒక్క దొంగ ఓటు నిరూపించినా రాజీనామా చేస్తారేణుకా చౌదరికి పువ్వాడ సవాల్ .. ఒక్క దొంగ ఓటు నిరూపించినా రాజీనామా చేస్తా

ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేకుండా చేసే యోచనలో టీఆర్ఎస్ వ్యూహం

ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేకుండా చేసే యోచనలో టీఆర్ఎస్ వ్యూహం

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణా రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి లేకుండా చెయ్యటానికి వ్యూహత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరుతామని ప్రకటించిన ఎమ్మెల్యేలు త్వరలోనే టీఆర్ఎస్‌లో తమ శాసనసభపక్షాన్ని విలీనం చేస్తామని స్పీకర్‌కు లేఖను ఇచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 88స్థానాలు టీఆర్ఎస్ కైవశం చేసుకుంటే, కాంగ్రెస్ పార్టీ చావు తప్పి కన్ను లోట్టపోయిన చందంగా 19 స్థానాల్లో గెలుపొందింది .కనీసం గెలిచిన ఎమ్మెల్యేలను కూడా పార్టీ కాపాడుకోలేకపోతుంది. గులాబీ బాస్ ఆపరేషన్ తో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది.

ఆపరేషన్ ఆకర్ష్ లో గులాబీ బాట పట్టిన 13 మంది ఎమ్మెల్యేలు .. విలీనానికి లేఖ ఇచ్చే అవకాశం

ఆపరేషన్ ఆకర్ష్ లో గులాబీ బాట పట్టిన 13 మంది ఎమ్మెల్యేలు .. విలీనానికి లేఖ ఇచ్చే అవకాశం

టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడుతామని ప్రకటించారు. తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడ టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నట్టు సమాచారం.ఈ ముగ్గురు కూడ టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్ధం అయితే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడ దక్కని పరిస్థితి కూడ నెలకొంటుంది. టీఆర్ఎస్‌లో చేరేందుకు సిద్దంగా ఉన్న 13 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని వీలీనం చేస్తున్నట్టుగా స్పీకర్‌కు లేఖ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

లేఖపై సంతకాలు కూడా చేశారని ప్రచారం .. ఆ ముగ్గురూ కూడా గులాబీ గూటికేనా

లేఖపై సంతకాలు కూడా చేశారని ప్రచారం .. ఆ ముగ్గురూ కూడా గులాబీ గూటికేనా

ఇప్పటికే 13 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఈ లేఖపై సంతకాలు చేశారని తెలుస్తోంది. తాజాగా గండ్ర వెంకట రమణారెడ్డి, పోడెం వీరయ్య, జగ్గారెడ్డిలు కూడా టీఆర్ఎస్ లో చేరితే విలీనానికి ఛాన్స్ ఎక్కువగా వుంటుంది. మరి వారు కూడా సంతకం చేశారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం నాడు నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని టీఆర్ఎస్‌ శాసనసభపక్ష కార్యాలయంలో సమావేశమయ్యారు. వీలైతే ఈరోజు , కాకపోతే రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్షాన్ని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తున్నట్టుగా లేఖ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. అదే కనుక జరిగితే కాంగ్రెస్ శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే ప్రమాదం వుంది.

English summary
The TRS operation has already attracted 10 MLAs of Congress. The latest news is that the three MLAs are getting ready to join in the TRS. Even if the trio joins the TRS, the Congress will lost the status of the Opposition in the Assembly. The 13 MLAs who are willing to join the TRS are likely to give a letter to the Speaker as the Congress party is merging in the TRS legislature.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X