వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపి ప్రత్యేక హోదాకు మా మద్దతు ఉంటుంది : సీఎం కేసీఆర్

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం టీఆర్ఎస్ ఖచ్చితంగా మద్దతు తెలుపనుందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ గెలవబోతున్న 16 ఎంపీలతోపాటు ఎమ్ఐఎమ్ కూడ మద్దతు తెలుపనుందని ఆయన పేర్కోన్నారు.కాగా తెలంగాణ 17 ఎంపీలతోపాటు జగన్ పార్టీతో కలిపి 36 మంది ఎంపీలు ఏపి ప్రత్యేక హోదా కోసం పోరాడాతామని తెలిపారు.కాగా గతంలో కూడ తమ ఎంపీలు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ లో మద్దతు తెలిపారని గుర్తు చేశారు.మరో వైపు పోలవరం ప్రాజెక్టుపై కూడ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నరని ఆయన మండిపడ్డారు.

తాము తెలంగాణ ముంపును వ్యతిరేకించాము తప్ప ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పుడు అడ్డుకోలేదని స్పష్టం చేశారు. కాగా గోదావరి లో తెలంగాణకు 1000 టీంఎసీ నీళ్ల కేటాయింపు ఉందని వాటిని ఖచ్చితంగా వాడుకుంటామని ఆయన అన్నారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు పై ఆయన మండిపడ్డారు. చంద్రబాబులాంటీ కుట్రలు మేము చేయమని అన్నారు.

trs support to special status for ap ; cm kcr

చంద్రబాబు లాంటీ నాయకులతో పాటు ఆంధ్ర ప్రజలతో తెలంగాణ ప్రజలకు ఎలాంటీ వైషమ్యాలు లేవని అన్నారు.ఇదే విషయాన్ని సభలో ఉన్న ప్రజల చేత సైతం సీఎం కేసీఆర్ చెప్పించారు.కాగా లెటెస్ట్ సర్వే ప్రకారం చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని మరోసారి తేల్చి చెప్పారు.ఎన్నికల్లో భాగంగా వికారాబాద్ ఎన్నికల సభలో ఆయన పాల్గోని ప్రసంగించారు.ఈ సంధర్భంగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజీత్ రెడ్డిని గెలిపించాలని ఆయన కోరారు .

English summary
''trs full support to special status for ap ; and not against to polavaram project , before the elections also we fight for special status in parlament " says cm kcr
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X