హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ వ్యూహం, కెటిఆర్ 'ఒక్క అవకాశం': నాన్నకు ప్రేమతో....

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయానికి టిఆర్ఎస్ ఎంతో కృషి చేసింది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వ్యూహం, మంత్రి కెటి రామారావు కృషితో పాటు ఎన్నో అంశాలు కలిసి వచ్చాయి.

బల్దియాను ఊడ్చేసిన టిఆర్ఎస్,గెలిచింది వీరే..బల్దియాను ఊడ్చేసిన టిఆర్ఎస్,గెలిచింది వీరే..

ప్రభుత్వం పథకాలు ప్రభావం చూపాయి. అలాగే, గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టిడిపి, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నోసార్లు అవకాశాలిచ్చారని, తమకు ఒక్కసారి అవకాశమివ్వమన్న అంశం ప్రజలకు బాగా చేరింది.

KCR - KTR

అలాగే, ఇంటింటికి నల్లా నీరు, హైదరాబాదులో తాగు నీటికి రెండు సరస్సులు తదితర అంశాలు బాగా పని చేశాయి. మేయర్ పదవి గెలవకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ సవాల్ చేయడం పని చేసింది. కెసిఆర్ ఆది నుంచే వ్యూహాత్మక అడుగులు వేశారు.

పథకాల విషయం పక్కన పెడితే.. కెసిఆర్ వ్యూహం బాగా పని చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు డివిజన్ల బాధ్యతలను అప్పగించారు. ప్రతి ఓటరు వద్దకు వెళ్లి వ్యక్తిగతంగా కలిసి, ఏం చేశాం, ఏం చేస్తామో వివరించాలని సూచించారు. కెటిఆర్ గల్లీ గల్లీ తిరిగారు. పరేడ్ మైదానంలో కెసిఆర్ మాటలను ప్రజలు బాగా ఆలకించారు.

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలోను ప్రణాళిక ప్రకారం వెళ్లారు. మిగతా పార్టీలు అసంతృప్తులను బుజ్జగించడంలో విఫలమయ్యాయి. కానీ కెటిఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ తమ పార్టీ అసంతృప్తులను బుజ్జగించడంలో సఫలమయ్యారు.

తమకు బలం లేని చాలా చోట్ల బలం ఉన్న ఇతర పార్టీల నేతలను చేర్చుకొని గెలుపు దిశలో సాగారు. గెలుపులో... నేతలకు బాధ్యతలు అప్పగించడం, కెటిఆర్ గల్లీ గల్లీ తిరగడం, రాజీనామా సవాల్ చేయడం, పథకాలు, పరేడ్ మైదానంలో కెసిఆర్ మాటలు, నగరానికి మంచి నీటి సరస్సు, ఇతర పార్టీల వారిని చేర్చుకోవడం, తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించడం.. ఇవన్నీ కలిసి వచ్చాయి.

English summary
TRS sweeps Hyderabad civic polls; Congress, TDP nearly wiped out.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X