వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొడంగల్ బైపోల్‌కు టిఆర్ఎస్ ప్లాన్, రేవంత్‌పై కెసిఆర్ ప్లాన్ ఇదే

రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ ఇంకా తెలంగాణ స్పీకర్‌కు చేరలేదు. అయితే దమ్ముంటే రాజీనామా లేఖను స్పీకర్‌కు అందించాలని టిఆర్ఎస్‌ రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేస్తోంది. టిడిపి కూడ ఇదే డిమాండ్‌ చేస్తోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ ఇంకా తెలంగాణ స్పీకర్‌కు చేరలేదు. అయితే దమ్ముంటే రాజీనామా లేఖను స్పీకర్‌కు అందించాలని టిఆర్ఎస్‌ రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేస్తోంది. టిడిపి కూడ ఇదే డిమాండ్‌ చేస్తోంది. రేవంత్‌రెడ్డి చంద్రబాబునాయుడుకు రాజీనామా లేఖను ఇవ్వలేదని టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు.

రంగంలోకి ఆ ఇధ్దరు మంత్రులు: రేవంత్‌కు చెక్ పెట్టే ప్లాన్ ఇదే!రంగంలోకి ఆ ఇధ్దరు మంత్రులు: రేవంత్‌కు చెక్ పెట్టే ప్లాన్ ఇదే!

రేవంత్‌రెడ్డి టిడిపికి రాజీనామా చేసే సమయంలో ఎమ్మెల్యే పదవికి కడ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కార్యాలయంలో ఇచ్చారని ప్రచారం సాగింది.అయితే బాబుకు రాజీనామా లేఖ ఇవ్వలేదని టిడిపి నేతలు ప్రకటించడంతో రాజీనామా విషయమై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.

రేవంత్‌కు షాక్: టిడిపిలోనే అనురాధ, ఆ కుటుంబంపైనే పార్టీల దృష్టిరేవంత్‌కు షాక్: టిడిపిలోనే అనురాధ, ఆ కుటుంబంపైనే పార్టీల దృష్టి

రంగంలోకి హరీష్: రేవంత్‌పై కెసిఆర్ మైండ్‌గేమ్ రంగంలోకి హరీష్: రేవంత్‌పై కెసిఆర్ మైండ్‌గేమ్

మోత్కుపల్లి: రేవంత్‌కు చెక్‌ కోసమే టిఆర్ఎస్ పొత్తు, ఒంటరి పోరేనా?మోత్కుపల్లి: రేవంత్‌కు చెక్‌ కోసమే టిఆర్ఎస్ పొత్తు, ఒంటరి పోరేనా?

తాజాగా రాజీనామా లేఖను స్పీకర్‌కు సమర్పించాలని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు.

రేవంత్‌రెడ్డి రాజీనామాకు డిమాండ్

రేవంత్‌రెడ్డి రాజీనామాకు డిమాండ్

పార్టీకి రాజీనామా చేసిన సమయంలోనే ఎమ్మెల్యే పదవికి కూడ రాజీనామా చేసినట్టు రేవంత్‌రెడ్డి లేఖ పంపినట్టు మీడియాకు లెటర్ పంపారు. అయితే ఈ లేఖ చంద్రబాబునాయడు కార్యాలయంలో అందజేసినట్టు రేవంత్ రెడ్డి ప్రకటనలో వాస్తవం లేదని తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ ప్రకటించారు. అయితే అసలు రేవంత్ రెడ్డి రాజీనామా విషయమై సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే కొడంగల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగాలని టిఆర్ఎస్ కోరుకొంటుంది. అయితే ఈ స్థానానికి ఎన్నికలు జరగాలంటే రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ స్పీకర్‌కు చేరాలి. రాజీనామాను స్పీకర్ ఆమోదించాలి. ఆ తర్వాత ఆరు మాసాలకు ఎన్నికలు జరుగుతాయి. అయితే ఇంత కాలంగా రాజీనామా లేఖ స్పీకర్ కార్యాలయానికి చేరకపోవడంతో ప్రత్యర్థులు రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తెస్తున్నారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

కొడంగల్‌లో రేవంత్‌కు చెక్ పెట్టేలా.

కొడంగల్‌లో రేవంత్‌కు చెక్ పెట్టేలా.

కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టేందుకు టిఆర్ఎస్ వ్యూహలను రచిస్తోంది. మంత్రి హరీష్ రావు నేతృత్వంలో జిల్లాకు చెందిన మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, వికారాబాద్ జిల్లా మంత్రి పి. మహేందర్‌రెడ్డిలు యాక్షన్‌లోకి దిగారు. రేవంత్‌రెడ్డి వర్గీయులను టిఆర్ఎస్‌లో చేర్పించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను కూడ టిఆర్ఎస్‌లో చేర్చేలా ప్లాన్ చేస్తున్నారు టిఆర్ఎస్ నేతలు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేః

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితేః

రేవంత్ రెడ్డి రాజీనామా లేఖ స్పీకర్ చేరుకొంటే ఆ రాజీనామాపై స్పీకర్ నిర్ణయం తీసుకొంటారు.అయితే ఇప్పటికిప్పుడు రాజీనామా ఆమోదం పొందితు ఆరు మాసాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇంకా జాప్యం జరిగితే రాజకీయ సమీకరణల్లో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాజకీయంగా తమకు అనుకూలంగా ఉంటుందని టిఆర్ఎస్ భావిస్తోంది. ఈ కారణంగానే రేవంత్ రెడ్డి రాజీనామా విషయమై ఒత్తిడి తెస్తోంది.

రెండు పార్టీలతో సయోధ్య కుదిరేనా

రెండు పార్టీలతో సయోధ్య కుదిరేనా

రేవంత్ రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే రేవంత్ రెడ్డిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డికి ముఖ్య అనుచరులు కొందరు టిఆర్ఎస్‌లో చేరారు. కొందరు ఇంకా రేవంత్ రెడ్డితో ఉన్నారు. అయితే టిడిపిలో తనతో పాటే ఉండి ఏ పార్టీలో చేరకుండా ఉన్న అనుచరులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ప్రతి గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేయనున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే రెండు పార్టీల మధ్య సయోధ్య కుదురుతోందా అనేది ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇప్పటివరకు గ్రామాల్లో ఈ రెండు పార్టీల మధ్యే వివాదాలు సాగాయి. దీంతో ప్రస్తుతం కమిటీలు ఏర్పాటు చేస్తే ఇద్దరి మద్య వివాదాలు సమసిపోతాయా లేదా అనేది ఉత్కంఠగా మారింది.

English summary
TRS and TDP demanded Revanth Reddy submit resignation letter to Speaker.Revanth Reddy resignation letter not yet received speaker.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X