వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీఆర్ఎస్‌లో చేర్చుకునేందుకు ఎమ్మెల్యేలపై అంతలా ఒత్తిడి తెచ్చారా...?మనస్సు విప్పిన ఓ నేత...!

|
Google Oneindia TeluguNews

టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు అభివ‌ృద్ది మీద ఆకాంక్షతో పార్టీలో చేరారా...లేక వ్వక్తిగత అవసరాల కోసం టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారా... ఇవి రెండు కాకుండా పార్టీ అధికార పార్టీ బెదిరింపులు, వేధింపుల తట్టుకోలేక పార్టీలో చేరారా అనేది మరోసారి చర్చనీయాంశమైంది.టీఆర్ఎస్ పార్టీలో చేరాలని మాజీ మంత్రి తుమ్మల తీవ్ర ఒత్తిడి తెచ్చారని, అయన్ను తప్పించుకునేందుకు వారం రోజుల పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లాలని, టీడీపీ ఎఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు ఓ మీడీయాకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు.

గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు భారీ మెజారీటీ

గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు భారీ మెజారీటీ

గడచిన ఎన్నికల్లో భారీ మెజారీటీతో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి, ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికార పీఠం అదిష్టించిన విషయం తెలిసిందే... టీఆర్ఎస్ పార్టీకి 81 సీట్లను కట్టబెట్టి పూర్తీ అధిక్యాన్ని ప్రజలు టీఆర్ఎస్‌కు ఇచ్చారు. అయినా ప్రతి పక్షపార్టీలైన కాంగ్రెస్, టీడీపీలను మరోసారి కోలుకోని దెబ్బకోట్టారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి మెజారటీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఇక టీడీపీ నుండి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో కూడ ఒకరు పార్టీని వీడీ టీఆర్ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే...

అధికార పార్టీ ఒత్తిడిలు తెచ్చిందని తేల్చిన టీడీపీ ఎమ్మెల్యే

అధికార పార్టీ ఒత్తిడిలు తెచ్చిందని తేల్చిన టీడీపీ ఎమ్మెల్యే

అయితే వీరంతా పార్టీలో చేరే సమయంలో మాత్రం నియోజక వర్గ అభివృద్దితో పాటు సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్దికి అకర్షితులై పార్టీలో చేరుతున్న ప్రకటించారు. అయితే వారు చెబుతున్న మాటలపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా అంతమంది ఎమ్మెల్యేలు చేరడంలో ప్రభుత్వ పాత్ర ఉందనే అనుమానాలు బహిరంగానే కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది. ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురి చేసి పార్టీలో చేర్పించుకున్నారని కాంగ్రెస్ పార్టీ సైతం ఆరోపణలు చేసింది. కాని వాటిని పార్టీ ఎమ్మెల్యేలు కొట్టిపారేసినప్పటికి ప్రభుత్వ ఒత్తిడిలు నిజమని టీడీపీ ఎమ్మెల్యే కుండబద్దలు కొట్టారు.

తుమ్మల నాపై ఒత్తిడి తెచ్చారు...

తుమ్మల నాపై ఒత్తిడి తెచ్చారు...

ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో టీడీపీ నుండి ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వర్‌రావు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేత మాజీ మంత్రి తుమ్మల తనను టీఆర్ఎస్‌లో చేరాలని ఒత్తిడి తెచ్చారని ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తుమ్మల వల్లే టీడీపీలో చేరానని చెప్పారు. అనంతరం ఆయన టీఆర్ఎస్‌లో చేరినప్పుడు కూడ పార్టీలోకి ఆహ్వానించారని చెప్పారు.

వారం రోజులు తుమ్మలకు దొరక్కుండా వెళ్లాను..

వారం రోజులు తుమ్మలకు దొరక్కుండా వెళ్లాను..

ఇక గత ఎన్నికల్లో కూడ తన బావ టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు పై పోటి చేసి గెలవడంతో వారం రోజుల పాటు తుమ్మల నాగేశ్వరావు నాపై ఒత్తిడి తెచ్చారని ఆయన వివరించారు. ఆయన భయానికి వారం రోజుల పాటు అయితే వారం రోజులు ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ, తిరుపతి, బెంగళూరు వెళ్లి ఆయనకు దొరక్కుండా తప్పించుకున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే వ్యక్తిత్వాన్ని అమ్ముకునే పరిస్థితి లేదని అందుకే పార్టీ మారలేదని చెప్పారు.మొత్తం మీద పార్టీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి పని చేయడంతోనే అధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్నారనేది నాగేశ్వర్ రావు చెప్పిన అంశాలను బట్టి తెలుస్తోంది.

English summary
Tummala Nageswara Rao put pressure on me for a week after i won for joinig TRS party,says tdp mla m. nageshwar rao, He said that he was afraid for a week, but on weekdays he went to Elur, Tadepalligudem, Vijayawada, Tirupati and Bangalore.''Mecha Nageswara Rao said in a interview
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X