• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పొరుగు రాష్ట్రంలో మన జెండా ఎగరాలి -నాకు రాజకీయం ఒక టాస్క్ : కేసీఆర్..!!

|
Google Oneindia TeluguNews

జాతీయ పార్టీ ప్రకటన వేళ సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమైన టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తూ టీఆర్ఎస్ కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. సరిగ్గా 1.19 గంటలకు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేసారు. ఈ సమావేశానికి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామితో పాటుగా తమిళనాడు నేతలు పాల్గొన్నారు. తెలంగాణలో అమలు చేస్తన్న పథకాలను ప్రస్తావించిన కుమార స్వామి వాటిని ప్రశంసించారు. దేశమంతా ఇలాంటి పథకాలు అమలు కావాలని ఆకాంక్షించారు.

రైతు సంక్షేమమే అజెండాగా

రైతు సంక్షేమమే అజెండాగా


కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడిగా అభివర్ణించారు. బీఆర్ఎస్ సక్సెస్ కావాలని తాను కోరుకుంటున్నట్లుగా కుమార స్వామి చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రాజకీయం ఒక టాస్క్ అని ప్రకటించారు. దేశంలో చాలా పార్టీలకు రాజకీయం ఒక క్రీడలా మారిపోయిందని వ్యాఖ్యానించారు. దేశంలో రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసారు. రైతు సంక్షేమమే ప్రధాన ఏజెండాగా తన పార్టీ ముందుకు వెళ్తుందని స్పష్టం చేసారు. ఇంత ఆహార భద్రత ఉన్న రాష్ట్రంలో పాసింగ్ ఫుడ్ పైన ఆధారపడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. విదేశాల నుంచి ప్రాసెసింగ్ ఫుడ్ దిగుమతి చేసుకోవడం దారుణమన్నారు.

పొరుగు రాష్ట్రాల్లో విస్తరిద్దాం

పొరుగు రాష్ట్రాల్లో విస్తరిద్దాం


తమ పార్టీ తొలి అడుగులు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర -కర్ణాటకలో కార్యాచరణ ప్రారంభం అవుతుందని చెప్పారు. అక్కడి రైతులకు మేలు జరిగేలా ముందుగా ప్రయత్నం చేద్దామని వివరించారు. దేశంలో అనేక ప్రాంతాలు తిరిగినప్పుడు టిఆర్ఎస్ మీ రాష్ట్రానికి పరిమితం చేస్తే ఎలా అని చాలామంది అడిగారని చెప్పిన కేసీఆర్..దేశ ప్రజల కోసమే బీఆర్ఎస్ అని స్పష్టం చేసారు. జాతీయ పార్టీగా గుర్తింపులో ఖరారు సమయంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా పార్టీ కొనసాగింపుకు అవాంతరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గులాబీ రంగు జెండా- కారు గుర్తు కొనసాగుతాయని పార్టీ నేతలు వెల్లడించారు. ములాయం అనారోగ్యంతో ఉండటంతో అఖిలేష్ ను వద్దని చెప్పానని..త్వరలోనే అందరూ వస్తారని చెప్పారు.

ఎన్నికల సంఘం ఆమోదం కోసం

ఎన్నికల సంఘం ఆమోదం కోసం


తీర్మానంలో ఆమోదించిన విధంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ ఆమోదించిన తీర్మానం కాపీనీ ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఢిల్లీలో ఇప్పటికే సర్ధార్ పటేల్ రోడ్‌లో భారత్‌ రాష్ట్ర సమితి కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకు సర్దార్ పటేల్ మార్గ్‌లో ఉన్న జోధ్‌పూర్‌ రాజ వంశీయుల బంగ్లాను లీజుకు తీసుకున్నట్టు తెలుస్తోంది. వసంత్ విహార్‌లో 2021 సెప్టెంబర్ 2న పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయగా 1200 చదరపు మీటర్ల విస్తర్ణంలో భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇక, ఇప్పుడు కేసీఆర్ పార్టీ భవిష్యత్ కార్యాచరణ పైన స్పష్టత ఇవ్వనున్నారు.

English summary
CM KCR reveals BRS ACtion plan on neighboursing states, says first step in Maharastra on farmers issue
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X