వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఎమ్మెల్యేలను వదలరా .. కాంగ్రెస్ ను ఖాళీ చేసేస్తారా .. నిజం ఒప్పుకున్న తుమ్మల ?

|
Google Oneindia TeluguNews

స్పష్టమైన మెజారిటీతో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేసే పనిలో పడింది. కాంగ్రెస్ పార్టీలోని మిగిలిన ఎమ్మెల్యేలను కూడా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్తుంది. ఎన్నికల సమయంలో తుమ్మల చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ను బలహీన పరచటానికా? అన్న భావన కూడా వ్యక్తం అవుతుంది.

తుమ్మల , ఎర్రబెల్లికి తలంటిన కేసీఆర్ ? ఓటర్లను తిట్టిన ఫలితం !?తుమ్మల , ఎర్రబెల్లికి తలంటిన కేసీఆర్ ? ఓటర్లను తిట్టిన ఫలితం !?

కాంగ్రెస్ లో మిగిలిన ఎమ్మెల్యేలను వదలరట .. గులాబీ నేతలు .. సెలవిచ్చిన తుమ్మల

కాంగ్రెస్ లో మిగిలిన ఎమ్మెల్యేలను వదలరట .. గులాబీ నేతలు .. సెలవిచ్చిన తుమ్మల

ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా 2014 ఎన్నికల్లో టీడీపీ ని ఖాళీ చేసినట్లుగా, ఈసారి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయడం టార్గెట్ గా పెట్టుకుంది. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమైన నాయకులను పదవులను ఆశ చూపి గులాబీ గూటికి చేరుకుంటున్న వైనంపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అనైతికం అంటూ ఆక్రోశిస్తున్నాయి.

ఇక పార్టీ వీడి గులాబీ గూటికి చేరిన నేతలు వెళ్తూ వెళ్తూ ఇంతకాలం ఉన్న కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తిపోశారు. తలా ఒక రాయి వేసి వెళ్లారు. అయితే తాజాగా తుమ్మల చేసిన వ్యాఖ్యలు అంతర్గతంగా పార్టీ చేస్తున్న పనులను తేటతెల్లం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలోని మిగతా నేతలను కూడా కారెక్కించే పనిలో బిజీగా ఉన్నారట గులాబీ నాయకులు.

కాంగ్రెస్స్ నేతలు టీఆర్ ఎస్ కు పార్టీ ఫిరాయించింది అలాగేనట

కాంగ్రెస్స్ నేతలు టీఆర్ ఎస్ కు పార్టీ ఫిరాయించింది అలాగేనట

కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో ఈ 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ బాట పట్టారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలందరూ కెసిఆర్ పనితీరుకు ఆకర్షితులై పార్టీ మారుతున్నట్టు చెప్పుకొచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్ తోనే సాధ్యం అవుతుందని ప్రకటనలు చేశారు. కానీ అది నిజం కాదని పార్టీ మార్చే పనిలో టీఆర్ ఎస్ ఉందని సాక్షాత్తు తుమ్మల నాగేశ్వర రావే సెలవిచ్చారు.

కాంగ్రెస్ ను ఖాళీ చేసే ప్రయత్నం ..మొత్తానికి నిజం ఒప్పుకున్న తుమ్మల ...

కాంగ్రెస్ ను ఖాళీ చేసే ప్రయత్నం ..మొత్తానికి నిజం ఒప్పుకున్న తుమ్మల ...

ఇక కాంగ్రెస్ పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలను కూడా టిఆర్ఎస్ పార్టీలోకి తీసుకు వచ్చే పనిలో బిజీగా ఉన్నారట గులాబీ నేతలు. ఎమ్మెల్యేలంతా టీఆర్‌ఎస్‌ వైపే చూస్తున్నారని, కాంగ్రెస్‌లో ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మిగిలారని , వాళ్లను కూడా పార్టీలోకి తీసుకునే ప్రయత్నం జరుగుతోందని టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం పార్టీ ఫిరాయింపుల పాపం టీఆర్ఎస్ దే అని ఒప్పుకున్నట్టు అని భావిస్తున్నారు ప్రతిపక్ష నేతలు.

తుమ్మల వ్యాఖ్యలతో కాంగ్రెస్ కు టెన్షన్

తుమ్మల వ్యాఖ్యలతో కాంగ్రెస్ కు టెన్షన్

టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి మరీ కాంగ్రెస్ నేతలను పార్టీ ఫిరాయింపులు చేయిస్తుందని స్వయంగా తుమ్మల చేసిన వ్యాఖ్యలతో అర్ధం అవుతుంది . అశ్వరావుపేట లో మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకురావడానికి ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడం కాంగ్రెస్ శ్రేణులకు టెన్షన్ పుట్టిస్తుంది. అంతే ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. ఎన్నికల వేళ తుమ్మల చేసిన ఈ కామెంట్ కాంగ్రెస్ ను బలహీనపరుస్తుందో .. తుమ్మలకు తలనొప్పి తెచ్చి పెడుతుందో .

English summary
TRS leaders are busy working to get the remaining MLAs in the Congress party to TRS, said Thumala Nageshwar Rao. TRS leader Thummala Nageswara Rao made the announcement that the MLAs are looking at the TRS and there are some MLAs left in the Congress and the party is trying to get them into the party.With this comments The Congress is tensioning. Tummala's comments reflects that the TRS party is the reason for the defects of the congress party MLA's.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X