హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : Survey Reports తెరాస వైపు మొగ్గు చూపిన పలు సర్వేలు | Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు మరో పన్నెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్, అటు కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి గెలుపుపై ధీమాగా ఉన్నాయి. తమకు 70 నుంచి 80 స్థానాలు వస్తాయని కాంగ్రెస్ చెబితే, 100కు పైగా స్థానాలు వస్తాయని తెరాస చెబుతోంది.

ఈ నేపథ్యంలో పలు జాతీయ ఛానళ్లు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరాంలతో పాటు తెలంగాణలోను సర్వేలు నిర్వహించాయి. ఎక్కువ సర్వేల్లో తెరాస అధికారంలోకి వస్తోందని వెల్లడైంది. ఒకటి రెండు సర్వేలు మాత్రం మహాకూటమి గెలుస్తుందని చెప్పాయి. అయితే ఇటీవల విడుదలైన సర్వేలు తెరాస వైపు మొగ్గు చూపాయి.

చరిత్రలో తొలిసారి కాంగ్రెస్ వేదిక నుంచి మాట్లాడుతున్నా, కాంగ్రెస్‌తో కలుద్దామని నేనే చెప్పా: ఎల్ రమణచరిత్రలో తొలిసారి కాంగ్రెస్ వేదిక నుంచి మాట్లాడుతున్నా, కాంగ్రెస్‌తో కలుద్దామని నేనే చెప్పా: ఎల్ రమణ

ఇండియా టుడే సర్వే

ఇండియా టుడే సర్వే

ఇండియా టుడే ఇటీవల తెలంగాణలో ఎవరు గెలుస్తారనే దానిపై సర్వే చేసింది. ఈ సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి 95 నుంచి 103 సీట్లు వస్తాయని తేలింది. మహాకూటమికి 9 నుంచి 13 సీట్లు వస్తాయని తేలింది. ఇదీ కాంగ్రెస్, తెలుగుదేశం, తెలంగాణ జన సమితి, సీపీఐ నేతృత్వంలోని మహాకూటమికి భారీ దెబ్బ.

ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనా

ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ పైనా

సర్వేలు చెప్పినట్లు మహాకూటమి ఓడిపోయినా లేక దారుణంగా ఓడిపోయినా చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీల దోస్తీని ప్రజలు తిరస్కరిస్తున్నట్లేనని అనుకుంటున్నారు. ఈ ప్రభావం 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ పైన కూడా పడనుందని చెబుతున్నారు.

టీవీ 5 ఫ్లాష్ సంస్థ సర్వే

టీవీ 5 ఫ్లాష్ సంస్థ సర్వే

టీవీ 5, ఫ్లాష్ సంస్థ సర్వేలో తెరాసకు 90 లేదా ప్లస్ 5 సీట్లు వస్తాయని తేలింది. ఇక మహాకూటమికి 15 ప్లస్ 5 సీట్లు వస్తాయని తేలింది. 2014 ఎన్నికల్లో తెరాస 63 సీట్లలో గెలిచింది. ఆ తర్వాత దాదాపు ముప్పై మంది తెరాస తీర్థం పుచ్చుకున్నారు. అప్పుడు టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు కలిసి 36 సీట్లు వచ్చాయి. ఇప్పుడు వారి సీట్లు 20కి అటు ఇటు ఉండేలా కనిపిస్తోంది.

ఎన్డీటీవీ సర్వే

ఎన్డీటీవీ సర్వే

ఎన్డీటీవీ సర్వేలో తెరాసకు 85 సీట్లు, మహాకూటమికి 15 సీట్లు వస్తాయని తేలింది. రెండు రోజుల క్రితం వచ్చిన టైమ్స్ నౌ సర్వేలో తెరాసకు 70 సీట్లు, మహాకూటమికి 33 సీట్లు వస్తాయని తెలింది. ఈ సర్వేలో రాహుల్ గాంధీ, చంద్రబాబు దోస్తీని ఎక్కువ మంది వ్యతిరేకించారు. అలాగే జాతీయస్థాయిలో రాహుల్ గాంధీ కంటే నరేంద్ర మోడీ వైపే ఎక్కువ మంది మొగ్గు చూపారు.

ముఖ్యమంత్రిగా కేసీఆర్

ముఖ్యమంత్రిగా కేసీఆర్

ముఖ్యమంత్రి విషయానికి వస్తే తెలంగాణలో 75 శాతం మంది మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. కేవలం 25 శాతం మంది మాత్రమే ఇతరులను ముఖ్యమంత్రిగా కోరుకున్నారు. ఈ అంశం ఇండియా టుడే సర్వేలో తేలింది. వీడీపీ సర్వేలో తెరాసకు 45 శాతం ఓట్లు వస్తాయని తేలగా, మహాకూటమికి 27 శాతం వస్తాయని తేలింది. ఇండియా టుడే-ఆజ్ తక్ సర్వేలో తెరాసకు 48 శాతం ఓట్లు వస్తాయని తేలగా, మహాకూటమికి 15 శాతం వస్తాయని తేలింది. కాగా, ఈ సర్వేలను తెరాస సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. కాగా ఒకటి రెండు సర్వేలు మాత్రం మహాకూటమికి 80 సీట్ల వరకు వస్తాయని, తెరాసకు 40 సీట్ల వరకు వస్తాయని వెల్లడించగా, మరో సర్వే ఏ పార్టీకి మెజార్టీ రాదని చెప్పింది.

English summary
Telangana Rastra Samithi will sweep Telangana Elections 2018, saying all Survey Reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X