హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీఆర్ఎస్ మహిళా నేతపై దుండగుల దాడి: బీజేపీ పనేనంటూ ఆరోపణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సికింద్రాబాద్ బీజేపీలో అంతర్గత విభేదాలు రోడ్డుమీదకు వచ్చాయి. నడిరోడ్డుపైనే ఇరువర్గాల బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాముపై శారదా మల్లేష్ దాడి చేశారు. దీంతో నేతలిద్దరు రోడ్డుపైనే కొట్టుకున్నారు.

ఒకరినొకరు దూషించుకుంటూ, తోసుకుంటూ ఘర్షణ పడ్డారు. ఆ తర్వాత ఈ నేతలు బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఇంటికి వెళ్లారు. దీంతో అక్కడికి ఇరువర్గాల కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.

 trs woman leader attacked by some thugs

తార్నాక డివిజన్ లాలాపేట్‌లో జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమవేశంలో తార్నాక డివిజన్ అధ్యక్షుడు రాము ప్రోటోకాల్ ప్రకారం తనను వేదికపైకి ఆహ్వానించలేదనే కోపంతోనే శారదా మల్లేష్ ఈ దాడికి దిగినట్లు సమాచారం. రామచంద్రరావు చర్చలు జరిపి ఇరువర్గాల నేతలను శాంతిపర్చినట్లు తెలిసింది.

టీఆర్ఎస్ మహిళా నేతపై దుండగుల దాడి..
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధి వినాయకనగర్‌లో టీఆర్ఎస్ మహిళా నేత చైతన్య రెడ్డిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇంట్లోని ఫర్నీచర్ ధ్వంసం చేసి, తనను విచక్షణారహితంగా కొట్టారని చైతన్య రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దుండగులు తన మీద డైనింగ్ టేబుల్ గ్లాసును ఎత్తేసేందుకు ప్రయత్నించగా తాను తప్పించుకున్నాట్లు తెలిపారు. ఆ తర్వాత తన గొంతు నులిమేందుకు ప్రయత్నించారని చెప్పారు. బీజేపీ నాయకులే తనపై ఈ దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గాయాలు కావడంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

English summary
trs woman leader attacked by some thugs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X